ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్-ఇండియా బిజినెస్ కోఆపరేషన్ కమిటీ ప్రతినిధివర్గం భేటీ
March 05th, 07:52 pm
జపాన్-ఇండియా బిజినెస్ కోఆపరేషన్ కమిటీ (జేఐబీసీసీ) చైర్మన్ శ్రీ తాత్సువో యాసునాగా నాయకత్వంలో ఆ కమిటీ సభ్యులు 17 మందితో కూడిన ప్రతినిధివర్గం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమైంది. ఈ ప్రతినిధివర్గంలో తయారీ, బ్యాంకింగ్, విమానసంస్థలు, ఔషధ రంగం, ప్లాంట్ ఇంజినీరింగ్‌లతోపాటు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) వంటి ముఖ్య రంగాలకు చెందిన కీలక జపాన్ కంపెనీల సీనియర్ నేతలు ఉన్నారు.శ్రీ తాత్సువో యాసునాగా నాయకత్వంలోని జపాన్ వాణిజ్య ప్రతినిధివర్గంతో ప్రధానమంత్రి భేటీ
March 05th, 07:47 pm
శ్రీ తాత్సువో యాసునాగా నాయకత్వంలోని జపాన్ వాణిజ్య ప్రతినిధివర్గంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. భారతదేశంలో వారి విస్తరణ ప్రణాళికలను, ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ విషయంలో దృఢ నిబద్ధతను తెలుసుకొని తనలో ఉత్సాహం కలిగిందని ఆయన అన్నారు.