రష్యా అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి తొలి పలుకులు
September 01st, 01:24 pm
మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలవడం ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భంగా నేను భావిస్తున్నాను. ఇది వివిధ అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశాన్ని మనకు కలిగిస్తుంది.రష్యా అధ్యక్షుడిని కలిసిన ప్రధానమంత్రి
September 01st, 01:08 pm
ఇద్దరు నేతలు ఆర్థిక, ద్రవ్య, ఇంధన రంగాలతో సహా ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించారు. ఈ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల వృద్ధిపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.ఎస్‌సీవో ఇరవై అయిదో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
September 01st, 10:14 am
ఎస్‌సీవో ఇరవై అయిదో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నందుకు సంతోషిస్తున్నాను. సాదర స్వాగతం పలికినందుకు, చక్కని ఆతిథ్యాన్ని అందించినందుకు అధ్యక్షుడు శ్రీ శీ జిన్‌పింగ్ కు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) 25వ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి
September 01st, 10:00 am
చైనాలోని టియాంజిన్ నగరంలో 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) నిర్వహించిన 25వ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో షాంఘై సహకార సంస్థ బలోపేతం, అంతర్జాతీయ పాలన సంస్కరణ, ఉగ్రవాద నిర్మూలన, శాంతి- భద్రత, ఆర్థిక సహకారం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాల పై నిర్మాణాత్మక చర్చలు జరిగాయి.ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ శాంతిభద్రతల కమిషన్ చైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధానమంత్రి భేటీ
August 31st, 04:50 pm
టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ శాంతిభద్రతల కమిషన్ చైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు.టియాంజిన్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
August 31st, 11:06 am
మీ ఆత్మీయ స్వాగతానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గతేడాది కజన్‌లో మన చర్చలు ఇరుదేశాల సంబంధాలకు సానుకూల దిశానిర్దేశం చేశాయి. సరిహద్దు వద్ద శాంతి, స్థిరత్వం నెలకొన్నాయి. సరిహద్దు నిర్వహణ పట్ల ఇరుదేశాల ప్రతినిధులు ఒక అవగాహనకు వచ్చారు. కైలాస్ మానససరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలు కూడా ప్రారంభంకానున్నాయి. ఇరుదేశాల మధ్య సహకారం 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఇది మొత్తం మానవాళి సంక్షేమానికి కూడా మార్గం సుగమం చేస్తుంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం.చైనాలోని టియాంజిన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
August 30th, 04:00 pm
ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం చైనా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరుకానున్నారు. శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆయన అధ్యక్షుడు జి జిన్‌పింగ్, అధ్యక్షుడు పుతిన్ మరియు ఇతర నాయకులను కలుస్తారు.జపాన్, చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ప్రధాని ప్రకటన
August 28th, 08:40 pm
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు, 15 వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆ దేశానికి వెళుతున్నాను.జపాన్ మరియు చైనాలలో ప్రధానమంత్రి పర్యటన
August 22nd, 06:15 pm
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 2025 ఆగస్టు 29–30 వరకు జపాన్‌లో మరియు 2025 ఆగస్టు 31–1 సెప్టెంబర్‌లో చైనాలో పర్యటిస్తారు. జపాన్‌లో, ప్రధాని 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు మరియు జపాన్ ప్రధాని ఇషిబాతో చర్చలు జరుపుతారు. చైనాలో, ప్రధాని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ
August 19th, 07:34 pm
కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. టియాంజిన్లో జరుగుతున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పంపిన ఆహ్వానాన్ని వాంగ్ యీ ప్రధానమంత్రికి అందజేశారు. అలాగే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంపైనా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి తాను సహాధ్యక్షుడుగా వ్యవహరించిన ప్రత్యేక ప్రతినిధుల 24వ సమావేశంపైనా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.