నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం… శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 01st, 06:09 pm
నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సేవ, ధైర్య-సాహసాలు, కరుణ మూలాధారాలుగా విలసిల్లుతున్న నాగాలాండ్ వైభవోపేత సంస్కృతి సర్వత్ర ప్రశంసలకు పాత్రమవుతోంది. ‘‘నాగాలాండ్ ప్రజలు అనేక రంగాల్లో పేరు-ప్రఖ్యాతులు సంపాదించారు. రాబోయే కాలాల్లోనూ ఈ రాష్ట్రం సమృద్ధినీ, ప్రగతినీ సాధిస్తూ పురోగమించాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
November 15th, 08:22 am
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సజీవ గిరిజన సంస్కృతికి ఆలవాలమైన పుణ్యభూమి జార్ఖండ్ అని ఆయన కొనియాడారు. భగవాన్ బిర్సా ముండా శౌర్య పరాక్రమాలను గుర్తుచేసిన ఆయన.. ధైర్యం, ఆత్మగౌరవం, అలుపెరుగని పోరాటాల స్ఫూర్తిదాయక గాథలతో కూడిన చరిత్ర ఈ పవిత్ర నేలకు ఉందని పేర్కొన్నారు.‘ఉత్కళ దిబస’ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
April 01st, 08:59 am
ఈ రోజు ‘ఉత్కళ దిబస’. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా చరిత్ర, సాహిత్యం, సంగీతాలను చూసుకొని భారత్ గర్వపడుతోందని ఒడిశా ప్రగతిని మరింత ముందుకు తీసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
December 01st, 12:28 pm
నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విధినిర్వహణలో స్ఫూర్తికి, కరుణకు పేరెన్నికగన్నది నాగా సంస్కృతి అని ఆయన అన్నారు.మిజోరమ్ రాష్ట్రప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధానమంత్రి
February 20th, 10:49 am
మిజోరమ్ రాష్ట్ర ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. మిజోరమ్ రాష్ట్రం నిరంతరం ప్రగతి ని సాధిస్తూ ఉండాలని, శాంతి తోను, సమృద్ధి తోను విలసిల్లేలా చూడాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు.హిమాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భంలో అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 25th, 09:42 am
హిమాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.మణిపూర్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 21st, 09:24 am
మణిపూర్ రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో పయనించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.