భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 03rd, 12:00 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కిరణ్ రిజిజు గారు, రాందాస్ అథవాలే గారు, రావు ఇందర్‌జిత్ గారు... ఢిల్లీ ముఖ్యమంత్రికి ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమం ఉన్నందున వారు వెళ్లిపోయారు... ఇక్కడ ఉన్న ఢిల్లీకి చెందిన ఇతర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ సక్సేనా గారు, మహాశయులారా, గౌరవనీయ దౌత్య బృంద సభ్యులారా, బౌద్ధ పండితులారా, ధమ్మ అనుచరులారా, సోదరీ సోదరులారా...భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 03rd, 11:30 am
న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఇవాళ ద లైట్ అండ్ ద లోటస్: రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ పేరిట భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్రమైన పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 125 ఏళ్ల తర్వాత భారత వారసత్వం తిరిగి వచ్చిందని, దేశ సంపద పునరాగమనం చేసిందన్నారు. నేటి నుంచి భారత ప్రజలు గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికిన శ్రీ నరేంద్ర మోదీ, శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధ సన్యాసులు, ధర్మ ఆచార‌్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రణామాలు తెలియజేశారు. వారి ఉనికి కార్యక్రమానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు. 2026 ప్రారంభంలోనే ఈ పవిత్ర వేడుక జరగటం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంపద, సామరస్యంతో నవశకానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.ప్రధానిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
December 03rd, 02:25 pm
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు న్యూ ఢిల్లీ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
November 26th, 10:10 am
నేను పార్లమెంటుకు చేరుకోవాల్సి ఉన్నందున సమయం చాలా తక్కువగా ఉంది. గౌరవ రాష్ట్రపతితో ఒక కార్యక్రమం ఉంది. అందువల్ల ఎక్కువసేపు మాట్లాడకుండా నేను కొన్ని అంశాలను త్వరగా పంచుకుని... నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ రోజు నుంచి భారత విమానయాన రంగం కొత్త ఊపును పొందబోతోంది. ఈ కొత్త శాఫ్రాన్ కేంద్రం భారత్‌ను ప్రపంచ ఎంఆర్వో కేంద్రంగా నిలపడంలో సహాయపడుతుంది. ఈ ఎంఆర్వో కేంద్రం హైటెక్ ఏరోస్పేస్ ప్రపంచంలో యువతకు కొత్త అవకాశాలనూ సృష్టిస్తుంది. నేను ఈనెల 24న సాఫ్రాన్ బోర్డు యాజమాన్యాన్ని కలిశాను. నేను వారిని ఇంతకు ముందు కూడా కలిశాను. ప్రతి చర్చలోనూ భారత్ పట్ల వారి నమ్మకం, ఆశను నేను చూశాను. భారత్‌లో శాఫ్రాన్ పెట్టుబడి అదే వేగంతో కొనసాగుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ రోజు ఈ కేంద్రం కోసం కృషి చేసిన టీం శాఫ్రాన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.హైదరాబాద్‌లోని ‘శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి
November 26th, 10:00 am
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో ఉన్న శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. శాఫ్రాన్ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్‌ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓ (నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర మార్పు) కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ ఎంఆర్ఓ కేంద్రం అత్యాధునిక సాంకేతిక గల విమానాయన రంగంలో యువతకు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. నవంబర్ 24న శాఫ్రాన్ బోర్డు, అధికారుల బృందాన్ని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికంటే ముందు కూడా వారితో జరిగిన ప్రతి చర్చలో భారత్ పట్ల వారికి ఉన్న విశ్వాసం, ఆశాభావాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దేశంలో శాఫ్రాన్ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా శాఫ్రాన్ బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన
November 18th, 11:38 am
నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణం నష్టం పట్ల ప్రధాని సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహార ప్రకటన
November 03rd, 10:49 am
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.తెలంగాణ... కర్ణాటక... బీహార్... అస్సాం రాష్ట్రాల కోసం 3 మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు సహా గుజరాత్‌లోని కచ్‌లో దూర ప్రాంతాలను అనుసంధానించే ఒక రైలు మార్గానికి మంత్రిమండలి ఆమోదం
August 27th, 04:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తెలంగాణ సహా దేశంలోని 5 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.12,328 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి:తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
June 02nd, 09:54 am
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ ప్రగతికి అసంఖ్యాకమైన తోడ్పాటును అందిస్తోందని ఈ రాష్ట్రానికి పేరుంది. రాష్ట్ర ప్రజలకు ‘జీవించడంలో సౌలభ్యాన్ని’ పెంపొందింప చేయడానికి గత పది సంవత్సరాల కాలానికి పైగా అనేక చర్యలను ఎన్‌డీయే ప్రభుత్వం చేపట్టిందని శ్రీ మోదీ తెలిపారు.ప్రధాన మంత్రి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
May 24th, 08:41 pm
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, నేడు న్యూఢిల్లీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిశారు.ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
May 02nd, 03:45 pm
ఈవేళ పవిత్ర అమరావతి గడ్డపై నిల్చుని నా మనో నేత్రంతో వీక్షిస్తున్నది ఒక నగరాన్ని మాత్రమే కాదు.. ఒక స్వప్న సాకారాన్ని... ఓ కొత్త అమరావతిని.. సరికొత్త ఆంధ్రను దర్శిస్తున్నా. సంప్రదాయంతో ముడిపడిన పురోగమనానికి అమరావతిగడ్డ ఒక ప్రతీక. బౌద్ధ వారసత్వమైన శాంతితోపాటు వికసిత భారత్ ను రూపుదిద్దే శక్తిని కూడా ఈ నేల అక్కున చేర్చుకుంటుంది. ఈ రోజు ఇక్కడ సుమారు 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభాలు జరిగాయి. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు, భారత అభివృద్ధి దృక్పథానికి బలమైన పునాదులు. వీరభద్ర స్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వేంకటేశ్వర స్వామిలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గార్లకు నా అభినందనలు.ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రూ.58,000 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన.. ప్రారంభోత్సవం
May 02nd, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రూ.58,000 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఇవాళ పవిత్ర అమరావతి గడ్డపై నిల్చున్న తన మనో నేత్రంతో వీక్షిస్తున్నది ఒక నగరాన్ని మాత్రమే కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఒక స్వప్న సాకారాన్ని... ఓ కొత్త అమరావతిని.. సరికొత్త ఆంధ్రను దర్శిస్తున్నానని అభివర్ణించారు. “సంప్రదాయంతో ముడిపడిన పురోగమనానికి అమరావతిగడ్డ ఒక ప్రతీక. బౌద్ధ వారసత్వమైన శాంతితోపాటు వికసిత భారత్‌ను రూపుదిద్దే శక్తిని కూడా ఈ నేల అక్కున చేర్చుకుంటుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ రోజు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడాన్ని ప్రస్తావిస్తూ- ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు, భారత అభివృద్ధి దృక్పథానికి బలమైన పునాదులని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరభద్ర స్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వేంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్‌లకూ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.జనవరి 6న వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి
January 05th, 06:28 pm
జనవరి 6 మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు.నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు భువనేశ్వర్లో జరిగే డైరెక్టర్ జనరల్స్/ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సదస్సుకు హాజరు కానున్న ప్రధాని
November 29th, 09:54 am
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు ఒడిశాలో జరిగే డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత కాన్ఫరెన్స్ 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొంటారు. భువనేశ్వర్లో ఉన్న లోక్ సేవాభవన్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.Basic spirit of Vishwakarma Yojna is ‘Samman Samarthya, Samridhi: PM in Wardha
September 20th, 11:45 am
PM Modi addressed the National PM Vishwakarma Program in Wardha, Maharashtra, launching the ‘Acharya Chanakya Skill Development’ scheme and the ‘Punyashlok Ahilyadevi Holkar Women Startup Scheme.’ He highlighted the completion of one year of the PM Vishwakarma initiative, which aims to empower artisans through skill development. The PM laid the foundation stone for the PM MITRA Park in Amravati, emphasizing its role in revitalizing India's textile industry.మహారాష్ట్ర, వార్ధాలో నిర్వహించిన జాతీయ పీఎం విశ్వకర్మ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 20th, 11:30 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని వార్ధాలో నిర్వహించిన జాతీయ పీఎం విశ్వకర్మ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్‌మెంట్’ పథకం, ‘పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్’లను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు ధ్రువపత్రాలను, రుణాలను ఆయన విడుదల చేశారు. పీఎం విశ్వకర్మ కార్యక్రమం కింద ఒక సంవత్సరం పాటు సాధించిన పురోగతికి గుర్తుగా స్మారక స్టాంపును కూడా ప్రధాని విడుదల చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ అపెరల్ (పీఎం మిత్ర) పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని తిలకించారు.ప్రధానమంత్రితో తెలంగాణ గవర్నర్ సమావేశం
August 03rd, 10:13 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
July 04th, 04:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.Today, Ramlala sits in a grand temple, and there is no unrest: PM Modi in Karakat, Bihar
May 25th, 11:45 am
Prime Minister Narendra Modi graced the historic lands of Karakat, Bihar, vowing to tirelessly drive the nation’s growth and prevent the opposition from piding the country on the grounds of inequality.PM Modi addresses vivacious crowds in Pataliputra, Karakat & Buxar, Bihar
May 25th, 11:30 am
Prime Minister Narendra Modi graced the historic lands of Pataliputra, Karakat & Buxar, Bihar, vowing to tirelessly drive the nation’s growth and prevent the opposition from piding the country on the grounds of inequality.