మలేషియాలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో ప్రధాని భేటీ

February 08th, 02:50 pm

మలేషియాకు చెందిన నలుగురు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. పెట్రోనాస్ అధినేత, ఆ గ్రూప్ సీఈవో తాన్ శ్రీ తెంగ్కు మహమ్మద్ తౌఫిక్, బెర్జాయా కార్పొరేషన్ బెర్హాద్ వ్యవస్థాపకుడు తాన్ శ్రీ దాతో సేరి విన్సెంట్ తాన్ చీ యియున్, ఖజానా నేషనల్ బెర్హాద్ మేనేజింగ్ డైరెక్టర్ దాతో అమీరుల్ ఫైసల్ వాన్ జహీర్, ఫైసన్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థాపకుడు దాతో పువా ఖైన్ సెంగ్‌తో ఆయన భేటీ అయ్యారు.