కోటా ఎయిర్‌పోర్ట్ భూమిపూజ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
March 07th, 03:15 pm
వారం కిందటే.. రాజస్థాన్‌ను సందర్శించే అవకాశం నాకు లభించింది. పవిత్రమైన అజ్మేర్ నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. శంకుస్థాపనలు చేశాం. అదే కార్యక్రమంలో 21,000 మందికి పైగా రాజస్థాన్ యువతకు నియామక పత్రాలను అందించాం. అజ్మేర్ పర్యటన చేపట్టిన కొన్ని రోజుల వ్యవధిలోనే కోటాలో ముఖ్యమైన విమానాశ్రయ ప్రాజెక్టు పనులను ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. ఒక వారంలోనే రాజస్థాన్‌లో ప్రారంభమైన ఈ రెండు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు శక్తిమంతమైన సందేశాన్నిస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ ఎంత వేగంగా పురోగతి సాధిస్తుందో ఇవి చూపిస్తున్నాయి. అది మౌలిక వసతులు, యువతకు ఉద్యోగావకాశాలు, రైతులు, మహిళలకు పథకాలైనా లేదా ప్రతి రంగంలోనూ చేపడుతున్న కార్యక్రమాలైనా రాజస్థాన్లో వేగంగా పని జరుగుతోంది.కోటా విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని.. సమగ్రాభివృద్ధితో హడోటీ ప్రాంత రూపురేఖలు మారుతున్నాయన్న శ్రీ నరేంద్ర మోదీ
March 07th, 02:45 pm
హడోటీ ప్రాంత అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న కోటా విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమాన్నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రాజస్థాన్ నేడు అపూర్వమైన వేగంతో ముందుకు సాగుతోంది. ఇక్కడ నిర్మించబోతున్న కొత్త విమానాశ్రయం ఈ ప్రాంత ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి బలమైన చోదక శక్తిగా నిలవబోతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.ఫిబ్రవరి 16న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో- 2026'ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
February 15th, 02:21 pm
2026 ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026'ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.