Tiruchirappalli turns out in huge numbers for PM Modi’s public meeting
March 11th, 06:00 pm
At a massive public meeting in Tamil Nadu’s Tiruchirappalli, Prime Minister Narendra Modi hailed Tiruchirappalli as a land of courage and faith, recalling the bravery of the Marudu Brothers and paying tribute to Major M. Saravanan for his sacrifice during the Kargil War. “Trichy is a land of courage and faith,” he said, adding that the Centre proudly honours Tamil Nadu’s culture and heritage. He also highlighted that C. P. Radhakrishnan, a son of the state, serves as the Vice President of India.తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 11th, 05:45 pm
తమిళనాడు భవిష్యత్తుకు నేటి కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఇది ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు సంబంధించినది. ఈ ప్రాజెక్టులు: స్వచ్ఛ ఇంధనం కోసం మౌలిక సదుపాయాలు, పెట్రోలియం సంబంధిత తయారీ రంగాలు, రహదారులు, రైల్వేలు, గ్రామీణ రోడ్లకు సంబంధించినవి. ఇవి ఇంధన లభ్యతను, అనుసంధానాన్ని పెంచుతాయి తమిళనాడు యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి.తమిళనాడులోని తిరుచిరాపల్లిలో దాదాపు ₹5,650 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 11th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తమిళనాడులోని చారిత్రక నగరం తిరుచ్చిలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతోపాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా పరిణామాత్మక అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ మేరకు రూ.5600 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్య రహిత ఇంధనం, పెట్రోలియం సంబంధిత తయారీ, హైవే-రైల్వే, గ్రామీణ రహదారుల రంగాల్లో ఈ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- “ఇవన్నీ తమిళనాడు యువతకు ఇంధన లభ్యత, బహుళ రవాణా అనుసంధానం సహా వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి” అని పేర్కొన్నారు.మార్చి 11న కేరళ, తమిళనాడులో పర్యటించనున్న ప్రధానమంత్రి
March 09th, 09:54 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 11న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కేరళలోని ఎర్నాకుళంలో సుమారు రూ. 10,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం కార్యక్రమాలు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5:45 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో సుమారు రూ. 5,650 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో పలు రైలు, రహదారి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 17th, 02:00 pm
పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ సి.వి. ఆనంద బోస్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వినీ వైష్ణవ్ గారు, శంతను ఠాకూర్ గారు, సుకాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, పార్లమెంటులో నా సహచరులు షమిక్ భట్టాచార్య గారు, ఖగెన్ ముర్ము గారు, కార్తీక్ చంద్ర పాల్ గారు, ఇతర ప్రతినిధులూ, సోదరీ సోదరులారా.పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో రూ. 3,250 కోట్లకు పైగా విలువైన అనేక రైలు, రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి
January 17th, 01:45 pm
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో రూ. 3,250 కోట్ల విలువైన అనేక రైలు, రహదారి మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేసి, అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని శ్రీ మోదీ ప్రసంగించారు. మాల్దా వేదికగా పశ్చిమ బెంగాల్ పురోగతిని వేగవంతం చేసే ఉద్యమానికి మరింత ఊపొచ్చిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులను ఇప్పుడే ప్రారంభించి, ప్రజలకు అంకితం చేసినట్లు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ కోసం కొత్త రైలు సేవలను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులు ప్రజలకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాలకు కూడా తోడ్పడతాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన కొత్త రైలు నిర్వహణ సదుపాయాలు బెంగాల్ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తాయని పేర్కొన్నారు.జనవరి 20-21 తేదీలలో తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్న ప్రధాని
January 18th, 06:59 pm
జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ ఆలయంలో వివిధ పండితులు కంబ రామాయణం నుండి పద్యాలను పఠించడాన్ని కూడా ప్రధాన మంత్రి వింటారు.తమిళ నాడు లో ఒక కార్యక్రమం, అదీ యువత నడుమ జరిగిన కార్యక్రమం తో 2024 వ సంవత్సరాన్ని మొదలు పెట్టుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
January 02nd, 05:27 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నూతన సంవత్సరాన్ని తమిళ నాడు లో జరిగిన ఒక సార్వజనిక కార్యక్రమం తో, అదీ యువత మధ్య జరిగిన కార్యక్రమం తో మొదలుపెట్టుకోవడం పట్ల సంతోషం గా మరియు గర్వం గా ఉందని పేర్కొన్నారు.తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
January 02nd, 12:30 pm
తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ గారు, నా మంత్రివర్గ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, ఈ ధరణి కుమారుడు ఎల్.మురుగన్ గారు, తమిళనాడు ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమిళనాడు లోని నా కుటుంబ సభ్యులు!తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ.20,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
January 02nd, 12:15 pm
రాష్ట్రంలో ఇవాళ రూ.20,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేయడంపై ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇవన్నీ తమిళనాడు ప్రగతిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. రైలు-రోడ్డు మార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇంధనం, పెట్రోలియం పైప్‌లైన్‌ల తదితర రంగాల్లో ఇవన్నీ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయని ప్రధాని తెలిపారు. ఆ మేరకు ప్రయాణ సదుపాయాలను పెంచడంతోపాటు రాష్ట్రంలో వేలాది ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయని వెల్లడించారు.తిరుచిరాపల్లి భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 02nd, 11:30 am
తమిళనాడు గవర్నర్ తిరు ఆర్ఎన్ రవీజీ, తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకె స్టాలిన్ జీ, భారతీదాసన్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరు ఎం సెల్వంజీ, నా యువ మిత్రులు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది అందరికీతమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో గల భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవం లో ప్రసంగించిన ప్రదాన మంత్రి
January 02nd, 10:59 am
తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. విశ్వవిద్యాలయం లో ప్రతిభావంతులు అయిన విద్యార్థుల కు పురస్కారాల ను కూడా ఆయన ప్రదానం చేశారు.తమిళనాడు.. లక్షద్వీప్ దీవులలో 2024 జనవరి 2-3 తేదీల్లో ప్రధానమంత్రి పర్యటన
December 31st, 12:56 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జనవరి 2, 3 తేదీల్లో తమిళనాడు, లక్షద్వీప్ దీవులలో పర్యటిస్తారు. ఈ మేరకు జనవరి 2వ తేదీన ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి చేరుకుంటారు. అక్కడ భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో నగరంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా పౌర విమానయానం, రైలు, రోడ్డు, చమురు-గ్యాస్, ఉన్నత విద్యా రంగాలకు చెందిన రూ.19,850 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు.