భద్రతా సహకారంపై భారత్-జపాన్ సంయుక్త ప్రకటన
August 29th, 07:43 pm
భారత్-జపాన్ ప్రభుత్వాలు (ఇకమీదట ఇరుపక్షాలూ), ఉమ్మడి విలువలు, ప్రయోజనాల ఆధారంగా భారత్-జపాన్ రాజకీయ దృక్పథాన్ని, ప్రత్యేక వ్యూహాత్మక, ప్రాపంచిక భాగస్వామ్య లక్ష్యాలను గుర్తుచేసుకోవడం, నిబంధనల ఆధారితమైన అంతర్జాతీయ క్రమాన్ని సమర్థించే ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో గల, శాంతియుతమైన, సుసంపన్నమైన, ఎలాంటి ఒత్తిళ్లు లేని ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో ఇరుదేశాల కీలక పాత్రను ప్రధానంగా ప్రాస్తావించడం, ఇటీవలి సంవత్సరాల్లో ఇరుదేశాల మధ్య గణనీయ పురోగతిని సాధించిన ద్వైపాక్షిక భద్రతా సహకారం.. ఇరుపక్షాల వ్యూహాత్మక దృక్పథం, పాలసీ ప్రాధాన్యాల పరిణామాలను ప్రస్తావించడం, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే వనరులు, సాంకేతిక సామర్థ్యాల పరంగా ఇరుదేశాల సమష్టి బలాలను గుర్తించడం, ఇరుదేశాల జాతీయ భద్రత, నిరంతర ఆర్థికవృద్ధి పరంగా ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉండటం, ఇండో-పసిఫిక్ ప్రాంతం, ఆ పొరుగున ఉన్న ప్రాంతాలకు సంబంధించిన ఉమ్మడి భద్రతా సమస్యలను పరిష్కరించే విషయంలో మరింత సమన్వయాన్ని సాధించడం, రూల్ ఆఫ్ లా ఆధారంగా అంతర్జాతీయ క్రమాన్ని సమర్థించుటకు కట్టుబడి ఉండటం, ఇరుదేశాల భాగస్వామ్యంలో నూతన దశను ప్రతిబింబిస్తూ భద్రతా సహకారంపై ఈ సంయుక్త ప్రకటనను ఆమోదించాయి. అలాగే కింది అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి:భారత్- బ్రిటన్ దార్శనికత 2035
July 24th, 07:12 pm
జూలై 24న జరిగిన సమావేశంలో “భారత్- బ్రిటన్ దార్శనికత 2035”ను ఇరు దేశాల ప్రధానమంత్రులు ఆమోదించారు. రెండు దేశాలు తమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకునేలా చేసే వాణిజ్య ఒప్పందం కుదిరిన అనంతరం దీనికి ఆమోదం తెలపటం అనేది నాయకుల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంతో పరస్పర వృద్ధి, శ్రేయస్సు కోసం ఉభయ దేశాలు కలిసి చేయనున్నాయి. వేగంగా మారుతోన్న ప్రస్తుత సమయంలో సుసంపన్న, సురక్షిత, సుస్థిర ప్రపంచాన్ని రూపొందించేందుకు రెండు దేశాల సంకల్పాన్ని ఈ ఒప్పందం తెలియజేస్తోంది.