ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒమన్ పర్యటన సందర్భంగా భారత్ - ఒమన్ దేశాల సంయుక్త ప్రకటన

December 18th, 05:28 pm

ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 17,18 తేదీల్లో ఒమన్ లో అధికారికంగా పర్యటించారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఒమన్ ఉప ప్రధానమంత్రి (రక్షణ వ్యవహారాలు) సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. డిసెంబర్ 18, 2025న అల్ బరాకా ప్యాలెస్‌లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రధానికి స్వాగతం పలికారు.

ఒమన్ సుల్తాన్ తో ప్రధానమంత్రి సమావేశం

December 18th, 05:22 pm

ఒమన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మస్కట్‌లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రాయల్ ప్యాలెస్‌ వద్ద ప్రధానమంత్రికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సాదర స్వాగతం పలికారు. అధికార లాంఛనాలతో కూడిన ఘనమైన స్వాగత కార్యక్రమం నిర్వహించారు.

భారత ప్రధానికి ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారం

December 18th, 05:22 pm

భారత్ - ఒమన్ సంబంధాల బలోపేతం కోసం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన విశేష కృషి, ఆయన దార్శనిక నాయకత్వానికి గుర్తింపుగా.. గౌరవ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆయనకు ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారాన్ని అందించారు.

జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌లలో ప్రధాని పర్యటన

December 11th, 08:43 pm

మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు.. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబరు 15 – 16 తేదీల్లో హషేమైట్ రాజ్యమైన జోర్డాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా గౌరవ మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్‌తో భారత ప్రధానమంత్రి సమావేశమై.. భారత్, జోర్డాన్ మధ్య సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించడంతోపాటు పలు ప్రాంతీయ అంశాలపైనా చర్చిస్తారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతోంది. భారత్ - జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పర వృద్ధి, సంక్షేమం కోసం సహకారానికి కొత్త మార్గాల అన్వేషణకు, అలాగే.. ప్రాంతీయ శాంతి, సమృద్ధి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో అంకితభావాన్ని పునరుద్ఘాటించేందుకు ఇదో మంచి అవకాశం.

Greetings continue to pour in for PM Modi from world leaders

June 11th, 05:47 pm

The Prime Minister, Shri Narendra Modi thanked the world leaders for their congratulatory messages after assuming office as the Prime Minister of India for the third time. Shri Modi replied to the messages and telephone calls by world leaders on the social media platform ‘X’.

ఓమాన్ యొక్క సుల్‌ తాన్ నుండి టెలిఫోన్ మాధ్యం ద్వారాఅభినందనల ను స్వీకరించిన ప్రధాన మంత్రి

June 11th, 01:50 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఓమాన్ యొక్క సుల్ తాన్ శ్రీ హైథమ్ బిన్ తారిక్ టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు.

ఒమన్ సుల్తాన్‌తో ప్రధానమంత్రి సమావేశం

December 16th, 09:29 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఒమ‌న్ సుల్తాన్ గౌరవనీయ హైతం బిన్ తారిక్‌తో స‌మావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల‌పై దేశాధినేతలిద్దరూ స‌మీక్షించారు.

ఒమన్ సుల్తాన్ తో జరిగిన ప్రతినిధివర్గం స్థాయి చర్చల సమయంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం (16 డిసెంబరు 2023)

December 16th, 07:02 pm

మీ అందరినీ భారతదేశానికి ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది.

ఓమన్ సుల్తాన్ మాన్య‌ శ్రీ సుల్తాన్‌ హైథ‌మ్ బిన్ తారిక్ తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

February 17th, 09:43 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బుధ‌వారం నాడు, అంటే ఈ నెల 17న, ఓమన్ సుల్తాన్ మాన్య‌ శ్రీ సుల్తాన్‌ హైథ‌మ్ బిన్ తారిక్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.