భారత ప్రధానమంత్రి నెదర్లాండ్స్‌ పర్యటన సందర్భంగా రెండు దేశాల సంయుక్త ప్రకటన

May 17th, 03:45 am

నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రాబ్‌ జెటెన్‌ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16-17 తేదీలలో ఆ దేశంలో పర్యటించారు. శ్రీ మోదీ నెదర్లాండ్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి.

భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక [2026-2030]

May 17th, 03:15 am

2026 మే 16న హేగ్ నగరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్దిష్ట లక్ష్యాలు, కాలపరిమితితో కూడిన కార్యక్రమాలు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికల ద్వారా భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ లక్ష్య సాధన కోసం రాబోయే 5 సంవత్సరాల కాలానికి (2026-2030) ‘భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక’ను ఇరు దేశాలు ఆమోదించాయి.

నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్‌ ఎటెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక చర్చలు

May 17th, 02:35 am

ఈ సమావేశంలో భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు, విశ్వాసంతోపాటు సమన్వయం, సహకారం ఇనుమడించడాన్ని ప్రతిబింబిస్తూ, ఈ స్నేహబంధాన్ని “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, అత్యాధునిక-కీలక సాంకేతికతలు, సముద్ర రంగం, పునరుత్పాదక ఇంధనం, విద్యా రంగాల్లో సహకార విస్తృతి దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యంపై భవిష్యత్‌ ప్రణాళిక ఆమోదానికి నిశ్చయించారు. ఉభయ పక్షాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత-ఆవిష్కరణల భాగస్వామ్య విస్తరణ సహా భారత వృద్ధి ప్రస్థానం డచ్ కంపెనీలకు ఆశావహ వ్యాపార అవకాశాలను కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ప్రధానమంత్రి

May 16th, 08:13 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హేగ్‌లోని ప్యాలెస్ హౌస్ టెన్ బాష్‌లో నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

May 16th, 01:30 pm

ఇంతటి అపారమైన ఆదరాభిమానాలు.. ఇంతటి అద్భుతమైన ఉత్సాహం. నిజం చెప్పాలంటే ఒక్క క్షణం నేను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే విషయమే మర్చిపోయాను. భారత్‌లోనే ఎక్కడో ఒక పెద్ద పండుగ జరుగుతున్నట్లు అనిపిస్తోంది.

నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

May 16th, 01:20 pm

నేడు నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా అక్కడకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు, భారతీయ మిత్రులు ఆయనకు ఎంతో ఉత్సాహంగా, ఘన స్వాగతం పలికారు.

భారతదేశం వైవిధ్యభరితంగా ఉన్న దేశంగా ఉండడం ప్రతి భారతీయుడు గర్వించదగినది: ప్రధాని మోదీ

June 27th, 10:51 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్లో భారత సంతతితో సంభాషించారు. తన ప్రసంగంలో, నెదర్లాండ్స్ మరియు సురినామెలలో భారతీయ ప్రవాసులు పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు. మొత్తం యూరప్లో నెదర్లాండ్స్ రెండవ అతి ఎక్కువ భారతీయ ప్రవాసులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

నెదర్లాండ్స్లో భారత కమ్యూనిటీతో చర్చించిన ప్రధాని

June 27th, 10:50 pm

నెదర్లాండ్స్లో భారత కమ్యూనిటీతో ప్రధాని సంభాషించారు. నెదర్లాండ్స్ మరియు సురినామ్లో భారతీయ ప్రవాసులు పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు.

నెదర్లాండ్స్ రాణి మెక్సిమా మరియు రాజు విల్లెం-అలెగ్జాండర్ లను కలిసిన ప్రధాని మోదీ

June 27th, 09:26 pm

నెదర్లాండ్లోని విల్లా ఐకెనోర్స్ట్ వద్ద నెదర్లాండ్స్ రాణి మెక్సిమా మరియు రాజు విల్లెం-అలెగ్జాండర్ లను ప్రధాని మోదీ కలుసుకున్నారు.

నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

June 27th, 04:09 pm

ప్రధానమంత్రి మోదీ మరియు నెదర్లాండ్స్ ప్రధాని రెట్టే ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. ఉమ్మడి పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ ఈ విధంగా అన్నారు, ప్రపంచం అంతా ఒకటిపై ఒకటి ఆధారపడి అంతర్-సంబంధాలు కలిగి ఉంటుంది, అంతేకాక, మేము ద్వైపాక్షిక సమస్యలను మరియు ప్రపంచానికి సంబంధించిన వాటి గురించి చర్చించుకుంటాము. భారతదేశం యొక్క ఆర్ధిక అభివృద్ధిలో నెదర్లాండ్స్ సహజ భాగస్వామిగా నెదర్లాండ్స్గా వ్యవహరిస్తుందని మరియు వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయని నొక్కిచెప్పారు.

ది హేగ్ లోని కాట్షూయిస్లో డచ్ ప్రధాని మార్క్ రుటేతో చర్చలు నిర్వహించిన ప్రధాన మంత్రి మోదీ

June 27th, 04:08 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాలర్, నెదర్లాండ్స్లో కాట్షూయిస్లో డచ్ ప్రధాని మార్క్ రుటేతో అధికారికంగా చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ సమస్యల వరుసక్రమంలో చర్చించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంచే మార్గాలను వారి సమావేశంలో చర్చించారు.