తిరు కె. కామరాజ్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధాని
July 15th, 12:20 pm
తిరు కె. కామరాజ్ జయంతి సందర్బంగా.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యోద్యమ దిగ్గజంగా, దేశ వికాసం కోసం జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ ప్రజా నాయకుడిగా ఆయన సేవలను శ్రీ మోదీ స్మరించుకున్నారు. విద్య, సమ్మిళిత అభివృద్ధి, బడుగు వర్గాల సంక్షేమం పట్ల తిరు కె. కామరాజ్ అచంచల నిబద్ధత భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు.శ్రీ కె.కామరాజ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
July 15th, 10:50 am
శ్రీ కె. కామరాజ్ గారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఈ రోజు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కామరాజ్ గారి ఉదాత్తమైన ఆదర్శాలతో పాటు సామాజిక న్యాయ సాధనకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం...మనకు ఎంతో ప్రేరణనిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.తిరు కె. కామరాజ్ కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
July 15th, 04:57 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరు కె. కామరాజ్ జయంతి సందర్భం గా ఆయనకు శ్రద్ధాంజలిని సమర్పించారు.కె.కామరాజ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నివాళి
July 15th, 12:59 pm
‘‘కామరాజ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. కామరాజ్ భారతదేశ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. సామాజిక సాధికారతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత మనందరికీ మార్గదర్శక శక్తి. పేదరిక నిర్మూలన, ప్రజాసంక్షేమంపై ఆయన దార్శనికతను నెరవేర్చేందుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం‘‘అని.