మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్, వియత్నాం దేశాల సంయుక్త ప్రకటన

May 06th, 05:24 pm

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం దేశాధ్యక్షుడు శ్రీ తో లామ్ 2026 మే 05 నుంచి మే 07 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈయనతో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో పాటు వ్యాపార ప్రతినిధుల బృందం కూడా పర్యటనలో పాల్గొంది.

వియత్నాం అధ్యక్షుడి అధికారిక భారత పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు

May 06th, 03:44 pm

ఐఆర్ఈఎల్ (భారత్), వియత్నాంకు చెందిన రేడియోధార్మిక - అరుదైన మూలకాల సాంకేతిక సంస్థ (ఐటీఆర్ఆర్ఈ) మధ్య పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందం

వియత‌్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం అధ్యక్షుడితో ఉమ్మడి మీడియా సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన

May 06th, 01:00 pm

భారత్-వియత్నాం భాగస్వామ్యంలో వారసత్వం, అభివృద్ధి రెండూ కీలకమే. గతేడాది భారత్ నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాలను వియత్నాంకు తీసుకువెళ్లినప్పుడు అక్కడి జనాభాలో సుమారు పదిహేను శాతం మంది అంటే.. పదిహేను మిలియన్లకు పైగా ప్రజలు వాటిని దర్శించుకున్నారు. మన ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించేందుకు, వియత్నాంలోని మై సన్, న్హాన్ టవర్స్ వద్ద ప్రాచీన చాం నాగరికత దేవాలయాల పునరుద్ధరణను మేం చేపడుతున్నాం. చాం నాగరికతకు సంబంధించిన రాతప్రతులను కూడా డిజిటలైజ్ చేసి, ఈ అమూల్యమైన వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరుస్తున్నాం.

సోషలిస్టు రిపబ్లిక్ వియత్నాం అధ్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంగా శ్రీ తో లామ్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

April 07th, 12:32 pm

కొత్త అధ్యక్షుని నాయకత్వంపై ప్రధానమంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాల పరీక్షకు తట్టుకొని నిలిచిన భారత్, వియత్నాంల మైత్రి రాబోయే కాలంలో మరింత బలోపేతం అవుతుందని ప్రధాని అన్నారు. రెండు దేశాల ప్రజలతో పాటు ఈ ప్రాంతం కూడా పురోగమించేలా, సమృద్ధి పథంలో పయనించేలా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని శ్రీ మోదీ తెలిపారు.

వియత్నాం దేశాధ్యక్షుడు, అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి తూ లాం తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ

September 24th, 12:27 am

ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ‘సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్’ సమావేశాల నేపథ్యంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియత్నాం దేశ అధ్యక్షుడు, అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తూ లాం తో ఈ నెల 23న సమావేశమయ్యారు.