అనువాదం: ఢిల్లీలో జరిగిన ఆరో విడత రామ్‌నాథ్ గోయెంకా ఉపన్యాస కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 17th, 08:30 pm
భారత ప్రజాస్వామ్యంలో జర్నలిజం, భావ వ్యక్తీకరణ, ప్రజా ఉద్యమాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఒక గొప్ప వ్యక్తిని గౌరవించేందుకు ఈ రోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. దార్శనికుడిగా, సంస్థలను నిర్మించే వ్యక్తిగా, దేశభక్తుడిగా, మీడియా నాయకుడిగా ఉన్న రామ్‌నాథ్ గారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థను కేవలం ఒక వార్తాపత్రికగానే కాకుండా భారత ప్రజలకు సంబంధించిన ఒక యజ్ఞంగా స్థాపించారు. ఆయన నాయకత్వంలో ఈ సంస్థ.. భారత ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాలకు గొంతుకగా మారింది. ఈ 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతున్నప్పుడు.. రామ్‌నాథ్ గోయెంకా గారి నిబద్ధత, ఆయన చేసిన కృషి, ఆయన దార్శనికత మనకు గొప్ప స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఈ ఉపన్యాసానికి నన్ను ఆహ్వానించినందుకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విషయంలో మీ అందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను.రామ్‌నాథ్ గోయెంకా 6వ ఉపన్యాసం ఇచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 17th, 08:15 pm
ఇవాళ న్యూఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక ‘‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’’ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ… రామ్‌నాథ్ గోయెంకా ఆరో ఉపన్యాసాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్యం, జర్నలిజం, భావవ్యక్తీకరణ, ప్రజా ఉద్యమాల శక్తిని పెంచిన మహోన్నత వ్యక్తిని గౌరవించడంలో భాగంగా మనమంతా ఇక్కడ సమావేశమైనట్లు తెలిపారు. రామ్‌నాథ్ గోయెంకా.. దార్శనికత కలిగిన వ్యక్తి, సంస్థ స్థాపకుడు, జాతీయవాది, మీడియా నాయకుడని ప్రధానమంత్రి కొనియాడారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థను కేవలం వార్తాపత్రికగా కాకుండా భారత ప్రజల కోసం ఒక యజ్ఞంలా ప్రారంభించారన్నారు. రామ్‌నాథ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల గొంతుకగా ఈ సంస్థ మారిందని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన భారత్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, రామ్‌నాథ్ గోయెంకా నిబద్ధత, కృషి, దార్శనికత స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. ఉపన్యాసం ఇచ్చేందుకు తనను ఆహ్వానించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థకు ధన్యవాదాలు చెప్పిన ప్రధానమంత్రి.. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్ 2025లో ప్రధాని ప్రసంగం
October 31st, 06:08 pm
న్యూఢిల్లీలోని రోహిణిలో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనం 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ.. ఇంతకుముందు విన్న మంత్రాల శక్తిని అందరూ ఇంకా అనుభూతి చెందుతున్నారన్నారు. తానెప్పుడు ఈ సమావేశాలకు వచ్చినా.. దివ్యమైన, అసాధారణ అనుభవం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్వామి దయానందుడి ఆశీస్సుల వల్లే ఈ భావన ఎల్లవేళలా సాధ్యమవుతోందన్నారు. స్వామి దయానందుడి ఆదర్శాలు పూజనీయమైనవన్నారు. అక్కడున్న చింతనాపరులందరితో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధం వల్లే వారిలో ఒకరిగా ఉండే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కుతోందన్నారు. వారిని కలిసి, మాట్లాడినప్పుడల్లా.. ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని, తనలో ప్రేరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు.అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ 2వ దశ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 24th, 10:39 pm
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు.. హాజరైన నా తోటి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, సర్దార్‌ధామ్ వ్యవహారాలు చూసుకుంటున్న సోదరుడు శ్రీ గగ్జీ భాయ్, ట్రస్టీ వి.కె. పటేల్, దిలీప్ భాయ్, ఇతర ప్రముఖులు.. నా ప్రియమైన సోదరీ సోదరులారా, ముఖ్యంగా నా ప్రియమైన కుమార్తెలారా..అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్ - II శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 24th, 10:25 pm
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్- II శంకుస్థాపన సందర్శంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల సేవ, విద్యకు అంకితమైన ఈ వసతి గృహం స్థాపన గురించి వివరిస్తూ.. సర్దార్ ధామ్ పేరు లాగే అది చేసే కృషి కూడా పవిత్రమైనదని ప్రధానమంత్రి అన్నారు. ఈ హాస్టల్లో వసతి పొందే బాలికలు...అనేక ఆకాంక్షల్నీ, ఆశయాలనీ కలిగి ఉంటారని, వాటిని నెరవేర్చుకొనేందుకు అనేక అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ఈ అమ్మాయిలు స్వావలంబన, శక్తి సాధించినప్పుడు.. దేశ నిర్మాణంలో వారు సహజంగానే కీలకపాత్ర పోషిస్తారని, వారి కుటుంబాలు సాధికారత సాధిస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ వసతి గృహంలో ఉండే అవకాశం లభించిన బాలికలకు, వారి కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆకాంక్షిస్తూ.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి వేడుక సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:15 am
పరమ శ్రాద్ధేయ ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ మహరాజ్, శ్రావణబెళగొళ స్వామి శ్రీ చారుకీర్తి, మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ శ్రీ నవీన్ జైన్, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ప్రియాంక్ జైన్, కార్యదర్శి శ్రీ మమతా జైన్, ట్రస్టీ పీయూష్ జైన్, ఇతర విశిష్ట ప్రముఖులు, గౌరవనీయ సాధువులు, సోదరీసోదరులారా... జై జినేంద్ర!ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహరాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:01 am
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు జరిగిన ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక చిరస్మరణీయమైన సందర్భాన్ని నేడు మనమంతా చూస్తున్నాం.. ఇది ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతాబ్ది ఉత్సవాల పవిత్రతను స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. పూజ్య ఆచార్య అమర స్ఫూర్తితో నిండిన ఈ కార్యక్రమం అపూర్వమైన స్ఫూర్తిదాయక వాతావరణాన్ని కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం దక్కడం తనకూ సంతోషం కలిగించిందన్నారు.‘ఎన్‌ఎక్స్‌టి’ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 01st, 11:00 am
‘న్యూస్ ఎక్స్ వరల్డ్’ శుభప్రదంగా ప్రారంభమైంది... ఈ నేపథ్యంలో మీకందరికీ నా అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంగ్ల, హిందీ భాషలు సహా మీ నెట్‌వర్క్ పరిధిలోని ప్రాంతీయ ఛానెళ్లన్నీ కూడా ఇప్పుడు వేగంగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. దీనికితోడు నేడు అనేక పరిశోధక సభ్యత్వాలు (ఫెలోషిప్), ఉపకార వేతనాలకు (స్కాలర్‌షిప్) శ్రీకారం చుట్టారు. ఈ కార్యకలాపాలన్నిటిపైనా మీకు శుభాకాంక్షలు.ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 01st, 10:34 am
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. న్యూస్ఎక్స్ వరల్డ్ ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హిందీ, ఇంగ్లీష్‌లతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో ఛానల్‌లను కలిగి ఉన్న ఈ నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పలు ఫెలోషిప్‌లు, ఉపకారవేతనాల ప్రారంభాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.రోజ్‌గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాల్గొన్న ప్రధాని: 71,000కు పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 23rd, 11:00 am
మంత్రిమండలిలో నా సహచరులు, దేశంలో వివిధ ప్రాంతాల ప్రముఖులు, నా యువ మిత్రులారా.రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో నూతనంగా నియమితులైన 71,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను అందజేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 23rd, 10:30 am
ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో రోజ్‌గార్ మేళా ద్వారా నియామకాలు పొందిన 71,000 మందికి పైగా యువతకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు నియామకపత్రాలను అందించి, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్న ప్రధానమంత్రి అంకితభావానికి ఈ రోజ్ గార్ మేళా అద్దం పడుతుంది. జాతి నిర్మాణం, స్వయం సాధికారత సాధించేందుకు తోడ్పడేలా యువతకు అర్థవంతమైన అవకాశాలను ఇది అందిస్తుంది.For the BJP, the aspirations and pride of tribal communities have always been paramount: PM Modi in Chaibasa
November 04th, 12:00 pm
PM Modi addressed a massive election rally in Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”PM Modi campaigns in Jharkhand’s Garhwa and Chaibasa
November 04th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed massive election rallies in Garhwa and Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”గుజరాత్‌లోని కేవడియాలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
October 31st, 07:31 am
సర్దార్ సాహెబ్ చెప్పిన శక్తిమంతమైన మాటలు... ఐక్యతా మూర్తి వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమం... ఏక్తా నగర్ విశాల దృశ్యం... ఇక్కడ నిర్వహించిన అద్భుతమైన ప్రదర్శనలు... మినీ ఇండియా గురించిన అవలోకనం... ప్రతీదీ చాలా అద్భుతంగా ఉంది... ఇది స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆగస్టు 15, జనవరి 26 తేదీల మాదిరిగానే... అక్టోబరు 31 నాటి ఈ కార్యక్రమం యావద్దేశానికి నూతన శక్తిని అందిస్తుంది. రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా దేశ పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.గుజరాత్‌లోని కేవడియాలో ఐక్యతా మూర్తి వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించి.. జాతీయ ఐక్యతా దినోత్సవ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి
October 31st, 07:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని కేవడియాలో ఐక్యతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వద్ద నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రధాని పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఐక్యతా ప్రమాణం చేశారు. ప్రతి యేటా వల్లభాయ్ పటేల్ జయంతి రోజున జరుపుకొనే జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన, ఐక్యతా దినోత్సవ పరేడ్‌ను ప్రధానమంత్రి ప్రత్యక్షంగా వీక్షించారు.3వ కౌటిల్య ఆర్థిక సమ్మేళనం -2024 లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 04th, 07:45 pm
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రెసిడెంట్ ఎన్ కె సింగ్ గారు, ఈ సమ్మేళనంలో పాల్గొంటున్న దేశవిదేశాలకు చెందిన ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, పెద్దలు!న్యూఢిల్లీలో 3వ కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 04th, 07:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో ప్రసంగించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధి సంస్థ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్) నిర్వహించిన కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో హరిత మార్పు కోసం నిధులు సమకూర్చడం, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, వృద్ధిపై ప్రతికూలప్రభావం, సుస్థిరత్వాన్ని పరిరక్షించడానికి విధాన కార్యాచరణ సూత్రాలు వంటి అంశాలపై దృష్టి సారించింది.జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి ముఖాముఖి సంభాషణ పాఠం
September 06th, 04:15 pm
ఉపాధ్యాయురాలు - గౌరవనీయ ప్రధాన మంత్రి గారూ, నమస్కారం! నా పేరు ఆశారాణి, జార్ఖండ్ లోని బొకారోలోని చందన్కియారీలోని '12 హైస్కూల్' లో పని చేస్తున్నాను.జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి
September 06th, 04:04 pm
జాతీయ విద్యా విధాన ప్రభావం, మాతృభాషలో విద్యాభ్యాస ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి వారితో చర్చించారు. వేర్వేరు భాషల్లో స్థానిక జానపద కథలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవడంతో పాటు వైవిధ్యమైన భారతదేశ సంస్కృతి గురించి తెలుసుకుంటారని అన్నారు.అంతరిక్ష రంగ సంస్కరణల ద్వారా దేశంలోని యువత ప్రయోజనం పొందారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 25th, 11:30 am
మిత్రులారా! అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు కూడా చాలా ప్రయోజనం లభించింది. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్'లో అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువ సహోద్యోగులతో సంభాషించాలని నేను అనుకున్నాను. నాతో మాట్లాడేందుకు స్పేస్ టెక్ స్టార్ట్ అప్ GalaxEye బృందం సిద్ధంగా ఉంది. ఈ స్టార్టప్‌ను ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ యువకులు – సూయశ్, డేనిల్, రక్షిత్, కిషన్, ప్రణీత్- ఈరోజు ఫోన్ లైన్‌లో మనతో ఉన్నారు. రండి, ఈ యువత అనుభవాలను తెలుసుకుందాం.