పాళీ భాషలో త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయిలాండ్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ

April 03rd, 05:43 pm

పాళీలో ఉన్న త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయ్ లాండ్ ప్రధానమంత్రి శ్రీమతి పేతోంగ్‌తార్న్ షినవత్రకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పాళీ అందమైన భాష అని, అది బుద్ధ భగవానుడి బోధనల సారాంశాన్ని కలిగివుందని ఆయన ప్రశంసించారు.