ఎఫ్‌ఏఓ అగ్రికోలా పతకం అందుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 20th, 11:00 pm

ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. భారత్‌లోని కోట్లాది మంది రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, శ్రామికులకు దక్కిన గౌరవం. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారత్‌కున్న అచంచలమైన నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇది. ఎంతో గౌరవంగా ఈ పతకాన్ని స్వీకరిస్తూ.. భారతదేశ అన్నదాతలకు అంకితమిస్తున్నా.

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నుంచి అగ్రికోలా పతకాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి

May 20th, 10:55 pm

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి 2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక అగ్రికోలా పతకాన్ని ప్రదానం చేశారు. భారత్‌తో పాటు ప్రపంచస్థాయిలోనూ ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాల పరిష్కారానికి ఆయన ప్రదర్శించిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు.

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల సంరక్షణపై నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధాని

March 22nd, 09:05 am

ప్రతి నీటిబొట్టునూ కాపాడుకోవడానికీ, అమూల్యమైన జల వనరును అత్యంత బాధ్యతాయుతంగా వినియోగించుకోవడానికీ ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

నికర సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం దిశగా జరిగిన సుస్థిర పురోగతిని ప్రశంసించిన ప్రధానమంత్రి

August 03rd, 04:01 pm

నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించాలన్న భారత్‌ దార్శనికత దిశగా జరిగిన సుస్థిర పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

వన్యమృగాల సంరక్షణలో ఎప్పటికీ అగ్రగామిగా భారత్: ప్రధానమంత్రి

March 09th, 12:10 pm

భారత్‌లో వన్యప్రాణి వైవిధ్యం సమృద్ధిగా ఉందని, ఇక్కడి సంస్కృతి వన్యమృగాలను గౌరవిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మనం మన వన్యప్రాణులను పరిరక్షించుకోవడంతోపాటు భూగ్రహం చాలా కాలం పాటు మనుగడలో ఉండేటట్లు మన వంతు తోడ్పాటును అందించడంలో అన్ని దేశాల కన్నా ముందు నిలుద్దాం’’ అని శ్రీ మోదీ అన్నారు.