అనువాదం: భారత్-బ్రిటన్ సీఈఓ ఫోరం సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 09th, 04:41 pm
ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార రంగ నాయకులుగా మీరు చేస్తోన్న నిరంతర కృషి వల్ల ఈ ఫోరం.. భారత్-బ్రిటన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముఖ్యమైన వేదికగా మారింది. ఈ రోజు మీ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత.. మనం సహజ భాగస్వాములుగా మరింత వేగంతో ముందుకు సాగగలమనే నా నమ్మకం మరింత పెరిగింది. ఈ విషయంలో మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
October 08th, 10:15 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, విదేశీ అతిథులు, టెలికాం రంగ ప్రముఖులు, వివిధ కళాశాలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన నా యువ మిత్రులు, సోదరీసోదరులారా!ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 08th, 10:00 am
ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీ కార్యక్రమమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 9వ సంచికను న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రత్యేక ఎడిషన్‌కు ప్రతినిధులను ఆహ్వానిస్తూ.. ఆర్థిక మోసాల నివారణ, క్వాంటం కమ్యూనికేషన్, 6జీ, ఆప్టికల్ కమ్యూనికేషన్, సెమీకండక్టర్లు సహా ఇతర కీలకమైన అంశాలపై అనేక స్టార్టప్‌లు వినూత్న ఆలోచనలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయన్నారు. ముఖ్యమైన అంశాలపై ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలు భారత సాంకేతిక భవిష్యత్తు భద్రమైన చేతుల్లోనే ఉందనే నమ్మకాన్ని ఇస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు.ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9వ సంచికను అక్టోబరు 8న ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 07th, 10:27 am
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 పరంపరలో 9వ సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8న ఉదయం సుమారు 9:45 గంటలకు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభిస్తారు. ఇది ఆసియాలో టెలికం, మీడియా, టెక్నాలజీ రంగాలకు సంబంధించిన భారీ కార్యక్రమం.ఒడిశాలోని ఝార్సుగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 27th, 11:45 am
ఇక్కడి కొంతమంది యువ మిత్రులు అనేక కళాకృతులను తీసుకువచ్చారు. ఒడిశాకు కళ పట్ల ఉన్న ప్రేమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మీ అందరి నుంచి నేను ఈ కానుకలను స్వీకరిస్తాను.. ఈ కానుకలన్నీ మీ నుంచి సేకరించమని నా ఎస్‌పీజీ సహచరులను నేను అభ్యర్థిస్తున్నాను. మీరు మీ పేరు, చిరునామాను వెనుక రాసి ఇస్తే మీకు కచ్చితంగా నా నుంచి ఒక లేఖ వస్తుంది. అక్కడ వెనకాల ఒక అబ్బాయి చాలాసేపు ఏదో పట్టుకుని ఉన్నట్లు నేను చూస్తున్నాను. అతని చేతులు నొప్పి పెట్టవచ్చు.. దయచేసి అతనికి సహాయం చేసి దానిని కూడా సేకరించండి. వెనక మీ పేరు, చిరునామా రాసి ఉంటే, నేను కచ్చితంగా మీకు లేఖ రాస్తాను. ఈ కళాకృతులను తయారు చేసినందుకు.. మీ అభిమానానికీ.. యువతీయువకులకు, చిన్న పిల్లలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 27th, 11:30 am
ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత నవరాత్రి పండగ రోజుల్లో మాతా సమలేయ్, మాతా రామచండీలు కొలువైన పవిత్ర భూమిని సందర్శించి.. ఇక్కడి ప్రజలను కలిసే అదృష్టం తనకు లభించిందని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, ఆడపడుచులు పాల్గొనడం ఆనందంగా ఉందన్న ప్రధానమంత్రి.. వారి ఆశీర్వాదాలే నిజమైన బలమన్నారు. ప్రజలకు వందనాలు తెలిపిన ఆయన.. అందరికీ శుభాకాంక్షలూ తెలిపారు.ఈ నెల 27 ఒడిశాలో ప్రధానమంత్రి పర్యటన
September 26th, 09:05 pm
టెలికాం కనెక్టివిటీ రంగంలో స్వదేశీ టెక్నాలజీతో.. దాదాపు రూ.37,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 97,500కి పైగా మొబైల్ 4జీ టవర్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన 92,600కి పైగా 4జీ టెక్నాలజీ ప్రాంతాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి. డిజిటల్ భారత్ నిధి కింద 18,900కి పైగా 4జీ ప్రాంతాలకు నిధులు సమకూర్చగా.. మారుమూల, సరిహద్దు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని అనుసంధానం లేని దాదాపు 26,700 గ్రామాలను ఇవి అనుసంధానిస్తూ 20 లక్షలకు పైగా కొత్త చందాదారులకు సేవలు అందిస్తాయి. ఈ టవర్లు సౌరశక్తితో పనిచేస్తూ.. దేశంలో అతిపెద్ద గ్రీన్ టెలికాం సైట్‌ల సమూహంగా, సుస్థిరమైన మౌలిక సదుపాయాల్లో కీలక ముందడుగుగా నిలుస్తాయి.భారత్, బ్రిటన్ వ్యాపారవేత్తలతో సమావేశమైన ఇరు దేశాల ప్రధానమంత్రులు
July 24th, 07:38 pm
చారిత్రాత్మక భారత్, బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై (సీఈటీఏ) సంతకం చేసిన తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఈ రోజు ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఆరోగ్యం, ఔషధాలు, రత్నాలు - ఆభరణాలు, వాహనాలు, ఇంధనం, తయారీ, టెలికాం, టెక్నాలజీ, ఐటీ, సరకు రవాణా, వస్త్రాలు, ఆర్థిక సేవల రంగాలకు చెందిన పరిశ్రమల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రంగాలు రెండు దేశాల్లో ఉపాధి కల్పన, సమగ్ర ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి.భారత్- బ్రిటన్ దార్శనికత 2035
July 24th, 07:12 pm
జూలై 24న జరిగిన సమావేశంలో “భారత్- బ్రిటన్ దార్శనికత 2035”ను ఇరు దేశాల ప్రధానమంత్రులు ఆమోదించారు. రెండు దేశాలు తమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకునేలా చేసే వాణిజ్య ఒప్పందం కుదిరిన అనంతరం దీనికి ఆమోదం తెలపటం అనేది నాయకుల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంతో పరస్పర వృద్ధి, శ్రేయస్సు కోసం ఉభయ దేశాలు కలిసి చేయనున్నాయి. వేగంగా మారుతోన్న ప్రస్తుత సమయంలో సుసంపన్న, సురక్షిత, సుస్థిర ప్రపంచాన్ని రూపొందించేందుకు రెండు దేశాల సంకల్పాన్ని ఈ ఒప్పందం తెలియజేస్తోంది.టీవీ9 సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 08:00 pm
గౌరవనీయ రామేశ్వర్ గారు, రాము గారు, బరుణ్ దాస్ గారు, మొత్తం టీవీ9 బృందానికి.. మీ నెట్‌వర్క్ వీక్షకులందరికీ, ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయ అతిథులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న మీకు అభినందనలు.టీవీ9 సదస్సు-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 28th, 06:53 pm
భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన టీవీ9 సదస్సు-2025లోప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత టీవీ9 బృందానికి, వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చానెల్‌కు ప్రాంతీయ వీక్షకులు విస్తృత సంఖ్యలో ఉండగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు కూడా వారిలో భాగం కానున్నారని పేర్కొన్నారు. దూరవాణి మాధ్యమం (టెలికాన్ఫరెన్స్) ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్న భారత ప్రవాసులకు సాదర స్వాగతం పలకడంతోపాటు అభినందనలు తెలిపారు.ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు అనువాదం
October 21st, 10:25 am
ఎన్ డిటివి వరల్డ్ సమ్మిట్ కు హాజరైన గౌరవ అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సులో మీరు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ నాయకులు కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.న్యూఢిల్లీలో ‘ఎన్డిటివి’ ప్రపంచ సదస్సు-2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 21st, 10:16 am
గత నాలుగైదేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- ప్రపంచ భవిష్యత్తు సంబంధిత ఆందోళనలపై చర్చలు ఒక సాధారణ ఇతివృత్తంగా మారిపోయాయయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్, ఆ మహమ్మారి అనంతర ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాతావరణ మార్పు సమస్యలు, కొనసాగుతున్న యుద్ధాలు, సరఫరా శ్రేణిలో వినూత్న మార్పులు, అమాయక జనం మరణాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి సంఘర్షణల సవాళ్లు వగైరాలన్నీ ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో చర్చనీయాంశాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే సమయాన భారత్ మాత్రం తన శతాబ్ది వేడుకల నిర్వహణ గురించి చర్చిస్తున్నదని ప్రకటించారు. ‘‘ప్రపంచమంతా పీకల్లోతు సంక్షోభంలో మునిగితే, భారత్ ఆశాకిరణంగా ఉద్భవించింద’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థితిగతులు, దాని ముందున్న సవాళ్లతో భారత్ ప్రభావితమైనప్పటికీ, వాటిని అధిగమించగల ఆశావహ దృక్పథం కొరవడలేదని స్పష్టం చేశారు.ఐటీయూ - వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 15th, 10:05 am
నా మంత్రివర్గ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా జీ, చంద్రశేఖర్ జీ, ఐటీయూ సెక్రటరీ జనరల్, వివిద దేశాల మంత్రులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, పరిశ్రమ ముఖ్యులు, టెలికాం నిపుణులు, అంకుర సంస్థలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు, భారత్, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,న్యూఢిల్లీలో ‘ఐటియు’ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం
October 15th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటియు)- వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 (డబ్ల్యుటిఎస్ఎ) ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసి) 8వ మహాసభకూ ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.అక్టోబర్ 15న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ద్వారా
October 14th, 05:31 pm
న్యూఢిల్లీ భారత మండపంలో అక్టోబర్ 15, ఉదయం 10 గంటలకు ‘అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) - ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ ప్రామాణీకరణ సభ (డబ్ల్యూటీఎస్ఏ)’ సమావేశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2024’ 8వ సంచికను సైతం ప్రధాని ప్రారంభిస్తారు.సనంద్ లో మరో సెమీ కండక్టర్ పరిశ్రమకు మంత్రివర్గం ఆమోదం
September 02nd, 03:32 pm
సెమీ కండక్టర్ పరిశ్రమల్ని ప్రోత్సహించే ధ్యేయంతో, గుజరాత్ లోని సనంద్ లో ఒక సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గుజరాత్ లోని సనంద్ లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కెయిన్స్ సెమికన్ అనే ప్రైవేటు కంపెనీ ముందుకు వచ్చింది. ప్రతిపాదిత యూనిట్‌ను రూ.3,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ లో రోజుకు 60 లక్షల చిప్‌లు ఉత్పత్తి కానున్నాయి.పెట్టుబడులపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని నిర్వహించిన భారత్, సౌదీ అరేబియా
July 28th, 11:37 pm
పెట్టుబడులపై భారతదేశం-సౌదీ అరేబియా ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా, సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్ మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ లు సహాధ్యక్షత వహించారు.US National Security Advisor calls on Prime Minister Shri Narendra Modi
June 17th, 07:44 pm
US National Security Advisor, H.E. Mr. Jake Sullivan, called on Prime Minister Shri Narendra Modi today.Chip manufacturing will take India towards self-reliance, towards modernity: PM Modi
March 13th, 11:30 am
PM Modi addressed ‘India’s Techade: Chips for Viksit Bharat’ program and laid the foundation stone for three semiconductor projects worth about Rs 1.25 lakh crores via video conferencing. Today’s projects will play a key role in making India a semiconductor hub”, PM Modi said, as he congratulated the citizens for the key initiatives.