సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు మంత్రిమండలి ఆమోదం 2024-25, 2025-26 సంవత్సరాలకు కేటాయింపు పెంపు
March 19th, 04:18 pm
పశుగణం రంగంలో వృద్దికి ఊతమివ్వడానికి సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎమ్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సవరించిన ఆర్‌జీఎమ్‌ను రూ.1000 కోట్ల అదనపు వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పథకంలో కేంద్ర వాటా కింద అమలు చేయనున్నారు. 2021-22 మొదలు 2025-26 సంవత్సరాలకు వర్తించే 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఈ పథకానికి మొత్తం రూ.3400 కోట్లు ఖర్చు చేయనున్నారు.