శ్రీ నారాయణ్ గురు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
August 28th, 01:22 pm
శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. పరస్పర గౌరవం, కరుణతో కూడిన సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు, ప్రబోధకుడుగా శ్రీ నారాయణ గురును ఆయన అభివర్ణించారు.మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వం యువతకు గట్టిగా అండగా నిలుస్తుంది: ప్రధాని మోదీ
August 02nd, 11:25 am
‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీసీ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, యువతను మాదకద్రవ్యాలనే ప్రాణాంతక ముప్పుకు దూరంగా ఉంచడమే ఈ ప్రచార లక్ష్యమని ఆయన నొక్కి చెప్పారు. యువతను భారతదేశపు అమృత తరం అని అభివర్ణిస్తూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ, ఈ ఉచ్చు నుండి యువతను కాపాడాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఈ రోజు తీసుకున్న ఈ ప్రతిజ్ఞ రాబోయే 100 వారాల పాటు కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లో భాగంగా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే ‘నషా ముక్త్ యువా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
August 02nd, 11:00 am
వికసిత భారత్ సంకల్ప అభియాన్ లో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే ‘నషా ముక్త్ యువా’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపు 28,000 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన కోటిమందికి పైగా యువతకు ప్రధానమంత్రి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరిస్తూ, ఈ సమావేశాన్ని ఒక ప్రగాఢమైన జాతీయ ప్రతిజ్ఞగా అభివర్ణించారు. ఈరోజు మన దేశవాసులందరం ఒక గొప్ప, అత్యంత ముఖ్యమైన సంకల్పం కోసం ఏకమయ్యాం అని శ్రీ మోదీ పేర్కొన్నారు.స్వామి వివేకానంద నిర్వాణ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు
July 04th, 01:50 pm
నేడు స్వామి వివేకానంద నిర్వాణ దినోత్సవం (మహాసమాధి దినం) సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో స్వామి వివేకానంద చేసిన అసాధారణ కృషి తరతరాలకూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని కొనియాడారు. ఆయన అపారమైన జ్ఞానం, శాశ్వతమైన ఆదర్శాలు నేటికీ దేశంలోని లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘దేశాన్ని వికసిత భారత్‌గా తీర్చిదిద్దాలనే మన సామూహిక సంకల్పానికి, స్వామిజీ అందించిన ఆధ్యాత్మిక సందేశం నిరంతరం సరికొత్త శక్తిని, స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ప్రాంగణంలో శ్రీశ్రీ రవిశంకర్‌తో ప్రధానమంత్రి సమావేశం
May 10th, 07:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రాంగణంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తో సమావేశమయ్యారు.ఆది శంకరాచార్యకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
April 21st, 01:09 pm
భారత్ మహనీయ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ఆది శంకరాచార్య జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆది శంకరాచార్య లోతైన బోధనలు, ఆలోచనలు, అద్వైత వేదాంత తత్త్వం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శకంగా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు. ఆధ్యాత్మిక చింతనను పునరుత్తేజితం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలూ, దేశమంతటా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రాలూ కలకాలం స్ఫూర్తినిస్తాయన్నారు. ‘‘ఆయన జ్ఞానం మనకు దారి దీపంగా నిలవాలనీ, సత్యం, దయలతో పాటు సకల వర్గాల శ్రేయస్సుకు పాటుపడాలన్న మన నిబద్ధతను బలోపేతం చేయాలనీ కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.శ్రీ నారాయణ గురు-మహాత్మాగాంధీల సంభాషణ శతాబ్ది ఉత్సవాలను రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి
June 23rd, 05:24 pm
ఆధ్యాత్మికత, నైతిక విలువలను బోధించిన గొప్ప నాయకులు శ్రీ నారాయణ గురు - మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రాత్మక సంభాషణ శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.పరమ పవిత్రులు పోప్ లియో XIVకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 09th, 02:21 pm
పరమ పవిత్రులు పోప్ లియో XIV కు భారతదేశ ప్రజల పక్షాన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన హృదయపూర్వక అభినందనలతోపాటు శుభాకాంక్షలను తెలిపారు. కేథలిక్ చర్చికి పోప్ అందిస్తున్న నాయకత్వాన్ని శ్రీ మోదీ హర్షించారు. ప్రపంచంలో శాంతినీ, సద్భావననూ, సంఘీభావాన్నీ, సేవనూ వ్యాప్తి చేయడంలో కేథలిక్ చర్చికి విస్తృత ప్రాధాన్యం ఉందని ప్రధాని అన్నారు.సమాజానికి పోప్ ఫ్రాన్సిస్ చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: ప్రధానమంత్రి
April 26th, 01:00 pm
భారత ప్రజల తరఫున పోప్ ఫ్రాన్సిస్ కు గౌరవ రాష్ట్రపతి నివాళులు అర్పించారని, పోప్ ఫ్రాన్సిస్ సమాజానికి చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం.. ప్రధానమంత్రి సంతాపం
April 21st, 02:20 pm
పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరని తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు.స్వామి రామకృష్ణ పరమహంస జయంతి.. ప్రధానమంత్రి నివాళి
February 18th, 08:52 am
స్వామి రామకృష్ణ పరమహంస జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.ఫిబ్రవరి 5 న ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాను సందర్శించనున్న ప్రధానమంత్రి
February 04th, 07:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఫిబ్రవరి 5 న ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమం వద్ద ప్రధాని పుణ్యస్నానం ఆచరించి గంగామాతకు పూజలు చేస్తారు.శ్రీ సోనాల్ మాతా శతజయంతి కార్యక్రమంలో ప్రధాన మంత్రి వీడియో సందేశం
January 13th, 12:00 pm
ప్రస్తుత ఆధ్యాత్మిక నాయకురాలు (గాదిపతి) పూజ్య కంచన్ మాత, మరియు పరిపాలనాధికారి పూజ్య గిరీష్ అపా! ఈ రోజు, పవిత్రమైన పుష్య మాసంలో, మనమందరం ఆయ్ శ్రీ సోనాల్ మా యొక్క శత జయంతిని జరుపుకుంటున్నాము. సోనాల్ తల్లి ఆశీస్సులతో ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడం నిజంగా గర్వకారణం. మొత్తం చరణ్ కమ్యూనిటీకి, నిర్వాహకులకు, సోనాల్ మా భక్తులకు అభినందనలు. చరణ్ కమ్యూనిటీకి ఆరాధన, అధికారం, సంప్రదాయాల కేంద్రంగా మదదా ధామ్ కు ప్రత్యేక స్థానం ఉంది. నేను వినమ్రంగా శ్రీ ఆయి పాదాలకు నమస్కరిస్తున్నాను మరియు ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను.ఆయి శ్రీ సోనాల్ మాత శతజయంతి సందర్భంగా వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
January 13th, 11:30 am
సోనాల్ మాత శతజయంతి వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఆయి శ్రీ సోనాల్ మాత జన్మశతాబ్ది ఉత్సవం పవిత్ర పుష్య మాసంలో నిర్వహిస్తున్న సందర్భంగా మాత ఆశీస్సులు పొందడంపై కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల నిర్వహణపై చరణ్ సమాజంతోపాటు నిర్వాహకులందర్నీ ప్రధాని మోదీ అభినందించారు. ‘‘మద్దా ధామ్ చరణ సమాజానికి భక్తి, శక్తి, ఆచార-సంప్రదాయాల కూడలిగా ఉంది. నేను శ్రీ ఆయి పాదాలకు ప్రణమిల్లి, నా భక్తిప్రపత్తులను చాటుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.All saints have nourished the spirit of ‘Ek Bharat Shreshta Bharat’ for thousands of years in India: PM Modi
July 04th, 11:00 am
PM Modi inaugurated Sai Hira Global Convention Centre in Puttaparthi, Andhra Pradesh via video conferencing. He expressed confidence that the new center will create an experience of spirituality and splendor of modernity. He said that the center comprises cultural persity and a conceptual grandeur, and it will become a focal point for discussions on spirituality and academic programs where scholars and experts will get together.ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి లో సాయి హీరా గ్లోబల్కన్ వెన్శన్ సెంటరు ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి
July 04th, 10:36 am
ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి లో ఏర్పాటైనటువంటి సాయి హీరా గ్లోబల్ కన్ వెన్శన్ సెంటరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తం గా పలువురు ప్రముఖుల మరియు భక్తుల సమక్షం లో ఈ ప్రారంభ కార్యక్రమం సంపన్నమైంది.హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమృత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 24th, 11:01 am
అమృత ఆసుపత్రి రూపంలో మనందరికీ దీవెనలు పంచుతున్న మా అమృతానందమయి జీకి నేను నమస్కరిస్తున్నాను. స్వామి అమృతస్వరూపానంద పూరీ జీ, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ జీ, ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ జీ, నా క్యాబినెట్ సహచరుడు క్రిషన్ పాల్ జీ, హర్యానా ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌతాలా జీ, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!ఫరీదాబాద్ లో అత్యాధునికమైన అమృత హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 24th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫరీదాబాద్ లో అత్యాధునిక అమృత హాస్పిటల్ ను ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారిలో హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌటాలా, కేంద్ర మంత్రి శ్రీ క్రిష్ణ పాల్ గుర్జర్, శ్రీ మాత అమృతానందమయి తదితరులు కూడా ఉన్నారు.ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపును అందుకొని స్థానిక ఉత్పత్తులకు అనుకూలంగా మద్ధతు తెలిపిన ఆధ్యాత్మిక నేతలు
November 17th, 02:14 pm
ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం ‘వోకల్ ఫార్ లోకల్’ ను (‘స్థానిక వస్తువులనే ఆదరిద్దాం’) గురించి ప్రచారం చేయడంలో సాయపడాలంటూ ఆధ్యాత్మిక నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజున చేసిన విజ్ఞప్తికి దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు పెద్ద ఎత్తున ప్రతిస్పందించారు. ప్రధాన మంత్రి అభ్యర్థన పట్ల ‘సంత్ సమాజం’లో గొప్ప ఉత్సుకత వ్యక్తమైంది. ఆత్మనిర్భర్ భారత్ ను ఆవిష్కరించడానికి ‘స్థానిక వస్తువుల వైపు మొగ్గు చూపాలన్న’ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆధ్యాత్మికవేత్తలు ముందంజవేసి, ఆ నినాదానికి తమ సమర్ధన ఉంటుందంటూ ప్రతినబూనారు.