కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

August 10th, 09:30 am

కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు. గత దశాబ్ద కాలంగా భారత క్రీడా రంగం మారుతున్న తీరును ప్రస్తావిస్తూ… గత 12-13 ఏళ్ల పదవీ కాలంలో జాతీయ క్రీడాకారులను తన నివాసానికి ఆహ్వానించి, సత్కరించటం సాధారణ, అపూర్వమైన సంప్రదాయంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. సాధారణ ప్రచారాల కన్నా అంకితభావం, నిరంతర కృషితో భారత అథ్లెట్లు సాధించిన విజయాలు... పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. పాఠశాలలకు వెళ్లి మనం చెప్పిన మాటల కన్నా, మీ పతకాలు వారికి ఎక్కువ స్ఫూర్తిని కలిగిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

‘2026 కామన్వెల్త్ గేమ్స్‌’లో డెకాథ్లాన్ పోటీ కాంస్య పతక విజేత తేజస్విన్ శంకర్‌‌‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

August 01st, 08:43 am

గ్లాస్గోలో ‘2026 కామన్వెల్త్ గేమ్స్’ పురుషుల డెకాథ్లాన్ పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన తేజస్విన్ శంకర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.

May 31st, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.

ఆసియా క్రీడల పురుషుల డెకథ్లాన్లో రజత పతకం సాధించిన తేజస్విన్ శంకర్కు ప్రధానమంత్రి అభినందన

October 03rd, 11:34 pm

ఆసియా క్రీడల పురుషుల డెకథ్లాన్‌లో రజత పతకం సాధించిన తేజస్విన్‌ శంకర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

హై జంప్ లో భారతదేశాని కి తొలి పతకాన్ని గెలిచినందుకు శ్రీ తేజస్విన్ శంకర్ కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

August 04th, 09:55 am

హై జంప్ లో భారతదేశాని కి ఒకటో పతకాన్ని గెలిచినందుకు శ్రీ తేజస్విన్ శంకర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలియజేశారు. హై జంప్ లో శ్రీ తేజస్విన్ శంకర్ సాధించినటువంటి ఈ కాంస్య పతకం కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో ట్రాక్ ఎండ్ ఫీల్డ్ లో భారతదేశాని కి లభించిన మొట్టమొదటి పతకం.