గుజరాత్‌లో సూరత్‌ ఆహార భద్రతా సంతృప్త ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 07th, 05:34 pm

పేరెన్నికగన్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయి పటేల్ గారు, కేంద్ర క్యాబినెట్ లో నా సహచరుడు శ్రీ సి.ఆర్. పాటిల్ గారూ, గుజరాత్ రాష్ట్ర మంత్రులు, ఇక్కడ హాజరైన ప్రజలు, సూరత్ లోని నా సోదరసోదరీమణులారా!

సూరత్‌ సంతృప్త ఆహార భద్రత ప్రచార కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం

March 07th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సూరత్‌లోని లింబాయత్‌లో ‘సూరత్ సంతృప్త ఆహార భద్రత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో అర్హులైన 2.3 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు సహా వివిధ వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- నిరంతర కృషి, దాతృత్వ స్ఫూర్తి బలమైన పునాదిగాగల సూరత్ నగరం విశిష్టతను ప్రధాని కొనియాడారు. సమష్టి మద్దతు, సర్వజన ప్రగతికి నిర్వచనంగా రూపొందిన నగరం స్వభావాన్ని విస్మరించజాలమని వ్యాఖ్యానించారు.

మార్చి 7, 8 లలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్‌తో పాటు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

March 07th, 07:10 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 7, 8 లలో కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్ తోపాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఆయన మార్చి 7వ తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల వేళ సిల్‌వాసాకు చేరుకొని నమో ఆసుపత్రి ఒకటో దశ (NAMO Hospital)ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటల 45 నిమిషాలకు, సిల్‌వాసాలో కేంద్రపాలిత ప్రాంతానికి ఉద్దేశించిన రూ. 2580 కోట్లకు పైగా ఖర్చయ్యే వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. దీని తరువాత ఆయన సూరత్‌కు వెళ్తారు. ఆయన సాయంత్రం సుమారు 5 గంటలకు సూరత్ ఆహార భద్రత విస్తృత ప్రచార ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. మార్చి 8న ప్రధాని నవ్‌సారీకి వెళ్తారు. ఉదయం దాదాపు 11 గంటల 30 నిమిషాలకు లఖ్‌పతి దీదీలతో (లక్షాధికారి సోదరీమణులు) భేటీ అయ్యి వారితో మాట్లాడతారు. తరువాత ఒక సార్వజనిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ పథకాలను ప్రారంభించనున్నారు.