అస్సాంలోని కోక్రాఝర్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
March 13th, 03:00 pm
వాతావరణం అనుకూలించని కారణంగా నేను కోక్రాఝర్ రాలేకపోయాను. మీ అందరికీ నా క్షమాపణలు. గువాహటి నుంచి మాత్రమే మీతో మాట్లాడటానికి సాధ్యమవుతోంది. మీ వద్దకు రావడానికి నేను ఢిల్లీ నుంచి బయలుదేరాను. కానీ గువాహటిలో దిగాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచే మిమ్మల్ని చూస్తున్నాను. మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ నాతో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి, సోదరుడు హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, బోడోల్యాండ్ ప్రాంత కౌన్సిల్ ప్రధాన కార్యనిర్వాహక సభ్యుడు హగ్రామా మోహిలారీ, అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీటీసీ ప్రతినిధులందరూ, సొసైటీలోని సీనియర్ సభ్యులు, నా ప్రియమైన సోదరీసోదరులారా!అస్సాంలోని కోక్రాఝర్‌లో రూ. 4,750 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
March 13th, 02:30 pm
అస్సాంలోని కోక్రాఝర్‌లో వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తాను స్వయంగా కోక్రాఝర్‌కు రాలేకపోయానన్న ఆయన.. పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన ప్రజలు పెద్దమనసుతో తనను మన్నించాలని కోరారు. గువహటి నుంచి తాను ప్రసంగిస్తున్నానని ప్రధానమంత్రి చెప్పారు. ఇక్కడి భూమి పుత్రులైన బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ, రూపనాథ్ బ్రహ్మ వంటి మహనీయులను స్మరిస్తూ, వారికి నివాళి అర్పించారు. ఇక్కడికి తరలివచ్చిన అశేష జనవాహిని తన బాధ్యతను మరింత పెంచిందని.. అంకితభావంతో కూడిన సేవ, ఈ ప్రాంత అభివృద్ధి ద్వారా ఆ రుణం తీర్చుకుంటానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘‘మీకే సేవలందించడం ద్వారా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకునేందుకు నేనెప్పుడూ కృషి చేస్తాను’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.గువహటిలో సంప్రదాయ బోడో సాంస్కృతిక కార్యక్రమం ‘బకురుంబా దహోవ్’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 17th, 06:30 pm
అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, శాసనసభ స్పీకర్ శ్రీ బిశ్వజిత్ దైమరీ, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ పబిత్రా మార్గిరిటా, బోడోలాండ్ ప్రాదేశిక పాలన మండలి ముఖ్య కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ హగ్రామా మోహిలరి, రాష్ట్ర మంత్రులు, అస్సాంలోని నా విశిష్ట సోదరీసోదరులారా!అస్సాంలోని గౌహతిలో జరిగిన బగురుంబా ధహోవ్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
January 17th, 06:00 pm
గౌహతిలోని సరుసజాయ్ స్టేడియంలో నిర్వహించిన బోడో చారిత్రాత్మక సాంస్కృతిక కార్యక్రమం 'బగురుంబా ధహోవ్ 2026'ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అస్సాం సంస్కృతి చూడటం, బోడో సామాజిక వర్గ సంప్రదాయాలను నిశితంగా గమనించడం తన అదృష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. మరే ఇతర ప్రధానమంత్రి అస్సాంను తాను సందర్శించినంత తరచుగా సందర్శించలేదన్న ఆయన.. అస్సాం కళలు - సంస్కృతికి పెద్ద వేదిక లభించాలని, భారీ వేడుకల ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నట్లు ప్రధానంగా చెప్పారు. ఈ దిశగా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపిన ఆయన.. భారీ స్థాయిలో జరిగిన బిహు వేడుకలు, ఝుమోయిర్ వినోందిని ప్రదర్శన, ఏడాదిన్నర కిందట ఢిల్లీలో జరిగిన భారీ బోడో మహోత్సవ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఉదహరించారు. అస్సాం కళలు, సంస్కృతి అందించే అనన్యమైన ఆనందాన్ని అనుభవించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోనని అన్నారు. బగురుంబా పండుగను నిర్వహించడంపై మరోసారి సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. దీనిని బోడో అస్తిత్వానికి నిదర్శనంగా, అస్సాం వారసత్వ ప్రతీకగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న అందరికీ ముఖ్యంగా కళాకారులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.Double engine BJP govt has given double benefits to Assam: PM Modi in Tamulpur
April 03rd, 11:01 am
Addressing his last rally in Assam’s Tamulpur ahead of last phase of assembly elections in the state, PM Modi said, “The 'Mahajhooth' of 'Mahajot' has been disclosed. On the basis of my political experience and audience love, I can say that people have decided to form NDA government in Assam. They can't bear those who insult Assam's identity and propagate violence.”PM Modi addresses public meeting at Tamulpur, Assam
April 03rd, 11:00 am
Addressing his last rally in Assam’s Tamulpur ahead of last phase of assembly elections in the state, PM Modi said, “The 'Mahajhooth' of 'Mahajot' has been disclosed. On the basis of my political experience and audience love, I can say that people have decided to form NDA government in Assam. They can't bear those who insult Assam's identity and propagate violence.”