మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్, వియత్నాం దేశాల సంయుక్త ప్రకటన
May 06th, 05:24 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం దేశాధ్యక్షుడు శ్రీ తో లామ్ 2026 మే 05 నుంచి మే 07 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈయనతో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో పాటు వ్యాపార ప్రతినిధుల బృందం కూడా పర్యటనలో పాల్గొంది.ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
October 08th, 10:15 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, విదేశీ అతిథులు, టెలికాం రంగ ప్రముఖులు, వివిధ కళాశాలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన నా యువ మిత్రులు, సోదరీసోదరులారా!ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 08th, 10:00 am
ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీ కార్యక్రమమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 9వ సంచికను న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రత్యేక ఎడిషన్‌కు ప్రతినిధులను ఆహ్వానిస్తూ.. ఆర్థిక మోసాల నివారణ, క్వాంటం కమ్యూనికేషన్, 6జీ, ఆప్టికల్ కమ్యూనికేషన్, సెమీకండక్టర్లు సహా ఇతర కీలకమైన అంశాలపై అనేక స్టార్టప్‌లు వినూత్న ఆలోచనలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయన్నారు. ముఖ్యమైన అంశాలపై ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలు భారత సాంకేతిక భవిష్యత్తు భద్రమైన చేతుల్లోనే ఉందనే నమ్మకాన్ని ఇస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు.