గుజరాత్‌లోని వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 08th, 12:30 pm
గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.గుజరాత్‌లోని వడోదరాలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు
September 08th, 12:00 pm
గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.తన 100 ఏళ్ల ప్రస్థానంలో, ఎస్ఆర్సీసీ తరతరాలను తీర్చిదిద్ది, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించింది: ప్రధాని మోదీ
September 05th, 07:30 pm
శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ) శతాబ్ది ఉత్సవాల్లో, ప్రధాని మోదీ విధాన స్తబ్దత నుండి విధాన చైతన్యం వైపు భారతదేశం సాగించిన ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, ఆర్థిక వృద్ధి, ఆర్థిక సమ్మిళితం, మేక్ ఇన్ ఇండియా, యువతకు పెరుగుతున్న అవకాశాలను ప్రముఖంగా పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయుల బలం, సంకల్పంతో నడిచే వికసిత, ఆత్మనిర్భర్ భారత్ కోసం ఒక ఉన్నతమైన దార్శనికతను కూడా ఆయన పంచుకున్నారు.శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 05th, 07:00 pm
శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, విధానపరమైన స్తబ్దత నుండి విధానపరమైన చైతన్యం వైపు భారతదేశం సాగించిన ప్రయాణాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక వృద్ధి, ఆర్థిక సమ్మిళితం, మేక్ ఇన్ ఇండియా, యువతకు పెరుగుతున్న అవకాశాలు వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. 14 కోట్ల మంది భారతీయుల బలం, సంకల్పంతో నడిచే వికసిత, ఆత్మనిర్భర్ భారత్ కోసం తనకున్న ఉన్నతమైన దార్శనికతను కూడా ఆయన పంచుకున్నారు.జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి ముఖాముఖి
September 05th, 10:00 am
లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సమావేశమయ్యారు. ఈ ఏడాది మూడు విభాగాలకు చెందిన మొత్తం 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలను జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి చెందిన 48 మంది ఉపాధ్యాయులు, ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్‌లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు/ఫ్యాకల్టీ సభ్యులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖకు చెందిన 13 మంది నైపుణ్య శిక్షకులు ఉన్నారు.ఆగస్టు 8న ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగించనున్న ప్రధాని
August 07th, 09:35 am
3,000 మందికి పైగా విద్యార్థులు పట్టభద్రులయ్యే ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఆయన ప్రతిభావంతులైన విద్యార్థులకు సంస్థ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేయడంతో పాటు, ఏఐ, అధునాతన కంప్యూటింగ్ మరియు పరిశోధనలను వేగవంతం చేయడానికి రూపొందించిన ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటింగ్ సదుపాయం అయిన 'పరం ప్రజ్ఞ'ను కూడా ప్రారంభించనున్నారు.Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharat‘వికసిత వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026’లో ప్రధానమంత్రి ప్రసంగం
July 26th, 05:00 pm
ఈ కార్యక్రమం నిజంగా ఎంతో ప్రత్యేకమైనది. దేశంలోని దాదాపు 250 జిల్లాల యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం.PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026
July 26th, 04:30 pm
PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.ఆస్ట్రేలియా-భారత్ ప్రధానమంత్రుల సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 09th, 11:15 am
అంతర్జాతీయ దృక్పథం, ప్రగాఢ పరస్పర విశ్వాసంతో రెండు దేశాలూ సంయుక్తంగా ముందడుగు వేయడంలో ఈ ఉమ్మడి విశిష్టతలే మనకెంతో స్ఫూర్తినిస్తాయి. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొన్నేళ్లుగా అద్భుత ప్రగతి సాధించిన నేపథ్యంలో నేటి మూడో వార్షిక శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య సహకార పరిధిని మరింత విస్తృతం చేసింది.ఎకనామిక్ రోడ్‌మ్యాప్ వాణిజ్య సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
July 09th, 06:15 am
ఇప్పుడు ఈ సరికొత్త మార్గం ద్వారా పెట్టుబడులు, ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయి. ఈ భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉంది.Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event
July 09th, 06:00 am
PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు కోసం జపాన్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
July 02nd, 10:39 pm
సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఏఐతో కూడిన సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత, స్వచ్ఛ సాంకేతికత, ఔషధాలు వంటి కీలక రంగాల్లో ఉమ్మడి దృఢత్వాన్ని పెంపొందించడం కోసం ప్రాజెక్ట్ ఆధారిత సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ కీలక రంగంలో పెరుగుతున్న భారత్-జపాన్ జీటూజీ (ప్రభుత్వాల మధ్య), బీటూబీ (వ్యాపారాల మధ్య) భాగస్వామ్యాన్ని 'ఇండియా-జపాన్ ఫ్యాక్ట్ షీట్ 2.0' స్పష్టంగా తెలియజేస్తుంది.పహాడ్‌పూర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించి, విద్యా మౌలిక సదుపాయాల మెరుగుదలకు జరుగుతున్న కృషిని కొనియాడిన ప్రధానమంత్రి
June 20th, 08:44 pm
పహాడ్‌పూర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 11:41 pm
కాంతులు, రంగులతో కూడిన నగరం పారిస్. ఇది కళలకు, సరికొత్త ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరంతా ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరే దీనికి సరికొత్త, చైతన్యవంతమైన రంగులను అద్దుతున్నారు.ప్యారిస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
June 18th, 09:30 pm
ఫ్రాన్స్‌లోని వివిధ రంగాల్లో భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. భారతీయ ఆవిష్కరణలనూ, ఆలోచనలనూ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఇండియా-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ- వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులు ఫ్రాన్స్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవడంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలు విస్తరించాయని ఆయన తెలియజేశారు. ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఫ్రాన్స్‌లో యూపీఐ విస్తరణ గురించి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని వివరించారు.'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.
May 31st, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.అనువాదం: ‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి మీడియా ప్రకటన
May 17th, 11:43 pm
కొద్దిసేపటి క్రితమే స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారమైన 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్'తో నన్ను గౌరవించారు. ఈ గౌరవం కేవలం నాది మాత్రమే కాదు.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం.. భారత్-స్వీడన్ సంబంధాలను మరింత సుసంపన్నం చేసి వాటికి బలమైన పునాదిని వేసిన స్వీడన్‌లోని మన మిత్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
April 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.రాజ్యసభలో ప్రధాని ప్రసంగం
April 17th, 11:10 am
సభ తరఫునా, నా తరఫునా శ్రీ హరివంశ్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా మూడోసారి ఎన్నికవడమే సభకు మీపై ఉన్న ప్రగాఢమైన విశ్వాసానికి నిదర్శనం. నిజానికి మీ అనుభవం ద్వారా గతంలో పొందిన ప్రయోజనాలకూ, అందరినీ కలుపుకొనిపోయిన మీ కృషికీ సభ ఈ విధంగా ఆమోదముద్ర వేసింది. అనుభవానికి, సహజమైన పనితీరుకు దక్కిన గౌరవమిది. ఆ సహజమైన పనిశైలికి ఇది ఆమోదం కూడా. హరివంశ్ గారి నేతృత్వంలో ఎంత ప్రభావవంతంగా సభ బలోపేతమైందో మనమంతా చూశాం. ఆయన సభ కార్యకలాపాలను నిర్వహించడమే కాదు.. తన జీవితానుభవాన్ని నిశితంగా ఉపయోగిస్తూ సభ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. సభా వ్యవహారాలన్నింటా, నిర్వహణలో, సభ వాతావరణంలో పరిణతిని పెంచడంలో ఆయన అనుభవం ఎంతగానో తోడ్పడింది. డిప్యూటీ చైర్మన్ ఈ కొత్త పదవీకాలం కూడా అదే స్ఫూర్తితో, సమతౌల్యంతో, నిబద్ధతతో సాగుతుందన్న దృఢమైన విశ్వాసం నాకుంది. మనందరి కృషితో సభ గౌరవం మరింత ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాను.