ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి

February 19th, 09:36 am

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం

January 23rd, 11:30 am

నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యావత్ దేశం ఆయనను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటోంది. సుభాష్ బాబుకు వినమ్ర పూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఆయన జన్మస్థలంలో ఈ ఏడాది పరాక్రమ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశా ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. నేతాజీ జీవిత విశేషాలను వివరించేలా భారీ ప్రదర్శనను కూడా కటక్ లో ఏర్పాటు చేశారు. ఆయన జీవితంతో ముడిపడి ఉన్న అనేక వారసత్వ స్మారకాలను భద్రపరిచి ఈ ప్రదర్శనకు ఉంచారు. అనేకమంది చిత్రకారులు బోస్ జీవిత విశేషాలకు కాన్వాస్ పై చిత్రరూపమిచ్చారు. వీటన్నింటితో పాటు సుభాష్ బాబుకు సంబంధించిన అనేక పుస్తకాలను కూడా సేకరించారు. నేతాజీ ఈ ఘనమైన జీవిత ప్రస్థానం నా యువ భారతానికీ, నా భారతదేశానికి కొత్త శక్తిని అందిస్తాయి.

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం

January 23rd, 11:25 am

పరాక్రమ దివస్‌గా నిర్వహిస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో ఆయన్ను యావత్ దేశం సగౌరవంగా స్మరించుకుంటోందని అన్నారు. నేతాజీ సుభాష్ బోస్‌కు నివాళులు అర్పిస్తూ, ఈ ఏడాది పరాక్రమ దివస్ ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన ఒడిశాలో ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నేతాజీ జీవితం ఆధారంగా ఒడిశాలోని కటక్‌లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఎంతో మంది చిత్రకారులు నేతాజీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను కాన్వాస్‌పై చిత్రించారని అన్నారు. అలాగే నేతాజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలను సైతం సేకరించినట్లు ఆయన తెలిపారు. నేతాజీ జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన ఈ పరిణామాలు మేరీ యువ భారత్ లేదా మై భారత్‌కు కొత్త శక్తిని ఇస్తాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

IPS Probationers interact with PM Modi

July 31st, 11:02 am

PM Narendra Modi had a lively interaction with the Probationers of Indian Police Service. The interaction with the Officer Trainees had a spontaneous air and the Prime Minister went beyond the official aspects of the Service to discuss the aspirations and dreams of the new generation of police officers.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ ప్రొబేషనర్ల తో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

July 31st, 11:01 am

మీ అందరితో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. మీ ఆలోచనల గురించి తెలుసుకోవడానికి నేను ప్రతి సంవత్సరం మీలాంటి యువ స్నేహితులతో సంభాషించే ప్రయత్నం చేస్తున్నాను. మీ మాటలు, ప్రశ్నలు మరియు జిజ్ఞాస భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి నాకు కూడా సహాయపడతాయి.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ

July 31st, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘ఐపీఎస్’ ప్రొబేషనర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రోబేషనర్లతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.

ప్రజలలో ఉండటం నాకు చాలా బలం ఇస్తుంది: ప్రధాని నరేంద్ర మోదీ

July 03rd, 12:41 pm

ఇటీవలి ముఖాముఖిలో, ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, మా ప్రభుత్వం అభివృద్ధి మరియు సుపరిపాలనపై దృష్టిపెట్టింది. ఆర్థిక, భద్రత, సామాజిక న్యాయం, విదేశాంగ విధానం వంటి వివిధ పారామితులపై ప్రభుత్వం బాగా పనిచేసింది.

మేము రాజకీయాల కంటే భారతదేశానికే ప్రాధాన్యత నిస్తున్నాము: ప్రధాని నరేంద్ర మోదీ

July 01st, 10:15 am

ఒక ఇంటర్వ్యూలో, ప్రధాని మోదీ మాట్లాడుతూ, విమర్శకులు పేర్కొన్నట్లుగా జిఎస్టి క్లిష్టమైన విధానం కాదన్నారు. దాదాపు 400 సమూహాల వస్తువులపై ప్రభుత్వం పన్నులు తగ్గించిందని ఆయన తెలిపారు. వాటిలో సుమారు 150 గ్రూపులు సున్నా శాతం పన్ను రేటును కలిగి ఉన్నాయి.