బంగ్లాదేశ్ ఎన్నికల విజయంపై తారిఖ్ రహ్మాన్‌కు అభినందనలు తెలియజేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
February 13th, 04:40 pm
బంగ్లాదేశ్ ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయంపై తారిఖ్ రహ్మాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఆయనతో ప్రధాని ఇవాళ ఫోన్‌లో మాట్లాడారు.బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో ‘బిఎన్‌పి’ విజయంపై శ్రీ తారిఖ్ రెహమాన్‌కు ప్రధానమంత్రి అభినందన
February 13th, 12:13 pm
బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో ‘బిఎన్‌పి’ని అఖండ విజయం వైపు నడిపించారంటూ ఆ పార్టీ నాయకుడు శ్రీ తారిఖ్ రెహమాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్‌కు సదా భారత్ మద్దతు కొనసాగుతుందని శ్రీ మోదీ అన్నారు. “మన బహుముఖ సంబంధాల బలోపేతం, ఉమ్మడి ప్రగతి లక్ష్యాల సాధనలో మీతో సంయుక్తంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని ఆయన పేర్కొన్నారు.