రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 23rd, 11:15 am

దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్‌ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.

రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 23rd, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 19వ రోజ్‌గార్ మేళా (ఉగ్యోగ మేళా)లో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ప్రభుత్వ సేవలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలుకుతూ.. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలతో సహా పలు రంగాల్లో దేశ అభివృద్ధికి వారు అందించబోయే కీలక సహకారాన్ని ప్రస్తావించారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో వికసిత్‌ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

భారత ప్రధానమంత్రి నెదర్లాండ్స్‌ పర్యటన సందర్భంగా రెండు దేశాల సంయుక్త ప్రకటన

May 17th, 03:45 am

నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రాబ్‌ జెటెన్‌ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16-17 తేదీలలో ఆ దేశంలో పర్యటించారు. శ్రీ మోదీ నెదర్లాండ్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి.

సెమీకండక్టర్ల తయారీకి సంబంధించిన ఒప్పందంపై ప్రధానమంత్రి మోదీ సమక్షంలో సంతకాలు చేసిన ఏఎస్ఎంఎల్, టాటా ఎలక్ట్రానిక్స్

May 16th, 10:30 pm

గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్ఎంఎల్‌లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్‌ సమక్షంలో సంతకాలు చేశాయి.

డచ్ ‘సీఈవో’లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం

May 16th, 10:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెదర్లాండ్స్‌ పర్యటనలో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్‌ జెట్టెన్‌తో సంయుక్తంగా ఆ దేశంలోని వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సీఈవో)తో సమావేశమయ్యారు. ఇంధనం, ఓడరేవులు, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పలు రంగాల్లోని ప్రసిద్ధ కంపెనీల ‘సీఈవో’లతో అనేక అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్లు, సాంకేతికత-ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, రవాణా, సముద్ర రంగం, సుస్థిరత, ఇంధనం, వ్యవసాయ రంగాలపై తమ ఆలోచనలను పంచుకుంటూ, భారత్‌కు సంబంధించి తమ వ్యాపార వ్యూహాలను వివరించారు.