మలేషియా ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని ప్రకటన
February 08th, 08:35 am
ముందుగా నాకు ఆత్మీయంగా స్వాగతం పలికిన నా ఆప్తమిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతేడాది ఆసియాన్ సదస్సు సందర్భంగా మలేషియాను సందర్శించలేకపోయాను. కానీ వీలైనంత తొందరలోనే మలేషియాకు వస్తానని నా ప్రియమిత్రుడికి అప్పట్లో మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం.. 2026లో నా తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియాలో ఉన్నాను.మలేషియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా విడుదల చేసిన భారత్, మలేషియా ఉమ్మడి ప్రకటన
February 08th, 08:30 am
మలేషియా ప్రధానమంత్రి శ్రీ దాతో సెరీ అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు మలేషియాలో అధికారిక పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత సంబంధాలపై ఆధారపడిన ఉన్న లోతైన స్నేహం, సుదీర్ఘ ప్రజల మధ్య బంధాలను తెలియజేసింది. భారత్-మలేషియా 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్ఠం చేయటం, విస్తరించడానికి ఇరు దేశాల నాయకులకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది.మలేషియాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని
February 07th, 03:59 pm
ముందుగా ఈ సామాజిక వేడుకలో పాల్గొన్న నా ప్రియ మిత్రుడు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం గారికి నా ధన్యవాదాలు. ఇప్పుడే చేసిన ప్రసంగంలో భారత్-మలేషియా స్నేహానికి ఉన్న విస్తృతి, భవిష్యత్తు సామర్థ్యం గురించి ఆయన చెప్పిన మంచి మాటలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
February 07th, 03:15 pm
మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఇవాళ జరిగిన సామాజిక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. అక్కడ లభించిన ఘన స్వాగతం మన ఉమ్మడి సంస్కృతిలోని అద్భుతమైన వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న తన ప్రియ మిత్రుడు, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం పలకడమే కాకుండా.. ఆయన కారులోనే ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ప్రత్యేక మర్యాదలు భారత్‌పై, ఇక్కడున్న ప్రజలపై ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని చాటుతున్నాయి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.శ్రీ డీ జ్ఞానసుందరం మృతికి ప్రధాని సంతాపం
January 26th, 09:48 pm
డీ జ్ఞానసుందరం మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 14th, 11:00 am
పొంగల్ ఈ రోజున నిజంగా ఓ అంతర్జాతీయ పర్వదినంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగాగల తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా దీన్ని అపరిమిత ఉత్సాహంతో నిర్వహించుకుంటారు. అటువంటి వారిలో నేనూ ఒకడిని. అందుకే, ఈ ప్రత్యేక పండుగ వేడుకల్లో మీ సంతోషంలో పాలుపంచుకోవడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. తమిళుల జీవనంలో పొంగల్ పంగుడ మధురానుభూతి. భూమాత, అన్నదాతలతోపాటు సూర్య భగవానునిపై మానవాళి కృతజ్ఞతకు ఈ పండగ ఓ ప్రతీక. ప్రకృతితో, కుటుంబంతో, సమాజంతో సామరస్యానికిగల ప్రాధాన్యాన్ని ఇది మనకు అవగతం చేస్తుంది. ఇదే సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లోనూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు వంటి పేర్లతో ఈ పర్వదినాన ప్రజలు సంబరాల్లో తలమునకలై ఉన్నారు. దేశవిదేశాల్లోని తమిళ సోదరీసోదరులందరికీ పొంగల్ సహా ఈ పండుగల వేళ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.న్యూఢిల్లీలో పొంగల్ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పొంగల్ ప్రపంచ పండుగలా మారింది: పీఎం
January 14th, 10:45 am
ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. తమిళంలో శుభాకాంక్షలు చెప్పిన శ్రీ మోదీ... “ఈ రోజు పొంగల్ ఒక ప్రపంచ పండుగలా మారింది” అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా ఉత్సాహంగా పొంగల్ని నిర్వహించుకుంటున్నారనీ, తానూ వారిలో ఒకడినని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేక పండుగను అందరితో కలిసి జరుపుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. తమిళుల జీవితంలో ఒక ఆహ్లాదకరమైన అనుభూతి లాంటిదనీ... ఇది రైతుల శ్రమకు, భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ అని శ్రీ మోదీ తెలిపారు. అదే సమయంలో ప్రకృతిలో, కుటుంబంలో, సమాజంలో సమతుల్యత దిశగా మనకు ఈ పండుగ మార్గనిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు, ఇతర పేర్లతో ఈ పండుగ చేసుకుంటున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. పొంగల్ పండుగ సందర్భంగా దేశవిదేశాల్లో ఉన్న తమిళ సోదరీ సోదరులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.'వికసిత భారత్' సంకల్పం తప్పక నెరవేరుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
December 28th, 11:30 am
ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ ప్రయోగశాలలు మరియు అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తనదైన ముద్ర వేసిందని అన్నారు. నవసంకల్పాలతో 2026లో ముందుకు సాగడానికి దేశం సిద్ధంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, క్విజ్ పోటీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 మరియు ఫిట్ ఇండియా ఉద్యమం వంటి యువత కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.2047లో అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం స్వావలంబన ద్వారానే సాగుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
July 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో – క్రీడలలోనైనా, శాస్త్రవిజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా – ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిన విషయాలివి. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భాన్ని దేశం యావత్తూ ఎంతో ఉత్సాహంగా గమనించింది. ఆయన భూమి పైకి తిరిగివచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెల్లుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. నాకు గుర్తుంది.... 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ అయిన తర్వాత దేశంలో శాస్త్రవిజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధన పట్ల ఒక కొత్త ఆసక్తి పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని ఇప్పుడు చిన్నారులు కూడా చెప్తున్నారు.శ్రీలంకలోని తమిళ సామాజిక నేతలతో ప్రధాని భేటీ
April 05th, 10:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కొలంబోలో శ్రీలంకలోని తమిళ సామాజిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళ నాయకులు ఆర్.సంపంతన్, మావై సేనతిరాజా మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారు.సుప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
December 11th, 02:00 pm
నేడు దేశం మహాకవి సుబ్రమణ్య భారతి జయంతిని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వారికి గౌరవ పూర్వక నివాళులర్పిస్తున్నాను. భారతీయ సంస్కృతీ సాహిత్యాలకి, దేశస్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలకు, తమిళుల గౌరవానికి ఇవి అపురూపమైన క్షణాలు! మహాకవి సుబ్రమణ్య భారతి రచనల ప్రచురణను అత్యున్నతస్థాయి సేవగా పరిగణిస్తున్నాను. పరిపూర్ణమైన గొప్ప ఆధ్యాత్మిక యత్నమిది. 21 సంపుటాల్లో తయారైన 'కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్' సంకలనం అసాధారణమైన, అపూర్వమైన విజయానికి ప్రతీక. ఎంతో స్థైర్యంతో చేపట్టిన ఆరు దశాబ్దాల అవిరామ కృషికి దక్కిన అద్భుత ఫలితం. అనితరసాధ్యమనిపించే ఈ సాఫల్యం శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషికీ, అంకితభావానికీ నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ఈ సంకలనం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒకే జీవితం, ఒక లక్ష్యం అన్న మాటని మనం తరచుగా వింటుంటాం కానీ శ్రీ శీని ఆ మాటను నిజం చేసి చూపారు. అపురూపమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఆయన శ్రమ, ధర్మశాస్త్ర చరిత్రను రాయడానికి 35 ఏళ్ల సమయాన్ని వెచ్చించిన మహామహోపాధ్యాయ పాండురంగ్ వామన్ కానే గారిని గుర్తుకు తెచ్చింది. శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషి విద్యారంగంలో నూతన ప్రమాణాలను పాదుకొల్పగలదని విశ్వసిస్తున్నాను. గొప్ప ఫలితాన్ని సాధించిన విశ్వనాథన్ గారికి, ఆయన బృందం సహా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 11th, 01:30 pm
తమిళ భాషా రంగంలో మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈరోజు ఆవిష్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారతదేశ సంస్కృతికి, సాహిత్యానికి, మన దేశ స్వాతంత్య్ర పోరాట స్మృతులకు, అంతేకాకుండా తమిళనాడు ఆత్మగౌరవానికి కూడా లభించిన ఒక మహదవకాశమన్నారు.శ్రీ సుబ్రహ్మణ్య భారతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి
December 11th, 10:27 am
కవి, రచయిత శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.డిసెంబర్ 11న సుప్రసిద్ధ తమిళ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వాన్ని విడుదల చేయనున్న ప్రధానమంత్రి
December 10th, 05:12 pm
సుబ్రహ్మణ్య భారతి రచనలు ప్రజల్లో దేశభక్తిని జాగృతం చేసి, సాధారణ ప్రజలకు సులభంగా అర్ధమయ్య భాషలో భారతీయ సంస్కృతి వైభవాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని వారికి పరిచయం చేశాయి. శీని విశ్వనాథన్ కూర్చి, సంపాదకత్వం వహించిన 23 సంపుటాల ‘భారతి’ సాహితీ సర్వసాన్ని అలయన్స్ పబ్లిషర్స్ ప్రచురించారు. ఈ ప్రచురణలో సుబ్రహ్మణ్య భారతి రచనల గురించిన వివరణలు, పత్రాలు, నేపథ్యం, తాత్వికపరమైన విశ్లేషణలు సహా సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయి.A part of our vision of Vasudhaiva Kutumbakam is putting our Neighborhood First: PM Modi
October 14th, 08:15 am
Addressing the launch of ferry services between Nagapattinam, India and Kankesanthurai, Sri Lanka PM Modi said that India and Sri Lanka share a deep history of culture, commerce and civilization. Nagapattinam and towns near-by have long been known for sea trade with many countries, including Sri Lanka.ఇండియాలోని నాగపట్నం నుంచి శ్రీలంకలోనికనకేసంతురై కి ఫెర్రీ సర్వీసును ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
October 14th, 08:05 am
-ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశంలోనినాగపట్టణం నుంచి శ్రీ లంకలోని కనకేసంతురై కి ఫెర్రీ సర్వీసు ప్రారంభోత్సవకార్యక్రమంలో వీడియో సందేశమిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇండియా,శ్రీలంకలు దౌత్య, ఆర్థిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడంలో , నాగపట్నం, కనకేసంతురైలమధ్య ఫెర్రీ సర్వీసు ప్రారంభం ఒక కీలకమైలురాయిగా నిలుస్తుందని అన్నారు.PM Modi and Sri Lankan President Ranil Wickremesinghe at joint press meet in Hyderabad House
July 21st, 12:13 pm
PM Modi and President Wickremesinghe held a joint Press Meet at the Hyderabad House in New Delhi. PM Modi emphasized on Sri Lanka’s prominent role in India’s ‘Neighbourhood First Policy’ and the ‘SAGAR Vision’. He also said that the development of India and Sri Lanka are interdependent and critical for sustainable growth.PM Modi interacts with the Indian community in Paris
July 13th, 11:05 pm
PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.గుజరాత్, తమిళనాడు మధ్య పురాతన బంధాన్ని గుర్తు చేసుకున్న సౌరాష్ట్ర తమిళ సంఘం: ప్రధానమంత్రి
March 19th, 08:49 pm
గుజరాత్, తమిళనాడు మధ్య పురాతన కాలం నుంచీ వస్తున్న అనుబంధాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ బంధాన్ని సౌరాష్ట్ర తమిళ సంగమం ఒక వేడుకలా జరుపుకుంటున్నదన్నారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ నినాదానికి ప్రతీక అని అభివర్ణించారు.చైతన్యభరితం అయినటువంటి తమిళ సంస్కృతిప్రపంచ స్థాయి లో లోకప్రియమైంది: ప్రధాన మంత్రి
February 13th, 09:21 am
సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇచ్చారు. ఎ.ఎమ్.కె, కెబున్ బారు మరియు వైసికె ల నివాసుల తో కలసి పొంగల్ పర్వదినాన్ని ఆలస్యం గా జరుపుకొన్నట్లు శ్రీ లీ సీన్ లూంగ్ తన ట్వీట్ లో తెలియ జేశారు.