PM Modi arrives in Paris
June 18th, 07:31 am
PM Modi arrived in Paris, France, to a warm welcome by the Indian diaspora.ఎవియాన్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షునితో సమావేశమైన ప్రధానమంత్రి
June 18th, 05:04 am
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో 2026 జూన్ 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన కింద దాదాపు
June 17th, 03:14 pm
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 2026 జూన్ 19న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో.. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వై) కింద దాదాపు రూ. 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు.స్వావలంబన, ఆవిష్కరణల ద్వారా గడచిన దశాబ్దంలో రక్షణ సామర్థ్యాల్లో భారత్ సాధించిన పరివర్తన గురించి వివరించిన ప్రధానమంత్రి
June 17th, 12:34 pm
ఆత్మనిర్భరత లక్ష్యం ఆధారంగా.. ఆవిష్కరణలూ, సాంకేతిక పరిజ్ఞానమూ, స్వదేశీ తయారీ రంగం అందిస్తున్న శక్తితో భారతదేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ స్థాయిలో రూపాంతరం చెందాయని శ్రీ మోదీ అన్నారు.జీ7 సదస్సు నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
June 17th, 12:38 am
2026 జనవరిలో అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ భారత్‌లోనూ, 2026 మేలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూఏఈలోనూ పర్యటించారు. ఈ పర్యటనల అనంతరం రెండు దేశాల ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని, సానుకూల మార్పులను ఇద్దరు నాయకులు సమీక్షించారు. వాటిలో సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ రంగాలున్నాయి. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నాయకులిద్దరూ తమ ఆలోచనలను పంచుకున్నారు.జీ7 సదస్సు నేపథ్యంలో యూకే ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
June 17th, 12:36 am
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దైపాక్షిక సమావేశం నిర్వహించారు.India and Slovakia are moving forward in close coordination on the global stage: PM Modi at the India-Slovakia Joint Press Meet
June 15th, 03:00 pm
At the joint press meet in Bratislava, PM Modi and Slovak Prime Minister Robert Fico announced the elevation of India-Slovakia ties to a Comprehensive Partnership. PM Modi highlighted growing cooperation in trade, technology, defence, space, digital innovation and mobility, saying the upgraded partnership reflects shared priorities, shared trust and a shared vision for the future.ఆవిష్కరణలపై భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక ప్రణాళిక-2030
June 15th, 05:42 am
భారత్-ఫ్రాన్స్ స్నేహ బంధాన్ని 2026 ఫిబ్రవరి 17న “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త మలుపు తిప్పారు. అలాగే, ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం-2026’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ), ఆవిష్కరణలు, పరిశోధన, సాంకేతికత, డిజిటల్ రంగం, సైబర్ రంగం, ఆరోగ్యం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, విద్యా సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం, వైవిధ్యభరితంగా రూపుదిద్దాలని వారిద్దరూ నిర్ణయించారు.ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
June 14th, 04:36 pm
ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాం. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’కు శ్రీకారం
June 14th, 03:00 pm
ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్)లో ఇవాళ “భారత్ ఇన్నొవేట్స్-2026”ను సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణ పెట్టుబడి సంస్థలు, అవకాశాల దిశగా భారత డీప్-టెక్ అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికపైకి తెస్తుంది. అంతర్జాతీయ ప్రాధాన్యంగల 13 కీలక సాంకేతిక రంగాల్లో 120కి పైగా వినూత్న అంకుర సంస్థలను, 20కి పైగా అగ్రశ్రేణి నైపుణ్య సంస్థలు సహా భారత అగ్రశ్రేణి డీప్ టెక్నాలజీని ప్రపంచానికి ఈ వేదిక చాటిచెబుతుంది. ప్రపంచంలోని 350 మందికి పైగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.మహిళల నాయకత్వంలో విభిన్న రంగాల్లో అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి
June 12th, 12:39 pm
మహిళల నాయకత్వంలో అభివృద్దిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కృషి చేస్తోందనీ, ఇది అన్ని రంగాలలో స్పష్టంగా కనిపిస్తోందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. అభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాలకు చేరవేయడం మొదలు ఔత్సాహిక పారిశ్రామికత్వం, విద్య, ఆరోగ్యసంరక్షణ, స్వచ్ఛత, గృహనిర్మాణం, క్రీడలు, విజ్ఞానశాస్త్రం, పరిపాలన.. ఇలా వివిధ రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని ఆయన తెలిపారు.The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.డామన్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన...జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 07:20 pm
మీరంతా ఇక్కడకు ఎలాగైతే వచ్చారో అలాగే లక్షద్వీప్‌లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనతో అనుసంధానమయ్యారు. ఈరోజు లక్షద్వీప్‌లో అభివృద్ధికి ఒక కొత్త ఆరంభం జరిగింది. లక్షద్వీప్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఒక కొత్త ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించడంతో పాటు కొన్ని పథకాలకు శంకుస్థాపనలు కూడా చేశాం.డామన్‌లో సుమారు రూ. 2,970 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు... ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 07:15 pm
డామన్‌లో సుమారు రూ.2,970 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన గత పర్యటనను గుర్తుచేసుకుంటూ, తాను గతంలో చేసిన పరిశీలన ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు వైవిధ్యభరితమైన, చైతన్యవంతమైన మన దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నివసించే వివిధ ప్రాంతాల ప్రజలతో యావత్ దేశపు అందమైన దృశ్యాన్ని అందిస్తూ, మినీ ఇండియాకు సజీవ ఉదాహరణగా డామన్ నిలుస్తోంది అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 04:30 pm
విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!గుజరాత్‌లోని సూరత్‌లో ₹18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 04:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.తెలంగాణ పరిధిలోగల జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-63.. 563 కింద ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల... జగిత్యాల-కరీంనగర్ విభాగాల విస్తరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
June 03rd, 03:26 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) తెలంగాణలో రెండు జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎన్‌హెచ్-63లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల విభాగాన్ని ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (హెచ్‌ఏఎం)లో నిర్మిస్తారు. అదేవిధంగా ఎన్‌హెచ్-563లోని జగిత్యాల-కరీంనగర్ విభాగాన్ని ‘నిర్మాణం-నిర్వహణ-బదిలీ-టోల్’' (బీఓటీ-టోల్) పద్ధతిలో 4 వరుసల ప్రమాణాలకు అనుగుణంగా విస్తరంచేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మూడు వేర్వేరు ప్యాకేజీలుగా నిర్మించే ఈ జాతీయ రహదారి విభాగాల ప్రాజెక్టు పొడవు 190.76 కి.మీ. కాగా, మొత్తం మూలధన వ్యయం రూ.7597.16 కోట్లుగా అంచనా వేశారు.బీహార్‌లో జాతీయ రహదారి-31.. 231ల పరిధిలోని ఖగారియా-పూర్నియా విభాగం ఉన్నతీకరణకు మంత్రిమండలి ఆమోదం
June 03rd, 03:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) బీహార్‌లోని జాతీయ రహదారి-31, 231ల పరిధిలోగల ఖగారియా-పూర్నియా విభాగం ఉన్నతీకరణకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిర్మాణం-నిర్వహణ-బదిలీ-టోల్ (బీఓటీ-టోల్) పద్ధతిలో 4 వరుసల ప్రమాణాలకు అనుగుణంగా 143.529 కిలోమీట్లర పొడవైన ఈ ప్రాజెక్టును రూ.3936.05 కోట్ల వ్యయంతో ఉన్నతీకరిస్తారు.సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ భారత అధికారిక పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
May 22nd, 04:11 pm
ఉగ్రవాద నిరోధంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం