ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి
December 17th, 12:02 am
పరిమిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో వారు పాల్గొన్నారు. శతాబ్దాల నాటి నాగరికత పునాదులపై ఏర్పడి, ప్రజాసంబంధాలతో బలోపేతమైన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. వీటికి ప్రాధాన్యమిస్తూ.. భారత్-ఇథియోపియా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడానికి నాయకులిద్దరూ అంగీకరించారు. గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడానికి రెండు దేశాల కృషిని కొనసాగించాలని నిర్ణయించారు. 2023లో జీ20కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు ఈ కూటమిలో సభ్యత్వం ఇవ్వడం భారతదేశానికి దక్కిన గౌరవమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడంతో పాటు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం సాగిస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసిన ఇథియోపియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఆస్ట్రేలియలో ఉగ్రవాద దాడిని ఖండించిన ప్రధానమంత్రి ఈ దారుణ ఘటన మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
December 14th, 05:23 pm
ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో ఈ రోజు యూదుల పండుగ హనుక్కా తొలి రోజు వేడుకలే లక్ష్యంగా జరిగిన దారుణ ఉగ్రవాద దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.భారత్ - రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనంతర సంయుక్త ప్రకటన
December 05th, 05:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ 23వ భారత-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు 2025 డిసెంబర్ నాలుగు, ఐదు తేదీలలో భారత్ లో పర్యటించారు.అనువాదం: కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠంలో ‘లక్ష కంఠాల గీతా పారాయణం’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 28th, 11:45 am
నేను మొదలుపెట్టే ముందు.. కొంతమంది పిల్లలు తమ బొమ్మలను ఇక్కడికి తీసుకువచ్చారు. దయచేసి ఎస్పీజీ, స్థానిక పోలీసులు వాటిని తీసుకునే విషయంలో సహాయం చేయండి. మీరు వెనుక వైపున మీ చిరునామా రాస్తే నేను ఖచ్చితంగా మీకు ఒక ధన్యవాద లేఖ పంపుతాను. ఎవరి దగ్గర ఏమున్నా దయచేసి వారికి ఇవ్వండి. వారు వాటిని తీసుకుంటారు. మీరు కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఈ పిల్లలు ఎంత కష్టపడి పనిచేస్తారు. కొన్నిసార్లు వీటిని నేను గుర్తించక పోతే అది నాకు బాధ కలిగిస్తుంది.కర్ణాటకలోని ఉడుపిలో లక్ష కంఠ గీతా పారాయణ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 28th, 11:30 am
మూడు రోజుల క్రితం తాను గీతా భూమి అయిన కురుక్షేత్రంలో ఉన్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేశారు. నేడు శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు పొందిన, జగద్గురు శ్రీ మధ్వాచార్య గారి మహిమతో పావనమైన ఈ భూమికి రావడం తనకు అత్యంత సంతృప్తినిచ్చే విషయమని అన్నారు. ఈ సందర్భంలో లక్ష మంది ప్రజలు కలిసి చేసిన భగవద్గీతనవంబరు 29-30 తేదీల్లో రాయ్‌పూర్‌లో పోలీసు డైరెక్టర్ జనరల్స్/ ఇన్‌స్పెక్టర్ జనరల్స్ అఖిల భారత సదస్సులో పాల్గొననున్న ప్రధాని
November 27th, 12:45 pm
నవంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. పోలీసు శాఖకు సంబంధించి కీలక సవాళ్ళ పరిష్కారంలో ఇంతవరకు సాధించిన పురోగతిని సమీక్షించడం, ‘వికసిత్ భారత్’ జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ‘సురక్షిత భారత్’ నిర్మాణం కోసం ముందుచూపుతో కూడిన ప్రణాళికను రూపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.Sri Guru Teg Bahadur Ji's life, sacrifice and character are a tremendous source of inspiration: PM Modi in Kurukshetra
November 25th, 04:40 pm
PM Modi addressed an event commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Teg Bahadur Ji at Kurukshetra in Haryana. He remarked that Sri Guru Teg Bahadur Ji considered the defense of truth, justice, and faith as his dharma, and he upheld this dharma by sacrificing his life. On this historic occasion, the Government of India has had the privilege of dedicating a commemorative postage stamp and a special coin at the feet of Sri Guru Teg Bahadur Ji.హర్యానాలోని కురుక్షేత్రలో శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 04:38 pm
హర్యానాలోని కురుక్షేత్రలో ఈ రోజు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌ను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఈ రోజు భారత వారసత్వ అద్భుత సంగమ దినమని అని వ్యాఖ్యానించారు. ఉదయం తాను రామాయణ నగరమైన అయోధ్యలో ఉన్నాననీ... ఇప్పుడు తాను గీతా నగరమైన కురుక్షేత్రలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధువులు, సంబంధిత సమాజం హాజరైనట్లు పేర్కొన్న ప్రధానమంత్రి... అందరికీ తన గౌరవప్రదమైన నమస్కారాలు తెలిపారు.Prime Minister meets Prime Minister of Italy on the sidelines of G20 Summit 2025
November 23rd, 09:44 pm
PM Modi met PM of Italy Giorgia Meloni on the sidelines of G20 Summit in Johannesburg, South Africa. PM Meloni expressed solidarity with India on the terror incident in Delhi. Both leaders adopted the ‘India-Italy Joint Initiative to Counter Financing of Terrorism’ and positively assessed the developments in the bilateral Strategic Partnership across wide range of sectors.ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
November 23rd, 12:45 pm
ఐబీఎస్ఏ కేవలం మూడు దేశాల వేదిక మాత్రమే కాదు. ఇది మూడు ఖండాలను, మూడు ప్రధాన ప్రజాస్వామ్య శక్తులను, మూడు ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక కీలకమైన వేదిక. ఇది మన వైవిధ్యం, భాగస్వామ్య విలువలు ఉమ్మడి ఆకాంక్షలలో పాతుకుపోయిన లోతయిన, శాశ్వతమైన భాగస్వామ్యం కూడా.జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఐబీఎస్‌ఏ నేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి
November 23rd, 12:30 pm
ఈ సమావేశం సరైన సమయంలో నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది ఆఫ్రికా గడ్డపై జరిగిన తొలి జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంలోనే జరగడం మంచి విషయమన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు వరుసగా నాలుగు జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించడం దీనికి ఒక కారణమని ప్రధానమంత్రి తెలిపారు. వీటిలో చివరి మూడు జీ20 సమావేశాలను ఐబీఎస్ఏ సభ్య దేశాలే నిర్వహించాయని గుర్తుచేశారు. ఫలితంగా మానవ కేంద్రిత అభివృద్ధి, బహుపాక్షిక సంస్కరణలు, సుస్థిర వృద్ధిపై దృష్టి సారిస్తూ అనేక ముఖ్య కార్యక్రమాలు చేపట్టామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధాని మోదీ
November 21st, 10:43 pm
దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను 2020లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లిన అనంతరం గత ఐదేళ్లలో భారత్- ఆస్ట్రేలియా మధ్య సహకారం మరింత బలంగా, వైవిధ్యంగా మారటం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి పట్ల ప్రధానమంత్రి అల్బనీస్ విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇద్దరు నాయకులు ప్రకటించారు.Cabinet passes resolution on Explosion near Red Fort in Delhi
November 12th, 08:17 pm
The Union Cabinet, chaired by Prime Minister Shri Narendra Modi, expressed its profound grief over the loss of lives in the terrorist incident involving a car explosion near the Red Fort in Delhi on the evening of 10 November 2025. The Cabinet observed two minutes' silence in honour of innocent lives lost.ఏడాది పాటు నిర్వహించనున్న “వందేమాతరం” జాతీయ గేయం 150 సంవత్సరాల స్మారకోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 07th, 10:00 am
సామూహికంగా వందేమాతర గేయాన్ని ఆలపించే ఈ అద్భుతమైన అనుభవం నిజంగా మాటలతో వర్ణించలేనిది. అనేక గళాల్లో... ఒకే లయ, ఒకే స్వరం, ఒకే భావం, ఒకే ఉత్తేజం, ఒకే ప్రవాహంగా సాగే ఈ గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఈ భావోద్వేగ భరితమైన వాతావరణంలో నేను నా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాను. వేదికపై ఉన్న నా మంత్రివర్గ సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా గారు, ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా గారు, ఇతర ప్రముఖులు, అలాగే ఈ వేడులకు హాజరైన నా సోదరీ సోదరులారా...జాతీయ గేయం ‘‘వందేమాతరం’’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా
November 07th, 09:45 am
దేశాన్ని ఒక భౌగోళిక-రాజకీయ ప్రదేశంగా మాత్రమే చూసేవారికి... అలా కాకుండా తల్లిగా పరిగణించాలనే ఆలోచన ఆశ్చర్యం అనిపించవచ్చునని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, భారత్ ఇందుకు భిన్నం... ఇక్కడ తల్లి అంటే- జన్మనిచ్చేది.. పెంచిపోషించేది మాత్రమే కాదు బిడ్డలకు ప్రమాదం కలిగించే దుష్టశక్తులను అంతం చేసే భద్రకాళి. కాబట్టే- భరతమాత శక్తి అపారమని, కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించడమేగాక శత్రు నాశనం చేసిందని చెబుతూ- వందేమాతరంలోని పంక్తులను ఆయన ఉటంకించారు. దేశం ఒక తల్లి కాగా, ఆ తల్లి శక్తిసామర్థ్యాలు ఒక దైవ స్వరూపమనే భావనే స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీ-పురుషులు సమాన భాగస్వాములు కావడానికి దారితీసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నారీశక్తి భారత్‌ను మరోసారి పురోగమన పథంలో నిలపగలదనే స్వప్నాలకు ఊతమిచ్చింది ఈ దార్శనికతేనని చెప్పారు.Mahagathbandhan is a bundle of lies: PM Modi in Arrah, Bihar
November 02nd, 02:00 pm
Massive crowd attended PM Modi’s public rally in Arrah, Bihar, today. Addressing the gathering, the PM said that when he sees the enthusiasm of the people, the resolve for a Viksit Bihar becomes even stronger. He emphasized that a Viksit Bihar is the foundation of a Viksit Bharat and explained that by a Viksit Bihar, he envisions strong industrial growth in the state and employment opportunities for the youth within Bihar itself.PM Modi addresses large public gatherings in Arrah and Nawada, Bihar
November 02nd, 01:45 pm
Massive crowd attended PM Modi’s rallies in Arrah and Nawada, Bihar, today. Addressing the gathering in Arrah, the PM said that when he sees the enthusiasm of the people, the resolve for a Viksit Bihar becomes even stronger. He emphasized that a Viksit Bihar is the foundation of a Viksit Bharat and explained that by a Viksit Bihar, he envisions strong industrial growth in the state and employment opportunities for the youth within Bihar itself.నవ రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభ కొత్త భవనం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 01st, 01:30 pm
ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రమణ్ డేకా, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాష్ట్ర శాసనసభ స్పీకర్- నా మిత్రుడు శ్రీ రమణ్ సింగ్, ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ తోఖన్ సాహు, ఉప ముఖ్యమంత్రులు- శ్రీ విజయ్ శర్మ, శ్రీ అరుణ్ సావు, శాసనసభలో ప్రతిపక్ష నేత శ్రీ చరణ్ దాస్ మహంత్, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్యక్రమానికి హాజరైన సోదరీసోదరులారా!ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రాష్ట్ర విధానసభ కొత్త భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 01st, 01:00 pm
ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని నవా రాయ్‌పూర్‌లో రాష్ట్ర విధానసభ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి ప్రయాణంలో ఒక స్వర్ణారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వ్యక్తిగతంగా చాలా సంతోషకరమైన రోజు ఇదన్న ఆయన.. దశాబ్దాలుగా పెంచి పోషించిన ఈ ప్రాంతంతో ఉన్న లోతైన భావోద్వేగ బంధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తగా ఉన్న సమయాన్ని గుర్తు చేసిన మోదీ.. రాష్ట్రంలో చాలా సమయం గడిపినట్లు, తద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఉన్న దార్శనికత, రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్న సంకల్పం, అది నెరవేరటం వంటి ప్రతి క్షణానికి సాక్షిగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరివర్తనలోని ప్రతి క్షణాన్ని ఆయన గుర్తుచేశారు. 25 ఏళ్లు అనే ప్రధాన ఘట్టానికి రాష్ట్రం చేరుకున్న వేళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు కృతజ్ఞత భావంతో ఉన్నట్లు వ్యక్తం చేశారు. రజతోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజల కోసం ఈ కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించే అవకాశం దక్కిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేశారు.న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళనం 2025 ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
October 31st, 07:00 pm
ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఈ రోజు సర్దార్ సాహెబ్ 150వ జయంతి. ఏక్తానగర్లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దాని వల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైంది. ఇక్కడికి సకాలంలో చేరుకోలేనందుకు చింతిస్తున్నాను. ఈ విషయంలో మీ అందరినీ క్షమాపణలను కోరుతున్నాను. సభ ప్రారంభంలో మనం విన్న మంత్రాల శక్తి ఇప్పటికీ మనకి తెలుస్తూనే ఉంది. మీ మధ్య ఉండే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అనుభవం దైవికంగా, అద్భుతంగా ఉంటుంది. ఇది స్వామి దయానందుల వారి ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదాల పట్ల మనందరికీ ఉన్న గౌరవంతో పాటు ఇక్కడున్న మేధావులైన మీ అందరితోనూ దశాబ్దాలుగా నాకున్న వ్యక్తిగత అనుబంధం వల్లే మళ్లీ మళ్లీ మీ మధ్య ఉండే అవకాశం నాకు లభిస్తోంది. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ, మీతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ నాలో ప్రత్యేకమైన శక్తి, స్ఫూర్తి నిండుతాయి. ఇలాంటి మరో తొమ్మిది హాళ్లను ఏర్పాటు చేశారని ఇప్పుడే నాకు చెప్పారు. అక్కడ మన ఆర్యసమాజ్ సభ్యులంతా వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారిని నేను నేరుగా చూడలేనప్పటికీ.. ఇక్కడి నుంచే వారికి నమస్కరిస్తున్నాను.