సౌదీ అరేబియాలో ప్రధానమంత్రి అధికార పర్యటన- ఫలితాలు

April 23rd, 02:25 am

*2025 ఏప్రిల్ 22న జెడ్డాలో జరిగిన భారత్ - సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్పీసీ) నాయకుల రెండో సమావేశానికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. మండలి ఎస్పీసీ ఆధీనంలోని రాజకీయ, రక్షణ, భద్రతా, వాణిజ్య, పెట్టుబడి, ఇంధనం, సాంకేతిక, వ్యవసాయం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన వివిధ కమిటీలు, ఉపకమిటీలు, వర్కింగ్ గ్రూపుల పనితీరును కౌన్సిల్ సమీక్షించింది. చర్చల అనంతరం ఇరువురు నేతలు మినిట్స్ పై సంతకాలు చేశారు.

గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధాని;

April 23rd, 02:20 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 22న సౌదీ అరేబియాలో అధికారికంగా పర్యటించారు. జెడ్డాలోని రాయల్ ప్యాలెస్‌లో గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ భారత ప్రధానమంత్రికి లాంఛనంగా ఘన స్వాగతం పలికారు.

సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్న ప్రధాని మోదీ

April 22nd, 04:29 pm

రాయల్ హైనెస్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. ప్రత్యేక సంజ్ఞలో, సౌదీ వైమానిక దళ జెట్‌లు ప్రధాని మోదీ విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఆయనకు ఎస్కార్ట్ అందించి, జెడ్డాకు తీసుకెళ్లాయి. ప్రధాని మోదీకి జెడ్డాలో ఘన స్వాగతం లభించింది. ఆయన సౌదీ అరేబియాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

భారత్ - అమెరికా సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ప్రకటనకు తెలుగు అనువాదం

February 14th, 04:57 am

ముందుగా నాకు ఆత్మీయ స్వాగతాన్ని, ఆతిథ్యాన్ని అందించిన నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్ తన నాయకత్వ పటిమ ద్వారా భారత్-అమెరికా మధ్య సంబంధాలను పునరుజ్జీవింపచేశారు.

పారిస్ లో భారత్-ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ప్రధాని ప్రసంగం

February 12th, 12:45 am

‘సృజన, సహకారం, అభ్యున్నతి’ని మంత్రప్రదంగా భావించి మీరు ముందుకు సాగుతుండడాన్ని నేను గమనించాను. మీరు కేవలం ఉన్నతాధికారుల మధ్య వారధులు మాత్రమే కాదు.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మీరు బలోపేతం చేస్తున్నారు.

భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 12th, 12:25 am

ఈ రోజు ప్యారిస్‌లో నిర్వహించిన భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్‌...ప్రసంగించారు. ఈ ఫోరమ్ ఇరు పక్షాలకు చెందిన వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సీఈఓల)ను ఒక చోటుకు చేర్చింది. ఇది రక్షణ, ఏరోస్పేస్, కీలక టెక్నాలజీలు-కొత్తగా ఉనికిలోకి వస్తున్న టెక్నాలజీలు, మౌలిక సదుపాయాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, కృత్రిమ మేధ, వైద్య ఆరోగ్య శాస్త్రాలు, జీవనశైలిలతోపాటు ఆహారం, ఆతిథ్య రంగాలపై దృష్టిని కేంద్రీకరించింది.

ఇండోనేషియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 25th, 01:00 pm

భారత తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియా మన ముఖ్య అతిథిగా ఉంది. ఇప్పుడు మన 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఇండోనేషియా మరోసారి ఈ చిరస్మరణీయ సందర్భంలో భాగం కావడానికి అంగీకరించడం మాకు చాలా గర్వకారణం. ఈ సందర్భంగా, ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సహా వారి బృందానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.

జర్మనీ చాన్సలర్‌తో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

October 25th, 01:50 pm

మున్ముందుగా భారత పర్యటనకు వచ్చిన చాన్సలర్ షోల్జ్ గారికి, ఆయన ప్రతినిధి బృందానికీ సుస్వాగతం. గడచిన రెండేళ్ల వ్యవధిలో మిమ్మల్ని మూడోసారి మా దేశానికి ఆహ్వానించే అవకాశం లభించడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది.

సింగ‌పూర్ ప్ర‌ధానితో స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌న మోదీ వ్యాఖ్య‌లు

September 05th, 09:00 am

మీరు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత మ‌నిద్ద‌రి మ‌ధ్య జ‌రుగుతున్న తొలి స‌మావేశం ఇది. మీకు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు. మీ 4జీ నాయ‌క‌త్వంలో సింగ‌పూర్ మ‌రింత వేగ‌వంత‌మైన వృద్ధిని సాధిస్తుంద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.

బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియాతో ప్రధాన మంత్రి సమావేశం

September 04th, 12:11 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున బందర్ సెరీ బెగవాన్ లోని ఇస్తానా నూరుల్ ఇమాన్ కు చేరుకున్నారు. అక్కడ బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియా ప్రధాన మంత్రి కి స్నేహపూర్వకంగా స్వాగతం పలికారు.

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రితో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం

May 24th, 06:41 am

ఆస్ట్రేలియా పర్యటనలో నాకు, నా ప్రతినిధి బృందానికి ఇచ్చిన ఆతిథ్యం, గౌరవానికి ఆస్ట్రేలియా ప్రజలకు, ప్రధాని అల్బనీస్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు, ప్రధాన మంత్రి (ఆస్ట్రేలియా) అల్బనీస్ భారత పర్యటనకు వచ్చిన రెండు నెలల్లోనే నేను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాను. గత ఏడాది కాలంలో మా భేటీ ఇది ఆరోసారి.

We aim to increase defence manufacturing in India: PM Modi

August 27th, 05:11 pm

At a webinar on defence sector, PM Modi spoke about making the sector self-reliant. He said, We aim to increase defence manufacturing in India...A decision has been taken to permit up to 74% FDI in the defence manufacturing through matic route.

రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 27th, 05:00 pm

రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఈ రోజు న ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. రక్షణ సంబంధిత తయారీ లో స్వయంసమృద్ధి బాట న సాగిపోవడం అవసరమని ప్ర‌ధాన మంత్రి ఉద్ఘాటిస్తూ, రక్షణ సంబంధిత ఉత్పత్తి ని పెంచడం, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం, ఇంకా రక్షణ రంగం లో ప్రైవేటు సంస్థల కు ప్రముఖ పాత్ర ను ఇవ్వడం మన ధ్యేయం గా ఉంది అన్నారు.

సౌదీ అరేబియా తో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఒప్పందమనేది ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలోపేతం చేయగలదన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 29th, 11:08 am

వ్యూహాత్మక భాగస్వామ్య మండలి పై భారతదేశం మరియు సౌదీ అరేబియా ల మధ్య కుదిరిన ఒప్పందం పై సంతకాలు కావడం ద్వారా ఇరు దేశాల మధ్య ఇప్పటికే గల బలమైన సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.