Bengal’s strength is known worldwide, but TMC has trapped it in corruption: PM Modi in Mathurapur
April 23rd, 01:00 pm
Addressing a Vijay Sankalp rally in Mathurapur, West Bengal, PM Modi contrasted BJP’s 11 years of development with TMC’s 15 years of “lies and betrayal.” Targeting the TMC's syndicate culture, he described widespread “cut money” in jobs, land, rations and mandis. He concluded by asserting that a strong wave of change is visible across Bengal, driven by women and youth.Today, against TMC’s jungle raj, people across Bengal are blowing the conch of change: PM Modi in Krishnanagar
April 23rd, 12:45 pm
PM Modi addressed a massive public rally in Krishnanagar, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal. He highlighted 15 years of “scams and broken promises” under TMC, contrasting it with BJP’s vision of “Sabka Saath, Sabka Vikas”. Reaffirming Modi's guarantee, he announced 10 guarantees for women.PM Modi’s high-energy rallies in Krishnanagar and Mathurapur, West Bengal
April 23rd, 12:30 pm
PM Modi addressed massive public gatherings in Krishnanagar and Mathurapur, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal.ఆది శంకరాచార్యకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
April 21st, 01:09 pm
భారత్ మహనీయ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ఆది శంకరాచార్య జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆది శంకరాచార్య లోతైన బోధనలు, ఆలోచనలు, అద్వైత వేదాంత తత్త్వం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శకంగా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు. ఆధ్యాత్మిక చింతనను పునరుత్తేజితం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలూ, దేశమంతటా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రాలూ కలకాలం స్ఫూర్తినిస్తాయన్నారు. ‘‘ఆయన జ్ఞానం మనకు దారి దీపంగా నిలవాలనీ, సత్యం, దయలతో పాటు సకల వర్గాల శ్రేయస్సుకు పాటుపడాలన్న మన నిబద్ధతను బలోపేతం చేయాలనీ కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.అనువాదం: ‘పరీక్షా పే చర్చ 2026’ కార్యక్రమం 2వ ఎపిసోడ్‌లో విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషణ
February 09th, 10:30 am
ప్రధానమంత్రి: నా ప్రియమైన మిత్రులారా.. ‘పరీక్షా పే చర్చ’లోని ఈ ముఖ్యమైన విడతకు మీకు స్వాగతం. ఈసారి ఇది కొంచెం భిన్నంగా, కొంచెం ప్రత్యేకంగా ఉండనుంది. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని చాలా మంది విద్యార్థులు సూచించారు. అందుకే ఈసారి నేను భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులతో కలిసి ఈ చర్చలు జరపడానికి కూర్చున్నాను. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో మీరు సరిగ్గా అదే చూడబోతున్నారు. మనం తమిళనాడులోని కోయంబత్తూరుతో ప్రారంభిద్దాం. తమిళనాడు విద్యార్థుల శక్తి, జిజ్ఞాస నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకసారి చూద్దాం.పరీక్షా పే చర్చ- 2026 రెండో ఎపిసోడ్‌లో కోయంబత్తూర్, రాయ్‌పూర్, దేవ్‌మోగ్రా, గువాహటి విద్యార్థులతో సంభాషించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
February 09th, 10:00 am
తొమ్మిదో ఎడిషన్ పరీక్షా పే చర్చ (పీపీసీ)- 2026 కొనసాగింపులో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విద్యార్థులతో సంభాషించారు. పీపీసీ- 2026 రెండో ఎపిసోడ్ సందర్భంగా కోయంబత్తూర్, రాయ్‌పూర్, దేవ్‌మోగ్రా, గువాహటి నగరాలకు చెందిన పరీక్షా యోధులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. పరీక్షా పే చర్చ ప్రత్యేక ఎడిషన్‌కు విద్యార్థులను ఆహ్వానిస్తూ.. ఈసారి ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతోందని శ్రీ మోదీ తెలిపారు. కోయంబత్తూరు ఎడిషన్‌ను ప్రారంభిస్తూ.. తమిళనాడు విద్యార్థుల ఉత్తేజమూ, ఉత్సుకతా తనను ముగ్ధుడిని చేశాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘వణక్కం’ అని అభివాదం చేస్తూ సరదాగా వారితో ముచ్చటించారు. ప్రధానమంత్రిని చూసినప్పుడు తమ కళ్లను తామే నమ్మలేకపోయామంటూ విద్యార్థులు ఉత్సాహంగా మాట్లాడారు. ప్రధానమంత్రి ఎంతో ఆర్భాటంగా, నాటకీయంగా వస్తారనుకున్నామనీ.. కానీ ఆయన చాలా సాధారణంగా, నిరాడంబరంగా, మనలో ఒకరిగా కనిపించారని వారు చెప్పారు. ప్రధానమంత్రి రాక తమలో ఉత్తేజం నింపిందని ఒక విద్యార్థి చెప్పారు.ఈ ఏడాది పరీక్షా పే చర్చ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనలను ఆహ్వానించిన ప్రధాని
January 07th, 07:05 pm
పది, పన్నెండో తరగతుల బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరోసారి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించనున్నారు.జనవరి 3న భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
January 01st, 05:39 pm
భగవాన్ బుద్దునికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను 2026 జనవరి 3వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ‘‘ద లైట్, ద లోటస్: రెలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్’’ అనే ఇతివృత్తంతో న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా సాంస్కృతిక సముదాయంలో ఈ ప్రదర్శన జరగనుంది.ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
October 04th, 10:45 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, విదేశీ అతిథులు, టెలికాం రంగ ప్రముఖులు, వివిధ కళాశాలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన నా యువ మిత్రులు, సోదరీసోదరులారా!కౌశల్ దీక్షాంత్ సమరోహ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువత లక్ష్యంగా రూ.62,000 కోట్లకు పైగా విలువైన కార్యక్రమాలు ప్రారంభం
October 04th, 10:29 am
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువత అభివృద్ధి లక్ష్యంగా రూ. 62,000 కోట్లకు పైగా విలువైన పలు కార్యక్రమాలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఐటీఐలతో అనుబంధం ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు, బీహార్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని సంవత్సరాల కిందటే ప్రభుత్వం ఐటీఐ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున స్నాతకోత్సవ వేడుకలను నిర్వహించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించిందని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ఆ సంప్రదాయంలో మరో ముందడుగును సూచిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.రూ.5862 కోట్లకు పైగా వ్యయంతో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల (కేవీఎస్) ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం
October 01st, 03:43 pm
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరిగిన దృష్ట్యా వారి పిల్లల విద్యావసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా ప్రజా విభాగంలో 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను (కేవీ) ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 2026-27 మధ్య తొమ్మిది సంవత్సరాల పాటు ఈ 57 కొత్త కేవీల ఏర్పాటు, నిర్వహణకు దాదాపు రూ. 5862.55 కోట్లు వ్యయమవుతుందన్న అంచనా ఉంది. ఇందులో రూ. 2585.52 కోట్లు (సుమారుగా) మూలధన వ్యయం కాగా.. రూ. 3277.03 కోట్లు (సుమారుగా) నిర్వహణ వ్యయం. ఎన్ఈపీ 2020కి ఆదర్శవంతమైన పాఠశాలలుగా నిలిచేలా మొదటిసారిగా ఈ 57 విద్యాలయాల్లో బాలవాటికలు అంటే 3 సంవత్సరాల ఫౌండేషన్ దశ సౌకర్యాలు (ప్రీ-ప్రైమరీ) ఉండనున్నాయి.అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
September 05th, 08:36 am
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మేధస్సును పెంపొందించడంలో ఉపాధ్యాయుల అంకితభావం బలమైన, ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాది అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త, ఉపాధ్యాయులు డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ జీవితాన్ని, ఆలోచనలను ఆయన జయంతి సందర్భంగా మనం స్మరించుకుందాం అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.జాతీయ పురస్కారాలందుకున్న ఉపాధ్యాయుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 04th, 05:35 pm
మన సంప్రదాయంలో ఉపాధ్యాయులపై సహజమైన గౌరవం ఉంది. వారు సమాజానికి గొప్ప బలం కూడా. ఉపాధ్యాయులను ఆశీర్వాదాల కోసం నిలబడేలా చేయడం తప్పు. నేను అలాంటి పాపం చేయాలనుకోను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరినీ కలవడం నాకు అద్భుతమైన అనుభవం. మీలో ప్రతి ఒక్కరికి మీ సొంత కథ ఉండి ఉంటుంది. ఎందుకంటే అది లేకుండా మీరు ఈ స్థాయికి చేరుకునేవారు కాదు. ఆ కథలన్నింటినీ తెలుసుకోవడానికి తగినంత సమయం దొరకడం కష్టం. కానీ మీ నుంచి నేను నేర్చుకోగలిగినది నిజంగా స్ఫూర్తిదాయకం.. దాని కోసం నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ జాతీయ పురస్కారం అందుకోవడం ముగింపు కాదు. ఈ పురస్కారం అందుకున్న తర్వాత అందరి దృష్టి మీపైనే ఉంటుంది. దీని అర్థం మీ పరిధి గణనీయంగా విస్తరించింది. గతంలో మీ ప్రభావం, ఆదేశం పరిధి పరిమితమే. ఇప్పుడు ఈ గుర్తింపు తర్వాత అది చాలా విస్తృతంగా పెరుగుతుంది. ఇది ప్రారంభం అని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు వీలైనంత వరకు అందరితో పంచుకోవాలి. మీరు అలా చేస్తే మీలో సంతృప్తి పెరుగుతుంది. మీరు ఆ దిశలో కృషి చేస్తూనే ఉండాలి. ఈ పురస్కారానికి మీరు ఎంపిక కావడం మీ కృషికి, నిరంతర అంకితభావానికి నిదర్శనం. అందుకే ఇది సాధ్యమైంది. ఒక ఉపాధ్యాయుడు వర్తమానానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తు తరాలను కూడా రూపొందిస్తాడు.. భవిష్యత్తును మెరుగుపరుస్తాడు. ఇది దేశానికి చేసే సేవ కంటే తక్కువ కాదని నేను నమ్ముతున్నాను. నేడు మీవంటి కోట్లాది మంది ఉపాధ్యాయులు అదే దేశభక్తి, నిజాయితీ, అంకితభావంతో దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు. అందరికీ ఇక్కడికి వచ్చే అవకాశం లభించకపోవచ్చు. బహుశా చాలామంది ప్రయత్నించి ఉండకపోవచ్చు.. కొందరు గమనించి ఉండకపోవచ్చు. అలాంటి సామర్థ్యాలు గల ఉపాధ్యాయులు అనేకమంది ఉన్నారు. వారందరి సమిష్టి కృషి వల్లే దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.. భావి తరాలూ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. దేశం కోసం జీవించే అందరి సహకారం దీనిలో ఉంటుంది.Prime Minister Narendra Modi addresses National Awardee Teachers
September 04th, 05:33 pm
During a meeting with National Awardee Teachers, PM Modi remarked that teachers shape not only the present but also the future generation, highlighting India’s guru-disciple tradition. He announced that from 22nd September, the GST reforms will take effect, making essentials cheaper for millions of families. The PM emphasized that every home adopt Swadeshi, with teachers promoting it in schools.శ్రీ గురు గ్రంథ సాహెబ్ జీ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
August 24th, 01:02 pm
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసిన ప్రముఖులను అభినందించిన ప్రధానమంత్రి
July 13th, 10:47 am
భారత రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు ప్రముఖులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులకు ప్రధాని అభినందన
May 13th, 02:36 pm
సీబీఎస్ఈ పన్నెండు, పదో తరగతుల పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘మీ సంకల్పం, క్రమశిక్షణ, కృషి ఫలితమిది. మీ విజయానికి దోహదపడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులందరి పాత్రనూ గుర్తించాల్సిన రోజు కూడా ఇది’’ అని శ్రీ మోదీ అన్నారు.పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం
March 16th, 11:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 16th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.Be an example; don't demand respect, command respect. Lead by doing, not by demanding: PM Modi on PPC platform
February 10th, 11:30 am
At Pariksha Pe Charcha, PM Modi engaged in a lively chat with students at Sunder Nursery, New Delhi. From tackling exam stress to mastering time, PM Modi shared wisdom on leadership, wellness, and chasing dreams. He praised the youth for their concern about climate change, urging them to take action. Emphasizing resilience, mindfulness, and positivity, he encouraged students to shape a brighter future.