ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్తవి తీసుకొచ్చేలా ఎన్‌సీఆర్‌పీబీకి మద్ధతునిచ్చే పథకానికి క్యాబినెట్ ఆమోదం

June 03rd, 03:17 pm

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం, స్వచ్ఛ రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించిన ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకం కాలవ్యవధి రెండేళ్లు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్‌యూఏ) ఆధ్వర్యంలోని జాతీయ రాజధాని ప్రాంత ప్రణాళికా బోర్డు (ఎన్‌సీపీఆర్‌బీ) ద్వారా ఈ పథకానికి నిధులు అందుతాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్‌టీహెచ్), పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంవోపీఎన్జీ) ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ఎన్‌సీఆర్‌లో భాగంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ సహకారంతో ఇది అమలవుతుంది.

టిఇఆర్ఐ నిర్వహించే వరల్డ్ సస్ టేనబుల్డెవలప్ మెంట్ సమిట్ లో ఫిబ్రవరి 16న ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నప్రధాన మంత్రి

February 15th, 11:32 am

ది ఎనర్జీ ఎండ్ రిసోర్సెస్ ఇన్ స్టిట్యూట్ (టిఇఆర్ఐ) నిర్వహించే వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ న సాయంత్రం పూట సుమారు 6 గంటల వేళ కు వీడియో సందేశం ద్వారా ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.