ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం
November 01st, 01:59 pm
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.