కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని 3 జిల్లాల్లో మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం... ఈ ప్రాజెక్టుతో మరో 46 కి.మీ మేర విస్తరించనున్న భారతీయ రైల్వే వ్యవస్థ

July 24th, 04:05 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బళ్లారి-గుంతకల్ విభాగం మధ్య రూ. 1,264 కోట్ల అంచనా వ్యయంతో 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి నేడు ఆమోదం తెలిపింది.