శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 28th, 03:35 pm
ఈ రోజు ఈ పవిత్ర సందర్భంలో నా మనసు శాంతితో నిండిపోయింది. సాధువులు, మహర్షుల సమక్షంలో కూర్చోవడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం శతాబ్దాల నాటి ఈ మఠం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేడుకలో మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి రాకముందు, రామాలయం... వీర్ విఠల్ ఆలయాల్లో పూజలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇక్కడి శాంతి, ప్రశాంత వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచాయి.గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
November 28th, 03:30 pm
“శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోంది. ఇది చాలా చారిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొంది. తరాలు మారినా, కాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదు. దీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారింది. మఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే సాధనను సేవతో, సంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు. కష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కమిటీలోని సభ్యులందరూ, ఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.అనువాదం: కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠంలో ‘లక్ష కంఠాల గీతా పారాయణం’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 28th, 11:45 am
నేను మొదలుపెట్టే ముందు.. కొంతమంది పిల్లలు తమ బొమ్మలను ఇక్కడికి తీసుకువచ్చారు. దయచేసి ఎస్పీజీ, స్థానిక పోలీసులు వాటిని తీసుకునే విషయంలో సహాయం చేయండి. మీరు వెనుక వైపున మీ చిరునామా రాస్తే నేను ఖచ్చితంగా మీకు ఒక ధన్యవాద లేఖ పంపుతాను. ఎవరి దగ్గర ఏమున్నా దయచేసి వారికి ఇవ్వండి. వారు వాటిని తీసుకుంటారు. మీరు కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఈ పిల్లలు ఎంత కష్టపడి పనిచేస్తారు. కొన్నిసార్లు వీటిని నేను గుర్తించక పోతే అది నాకు బాధ కలిగిస్తుంది.కర్ణాటకలోని ఉడుపిలో లక్ష కంఠ గీతా పారాయణ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 28th, 11:30 am
మూడు రోజుల క్రితం తాను గీతా భూమి అయిన కురుక్షేత్రంలో ఉన్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేశారు. నేడు శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు పొందిన, జగద్గురు శ్రీ మధ్వాచార్య గారి మహిమతో పావనమైన ఈ భూమికి రావడం తనకు అత్యంత సంతృప్తినిచ్చే విషయమని అన్నారు. ఈ సందర్భంలో లక్ష మంది ప్రజలు కలిసి చేసిన భగవద్గీతనవ రాయపూర్ లో బ్రహ్మకుమారీల ధ్యాన కేంద్రం - శాంతి శిఖర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 01st, 11:15 am
ఛత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ రామన్ డేకా, ప్రజాదరణ పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి, రాజయోగిని సిస్టర్ జయంతి, రాజయోగి మృతుంజయ్, సోదరి బ్రహ్మకుమారీలు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, ప్రముఖులారా!ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో 'శాంతిశిఖర్'- ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవంలో బ్రహ్మకుమారీలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 01st, 11:00 am
ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో ఆధునిక ఆధ్యాత్మిక జ్ఞాన, శాంతి-ధ్యాన కేంద్రం “శాంతిశిఖర్”ను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్రహ్మకుమారీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 25 సంవత్సరాలు పూర్తయినందున ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ఇదే రోజున తమ 25వ అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాయని గుర్తుచేశారు. అంతేకాకుండా ఇదే రోజున ఆవిర్భవించిన దేశంలోని పలు రాష్ట్రాలు వేడుకలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్రాల ప్రగతి దేశ పురోగమనాన్ని వేగిరం చేస్తుందన్న మార్గదర్శక సూత్రం ప్రాతిపదికగా వికసిత భారత్ లక్ష్య సాధనకు మేం చురుగ్గా కృషి చేస్తున్నాం” అని ప్రధానమంత్రి స్పష్టీకరించారు.అనువాదం: గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో నిర్వహించిన ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 20th, 11:00 am
భావ్‌నగర్‌లో ఒక ఉత్తేజకరమైన వాతావరణం కనిపిస్తోంది. వేదిక ముందున్న జన సంద్రం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద జనసమూహం నాకు ఆశీస్సులు ఇచ్చేందుకు వచ్చింది. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 20th, 10:30 am
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రూ. 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. 'సముద్ర సే సమృద్ధి' కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు. ఈ నెల 17న తనకు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు గొప్ప బలమన్నారు. దేశంలో విశ్వకర్మ జయంతి నుంచి గాంధీ జయంతి వరకు అంటే ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. గత 2-3 రోజుల్లో గుజరాత్‌లో అనేక సేవా కార్యక్రమాలు.. వందలాది ప్రదేశాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారన్నారు. ఇప్పటివరకు ఒక లక్ష మంది రక్తదానం చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు. అనేక నగరాల్లో నిర్వహించిన పరిశుభ్రతా కార్యక్రమాల్లో లక్షలాది మంది పౌరులు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30,000 కి పైగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామనీ, ప్రజలకు.. ముఖ్యంగా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 25th, 06:42 pm
ఈ రోజు మీరంతా నిజంగా ఓ అద్భుత వాతావరణాన్ని సృష్టించారు. నేను చాలాసార్లు అనుకుంటాను.. ఈ లక్షలాది ప్రజల ప్రేమాశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని! నేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చూడండీ.. ఓ చిన్న నరేంద్ర అక్కడ నిలబడి ఉన్నాడు!గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసి వాటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
August 25th, 06:15 pm
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. యావత్ దేశం ప్రస్తుతం గణేష్ ఉత్సవాల ఉత్సాహంలో మునిగిపోయిందన్నారు. గణపతి బప్పా ఆశీస్సులతో గుజరాత్ పురోగతికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శుభప్రదమైన ప్రారంభం జరిగిందని వ్యాఖ్యానించారు. పలు ప్రాజెక్టులను ప్రజల పాదాలకు అంకితం చేసే అవకాశం తనకు లభించిందన్న ప్రధానమంత్రి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
August 17th, 12:45 pm
కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 17th, 12:39 pm
ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.న్యూఢిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన ఫ్లాట్ల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 11th, 11:00 am
శ్రీ ఓం బిర్లా గారూ, మనోహర్ లాల్ గారూ, కిరణ్ రిజిజు గారూ, మహేశ్ శర్మ గారూ, గౌరవ పార్లమెంటు సభ్యులూ, లోక్‌సభ ప్రధాన కార్యదర్శి గారూ, సోదరీ సోదరులారా!పార్లమెంటు సభ్యుల కోసం న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన నివాస సముదాయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 11th, 10:30 am
పార్లమెంట్ సభ్యుల కోసం న్యూఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో టైప్-7 బహుళ అంతస్థుల్లో కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఇటీవలే కర్తవ్య భవన్‌గా పిలిచే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌ను కర్తవ్య పథ్‌లో ప్రారంభించానని, అలాగే పార్లమెంట్ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించే అవకాశం తనకు లభించిందని అన్నారు. కాంప్లెక్సులోని నాలుగు టవర్లకు నాలుగు విశిష్ట నదులు - కృష్ణా, గోదావరి, కోసి, హుగ్లీ పేర్లు పెట్టినట్లు తెలిపారు. లక్షలాది మందికి జీవితాన్నిచ్చే ఈ నదులు, ఇప్పుడు ప్రజా ప్రతినిధుల జీవితాల్లోకి కొత్త ఆనందాల ప్రవాహానికి స్ఫూర్తిని ఇస్తాయని తెలిపారు. నదుల పేర్లు పెట్టే ఈ సంస్కృతి ఏకత్వమనే దారంతో దేశాన్ని కలిపి ఉంచుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుల జీవన సౌలభ్యాన్ని ఈ కొత్త కాంప్లెక్స్ పెంచుతుందని, అలాగే ఎంపీలకు ఢిల్లీలో ప్రభుత్వం నివాసాలను పొందడం ఇప్పుడు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫ్లాట్ల నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజినీర్లు, శ్రామికులను ప్రశంసించారు. వీటిని పూర్తి చేయడంలో వారు కనబరిచిన అంకితభావాన్ని, చేసిన కృషిని మెచ్చుకున్నారు.2047లో అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం స్వావలంబన ద్వారానే సాగుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
July 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో – క్రీడలలోనైనా, శాస్త్రవిజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా – ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిన విషయాలివి. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భాన్ని దేశం యావత్తూ ఎంతో ఉత్సాహంగా గమనించింది. ఆయన భూమి పైకి తిరిగివచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెల్లుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. నాకు గుర్తుంది.... 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ అయిన తర్వాత దేశంలో శాస్త్రవిజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధన పట్ల ఒక కొత్త ఆసక్తి పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని ఇప్పుడు చిన్నారులు కూడా చెప్తున్నారు.29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్‌లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి వేడుక సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:15 am
పరమ శ్రాద్ధేయ ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ మహరాజ్, శ్రావణబెళగొళ స్వామి శ్రీ చారుకీర్తి, మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ శ్రీ నవీన్ జైన్, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ప్రియాంక్ జైన్, కార్యదర్శి శ్రీ మమతా జైన్, ట్రస్టీ పీయూష్ జైన్, ఇతర విశిష్ట ప్రముఖులు, గౌరవనీయ సాధువులు, సోదరీసోదరులారా... జై జినేంద్ర!ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహరాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:01 am
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు జరిగిన ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక చిరస్మరణీయమైన సందర్భాన్ని నేడు మనమంతా చూస్తున్నాం.. ఇది ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతాబ్ది ఉత్సవాల పవిత్రతను స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. పూజ్య ఆచార్య అమర స్ఫూర్తితో నిండిన ఈ కార్యక్రమం అపూర్వమైన స్ఫూర్తిదాయక వాతావరణాన్ని కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం దక్కడం తనకూ సంతోషం కలిగించిందన్నారు.శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ చర్చల శతాబ్ది కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
June 24th, 11:30 am
బ్రహ్మర్షి స్వామి సచ్చిదానంద గారు, శ్రీమఠం స్వామి శుభాంగ నందా గారు, స్వామి శారదానంద గారు, గౌరవనీయులైన సాధువులందరూ, ప్రభుత్వంలో నా సహచరులు శ్రీ జార్జ్ కురియన్ గారు, పార్లమెంట్‌లో నా సహచరులు శ్రీ అదూర్ ప్రకాష్ గారు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు, గౌరవనీయులైన పెద్దలందరూ,శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ మధ్య చారిత్రక చర్చ జరిగి శతాబ్ది అవుతోన్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
June 24th, 11:00 am
గొప్ప ఆధ్యాత్మిక, నైతిక విలువలు కలిగిన మహానుభావులు శ్రీ నారాయణ గురు.. మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రక చర్చకు శతాబ్ధి అవుతోన్న సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన దేశ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టానికి ఈ వేదిక సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. మన స్వాతంత్రోద్యమానికి ఈ ఇద్దరు మహానుభావుల మధ్య జరిగిన చారిత్రక చర్చ కొత్త దిశానిర్దేశం చేసిందని.. స్వాతంత్య్ర లక్ష్యాలకు, స్వతంత్ర భారత్ కలకు నిర్దిష్ట అర్థాన్నించిందని పేర్కొన్నారు. “100 సంవత్సరాల క్రితం జరిగిన శ్రీ నారాయణ గురు- మహాత్మాగాంధీల సమావేశం నేటికీ స్ఫూర్తిదాయకంగా, సందర్భోచితంగా ఉంది. సామాజిక సామరస్యం, అభివృద్ధి చెందిన భారత్ విషయంలో సమష్టి లక్ష్యాల కోసం ఉత్తేజానిచ్చే వనరుగా పనిచేస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాక శతాబ్ధి సందర్భంగా శ్రీ నారాయణ గురు పాదాలకు నమస్కరించిన ప్రధాని.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.