ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌లో ప్రమాదం.. ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
April 23rd, 07:24 pm
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతిచెందడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.