బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో న్యూఢిల్లీలో నైజీరియా ఉపాధ్యక్షునితో ప్రధాని సమావేశం

September 13th, 06:13 pm

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో న్యూఢిల్లీలో నైజీరియా ఫెడరల్ రిపబ్లిక్ ఉపాధ్యక్షులు జీసీవోఎన్ కాషిం షెట్టిమా ముస్తఫాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన నైజీరియా బృందానికి ఉపాధ్యక్షులు జీసీవోఎన్ కాషిం షెట్టిమా ముస్తఫా నాయకత్వం వహిస్తున్నారు.

న్యూఢిల్లీలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఉగాండా ఉపాధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ

September 13th, 05:13 pm

న్యూఢిల్లీలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఉగాండా ఉపాధ్యక్షురాలు గౌరవ జెసికా రోజ్ ఎపెల్ అలుపోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో ఫలవంతంగా ముగిసింది.

న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం

September 13th, 04:38 pm

న్యూఢిల్లీలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్ జూనియర్‌తో సమావేశమయ్యారు. ‘ఆసియాన్’ కూటమి అధ్యక్ష హోదాలో ఫిలిప్పీన్స్ ప్రస్తుత బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కజకిస్థాన్‌ అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి

September 13th, 04:31 pm

న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కజకిస్థాన్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు కాసిమ్‌-జోమార్ట్‌ టోకయేవ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

పునరుత్థానం.. ఆవిష్కరణ.. సహకారం.. సుస్థిరత దిశగా అవిరళ కృషి: బ్రిక్స్ న్యూఢిల్లీ తీర్మానం

September 12th, 06:11 pm

బ్రిక్స్ దేశాల నాయకులుగా మేము- “పునరుత్థానం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత దిశగా అవిరళ కృషి” ఇతివృత్తంతో భారత్‌లోని న్యూఢిల్లీలో 2026 సెప్టెంబరు 12, 13 తేదీల్లో నిర్వహించిన బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నాం.

బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సులో ‘సార్వజనీన అంతర్జాతీయ పరిపాలన బలోపేతం’పై చర్చలో ప్రధానమంత్రి ప్రసంగం

September 12th, 02:50 pm

ఈ విశిష్ట కార్యక్రమం కోసం భారత్‌ వచ్చిన మిమ్మల్ని శుభాకాంక్షలతో స్వాగతించడం నాకెంతో ఆనందదాయకం. బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలలో భాగంగా ప్రజాకేంద్రక, మానవాళి ప్రధాన విధానాన్ని భారత్‌ అనుసరిస్తోంది. పునరుత్థాన సామర్థ్యం, ఆవిష్కరణలలో సహకారం, సుస్థిరతలు మా అగ్ర ప్రాథమ్యాలు. ఈ దృక్కోణంతోనే బ్రిక్స్‌ సహకారాన్ని సామాన్య జన జీవనంతో మరింతగా ముడిపెట్టేందుకు మేం ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా 350కి పైగా సమావేశాలు నిర్వహించాం. దేశంలోని దాదాపు 30 నగరాల్లో మీ బృందాలన్నిటికీ స్వాగతం పలికే సదవకాశం మాకు లభించింది. బ్రిక్స్‌కు భారత్‌ అధ్యక్షతను విజయవంతం చేయడంలో మీ అందరి సన్నిహిత సహకారం, మద్దతుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

‘సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షిక విధానాన్ని బలోపేతం చేయడం’’ అనే అంశంపై జరిగిన బ్రిక్స్ సమావేశానికి ప్రధాని అధ్యక్షత

September 12th, 02:40 pm

న్యూఢిల్లీలో కొనసాగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా సెప్టెంబర్ 12,2026న ‘‘సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షిక విధానాన్ని బలోపేతం చేయడం’’ అనే అంశంపై జరిగిన సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

బ్రిక్స్ సదస్సులో భాగంగా న్యూఢిల్లీలో అబుదాబి యువరాజుతో సమావేశమైన ప్రధానమంత్రి

September 12th, 01:48 pm

సెప్టెంబర్ 12, 2026న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యువరాజు గౌరవ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్‌తో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం

September 11th, 07:19 pm

అందరికీ నమస్కారం!బ్రిక్స్‌ వాణిజ్య వేదిక (బిజినెస్‌ ఫోరమ్‌) సమావేశం సందర్భంగా మీకిదే నా హృదయపూర్వక స్వాగతం. ఈ ఏడాది మనం బ్రిక్స్ 20వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ కూటమికి 2006లో శ్రీకారం చుట్టిన నాడు కేవలం నాలుగు దేశాలు మాత్రమే ఇందులో ఉండేవి. అయితే, బ్రిక్స్ సభ్య-భాగస్వాములతో కలిపి, ఇప్పుడు మనది 21 దేశాలతో కూడిన ఒక ఉమ్మడి కుటుంబం.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన జర్మనీ ఛాన్సలర్‌

September 10th, 06:24 pm

జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్‌ చేశారు.

పారిస్‌ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం

September 10th, 02:50 pm

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సరైన సమయంలో సాదరంగా తనను ఆహ్వానించడంపై చొరవ చూపిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించడంపై- “తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాలుపంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

పారిస్‌లో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 10th, 02:45 pm

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సరైన సమయంలో సాదరంగా తనను ఆహ్వానించడంపై చొరవ చూపిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించడంపై- “తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాలుపంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

అనువాదం: ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 08th, 06:27 pm

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన ఆవిష్కర్తలకు, నాయకులకు, పెట్టుబడిదారులకు ప్రధాని సాదర స్వాగతం పలికారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఈ కార్యక్రమంలో వరుసగా మూడోసారి పాల్గొనడం ఎంతో జాతీయ ప్రాధాన్యత కలిగిన 'హ్యాట్రిక్'లా అనిపిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. వికసిత భారత్ నిర్మాణంలో మీరు ఎంత ముఖ్యమో, మీ పని కూడా అంతటి కీలకమైనదని ఈ హ్యాట్రిక్ చాటిచెబుతోంది అని శ్రీ మోదీ అన్నారు.

ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 08th, 06:00 pm

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన ఆవిష్కర్తలకు, నాయకులకు, పెట్టుబడిదారులకు ప్రధాని సాదర స్వాగతం పలికారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఈ కార్యక్రమంలో వరుసగా మూడోసారి పాల్గొనడం ఎంతో జాతీయ ప్రాధాన్యత కలిగిన 'హ్యాట్రిక్'లా అనిపిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. వికసిత భారత్ నిర్మాణంలో మీరు ఎంత ముఖ్యమో, మీ పని కూడా అంతటి కీలకమైనదని ఈ హ్యాట్రిక్ చాటిచెబుతోంది అని శ్రీ మోదీ అన్నారు.

గుజరాత్‌లోని నవసారిలో ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగం

September 08th, 02:45 pm

గుజరాత్‌లోని నవసారిలో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఆ ప్రాంతంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే, అనేక సంక్షేమ కార్యక్రమాలను నడిపిస్తున్న సేవా స్ఫూర్తిని, ప్రజా భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు.

గుజరాత్‌లోని వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 08th, 12:30 pm

గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

గుజరాత్‌లోని వడోదరాలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు

September 08th, 12:00 pm

గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సెప్టెంబరు 8న గుజరాత్, మహారాష్ట్రలలో ప్రధానమంత్రి పర్యటన

September 07th, 11:51 am

ప్రధాని మోదీ సెప్టెంబర్ 8న గుజరాత్, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026ను కూడా ప్రారంభిస్తారు. సరుకు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడం నుండి డిజిటల్ ఫైనాన్స్ భవిష్యత్తును తీర్చిదిద్దడం వరకు, ఈ పర్యటన భారతదేశ వృద్ధి, ఆవిష్కరణల ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్తుంది.

స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవం భారత్-ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలలో ఒక కొత్త మైలురాయి: ప్రధాని మోదీ

September 06th, 10:40 pm

ఫ్రాన్స్‌లోని పారిస్‌లో బీఏపీఎస్ స్వామినారాయణ హిందూ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని భారత్-ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాలలో ఒక కొత్త మైలురాయిగా అభివర్ణించారు. ఆలయ నిర్మాణం వెనుక ఉన్న సాధువులు, ఆధ్యాత్మిక నాయకుల కృషిని హైలైట్ చేస్తూ, ఇది “మేడ్ ఇన్ ఇండియా” మరియు “బిల్ట్ ఇన్ ఫ్రాన్స్” అని ఆయన పేర్కొన్నారు. రాబోయే శతాబ్దాల పాటు ఇది ఇరు దేశాల మధ్య సహకారానికి, కొత్త అవకాశాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్యారిస్‌లో బీఏపీఎస్ స్వామి నారాయణ్ హిందూ మందిర్ ప్రారంభోత్సంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 06th, 10:00 pm

ఫ్రాన్స్‌లోని పారిస్‌లో BAPS స్వామినారాయణ్ హిందూ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా, భారత-ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాలలో ఈ కార్యక్రమం ఒక కొత్త మైలురాయి అని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో సాధువులు మరియు ఆధ్యాత్మిక నాయకులు చేసిన కృషిని ప్రస్తావిస్తూ, ఇది మేడ్ ఇన్ ఇండియా (భారతదేశంలో తయారైనది) మరియు బిల్ట్ ఇన్ ఫ్రాన్స్ (ఫ్రాన్స్‌లో నిర్మించబడినది) అని ఆయన అన్నారు; అలాగే, రాబోయే శతాబ్దాల పాటు ఈ ఆలయం ఇరు దేశాల మధ్య సహకారానికి మరియు కొత్త అవకాశాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.