2026-27 సీజన్‌ కోసం చెరకు రైతులకు క్వింటాల్‌కు రూ.365 'న్యాయమైన, లాభదాయకమైన ధర'కు మంత్రివర్గం ఆమోదం

May 05th, 06:43 pm

చెరకు రైతుల (గన్నా కిసాన్) ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, 2026-27 చక్కెర సీజన్‌ (అక్టోబర్ - సెప్టెంబర్) కోసం 10.25 శాతం ప్రాథమిక రికవరీ గల చెరకు పంటకు క్వింటాల్‌కు రూ. 365 'న్యాయమైన, లాభదాయకమైన ధర' (ఎఫ్ఆర్‌పీ)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 10.25 శాతం కంటే ఎక్కువ రికవరీలో వచ్చే ప్రతి 0.1 శాతం పెరుగుదలకు క్వింటాల్‌కు రూ. 3.56 చొప్పున అదనపు ప్రోత్సాహకాన్ని (ప్రీమియం) అందించాలని, రికవరీలో వచ్చే ప్రతి 0.1 శాతం తగ్గుదలకు ఎఫ్ఆర్‌పీని క్వింటాల్‌కు రూ. 3.56 చొప్పున తొలగించాలని నిర్ణయించారు.