Prime Minister shares Sanskrit Subhashitam emphasizing that continuous effort is the true key to success

July 02nd, 04:24 pm

PM Modi shared a Sanskrit Subhashitam, saying that continuous effort is the true key to success. He emphasized that those who move forward with patience, determination and self-confidence are the ones who achieve their goals.

Prime Minister shares Sanskrit Subhashitam emphasizing on discipline and control over mind to achieve ultimate goal

July 01st, 12:13 pm

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam:

Prime Minister shares Sanskrit Subhashitam emphasizing on unity to achieve every goal

June 30th, 11:00 am

PM Modi shared a Sanskrit Subhashitam highlighting that unity in thoughts, resolve and purpose is the foundation of every success. He urged everyone to move forward together with a shared vision to achieve the goals of Bharat.

ప్రపంచంలోని వివిధ సంస్కృతులను గౌరవించాలని స్పష్టం చేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 29th, 10:43 am

‘‘దేశాచారాన్ సమయాజ్జాతిధర్మాన్ బుభూషతే యస్తు పరావరజ్ఞః స తత్ర తత్రాధిగతః సదైవ్ మహాజనస్యాధిపత్యం కరోతి’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

ఐక్యత, పరస్పర సామరస్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 26th, 12:33 pm

ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ఐక్యత, పరస్పర సామరస్యంతో కలిసి పనిచేయాలనే సందేశాన్ని తెలిపే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.

అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారికి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

June 25th, 10:53 am

అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామిక విలువలను రక్షించిన వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశ చరిత్రలో అత్యంత నిరాశామయ అధ్యాయాలలో ఎమర్జెన్సీ ఒకటి అని ఆయన అన్నారు. ఆ సమయం... మౌనంగా ఉండిపోకుండా, రాజ్యాంగంలోని ఆదర్శాలను నిలబెట్టిన అసంఖ్యాక పౌరుల అసాధారణ ధైర్య, సాహసాలను, ధీరత్వాన్ని చాటిందని కూడా ఆయన అన్నారు.

ఉమ్మడి ఉత్సాహంతో చేసే పనులు దేశ ప్రగతికి తోడ్పడతాయని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 24th, 03:34 pm

అందరి అంకిత భావంతో, కృషితో దేశ ప్రగతి దృఢతరంగా మారుతుందని స్పష్టం చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. సమాజంలో కొత్త శక్తిని నింపి, అభివృద్ధికి సంబంధించిన సంకల్పాల్ని నెరవేర్చుకోవడానికి బాట వేసేది ఈ భావనేనని ఆయన అన్నారు.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి... సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

June 23rd, 03:39 pm

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశ నిర్మాణానికి డాక్టర్ ముఖర్జీ అందించిన అపార సేవలను ప్రధాని స్మరించుకున్నారు.

యోగాకున్న పరివర్తనాత్మక శక్తిని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 22nd, 08:13 am

యోగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి సాయపడమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో సానుకూల జీవితాలను గడపడానికి కూడా స్ఫూర్తిని కలిగిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం అసాధారణ విజయాన్ని సాధించడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.

జ్ఞానం, వివేకం, దూరదృష్టిల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 19th, 08:15 am

జ్ఞానం, వివేకం, దూరదృష్టి.. ఈ గుణాలు మనిషి జీవితంలో విజయానికి మూలస్తంభాలని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ గుణాలను అలవరుచుకున్న వ్యక్తులు అత్యంత కఠిన సవాళ్లను కూడా అధిగమించి విజేతలుగా నిలుస్తారని ప్రధాని తెలిపారు.

సత్యం, సేవ, జ్ఞానం, కర్మ.. ఈ సుగుణాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 18th, 09:23 am

సత్యానికి కట్టుబడి ఉంటే సంపద, నిస్వార్థంగా సేవలను అందిస్తే కీర్తి, నిరంతర అభ్యాసం ద్వారా జ్ఞానం, కర్మలతో వివేకం లభిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సుగుణాలు మనిషి స్వభావాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషించడంతో పాటు, సమాజ పురోగతిలో కూడా కీలక పాత్రను పోషిస్తాయని ఆయన తెలిపారు.

గౌరవం, ప్రశంసల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 17th, 09:05 am

స్నేహపూర్వక గౌరవం, అంగీకార భావన మనుషులను గొప్పతనం కలవారుగా, గౌరవశాలురుగా, సంతృప్తి చెందిన వారుగా తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి గుర్తింపును తెచ్చుకొంటే వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనీ, ఒక కొత్త శక్తీ, ఉత్సాహం నిండుతాయనీ ఆయన తెలిపారు.

వివేకానికీ, ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడానికీ ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 16th, 08:53 am

ధైర్యం, వివేకం, దూరదృష్టి కలిగి ఉంటూ చేసే పనులతో సంతోషం, సౌభాగ్యం సిద్ధిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి నిర్ణయాన్నీ ఎంతో ఆలోచించి తీసుకోవాలనీ, ముందువెనుక ఆలోచించి చేసే పనులే విజయాన్ని అందిస్తాయనీ ఆయన తెలిపారు.

నూతన ఆవిష్కరణలలో, ఔత్సాహిక పారిశ్రామికత్వంలో వైవిధ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని

June 15th, 08:55 am

నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికత్వం.. ఈ రంగాల్లో ఉండే ప్రతి వ్యక్తికీ ఆలోచనా విధానం విభిన్నంగా, ప్రత్యేక సృజనాత్మక దృష్టికోణం ఉంటుందనీ, ఇవి కొత్త అవకాశాలకు బాట వేస్తాయనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నీరు అది పుట్టిన చోటును బట్టి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటున్నట్లే, ప్రతి ఒక్క ప్రతిభాశాలికీ తనదైన విశిష్ట గుర్తింపుతో పాటు తోడ్పాటు కూడా ఉంటుందని ఆయన తెలిపారు. వేర్వేరు ఆలోచనల, సామర్థ్యాల కలయికతోనే నూతన ఆవిష్కరణ, పురోగతీ సాధ్యపడతాయని కూడా ప్రధానమంత్రి అన్నారు.

మహిళల నాయకత్వంలో విభిన్న రంగాల్లో అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి

June 12th, 12:39 pm

మహిళల నాయకత్వంలో అభివృద్దిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కృషి చేస్తోందనీ, ఇది అన్ని రంగాలలో స్పష్టంగా కనిపిస్తోందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. అభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాలకు చేరవేయడం మొదలు ఔత్సాహిక పారిశ్రామికత్వం, విద్య, ఆరోగ్యసంరక్షణ, స్వచ్ఛత, గృహనిర్మాణం, క్రీడలు, విజ్ఞానశాస్త్రం, పరిపాలన.. ఇలా వివిధ రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని ఆయన తెలిపారు.

వ్యవసాయం, పంటలు మనిషి జీవితానికి ఆధారమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 11th, 11:34 am

వ్యవసాయం ఒక్క జీవనోపాధి మార్గమే కాక, సమాజానికీ దేశానికీ పోషణకు మూలాధారం కూడా అని చెబుతున్న సంస్కృత భాషా సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సుపరిపాలన అందించేందుకు, ప్రజల విశ్వాసాన్ని సంపాదించేందుకు ప్రజా సేవ అతిపెద్ద పరీక్ష వంటిదని ప్రస్తావిస్తూ, సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 10th, 11:00 am

సుపరిపాలనకు ప్రజాసేవే అతిపెద్ద పరీక్ష అని పేర్కొంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు. వినయం, అంకితభావం, కర్తవ్యం పట్ల నిబద్ధతతో పనిచేసే వారు ప్రజల విశ్వాసాన్ని పొందగలరని ప్రధానమంత్రి అన్నారు.

సమాజ సంక్షేమానికి అంకితమైన వివేకి గుణగణాలను వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 09th, 10:27 am

సమాజ సంక్షేమానికి అంకితమైన వివేకి గుణగణాల్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

ప్రకృ‌తితో సామరస్యం, సర్వ ప్రాణుల సంక్షేమాన్ని తెలిపే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 08th, 08:01 am

ప్రకృతితో సమతౌల్యాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా సకల ప్రాణుల సంక్షేమానికీ పాటుపడడం మన సంస్కృతిలో మూల భావనగా ఉందని చెబుతున్న ఓ సంస్కృత భాషా సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

June 05th, 09:53 am

ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ సంరక్షణ పట్ల మక్కువను కనబరిచే వారందరినీ ఆయన ప్రశంసించారు.