శ్రీ స్వరాజ్ కౌశల్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

December 04th, 06:00 pm

శ్రీ స్వరాజ్ కౌశల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. న్యాయవాదిగా, న్యాయ వృత్తిని ఉపయోగించి అణగారిన వర్గాల జీవితాలను మెరుగుపరచాలని నమ్మిన వ్యక్తిగా ఆయన ప్రత్యేకతను చాటుకున్నారని ప్రధాని అన్నారు. “భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైన గవర్నర్ ఆయన. గవర్నరుగా పదవీకాలంలో మిజోరాం ప్రజలపై ఆయన చెరగని ముద్ర వేశారు. పార్లమెంటేరియన్‌గా ఆయన చెప్పిన విషయాలు కూడా గమనార్హం అని వ్యాఖ్యానించారు.