జూన్ 2న న్యూఢిల్లీలో అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) 81వ వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొననున్న ప్రధాని

June 01st, 08:01 pm

అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) 81వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎమ్) సోమవారం (జూన్ 2న) సాయంత్రం సుమారు 5 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్నారు. ప్రపంచ శ్రేణి వైమానిక మౌలిక సదుపాయాల కల్పనను అభివృద్ధి చేయడంతో పాటు అనుసంధానాన్ని పెంచాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఏజీఎమ్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.