నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన
May 18th, 04:44 pm
గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ - 2025లో స్వర్ణాన్ని గెలిచిన శ్రీ ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్.. స్కేటింగ్‌లో భారత మొట్టమొదటి ప్రపంచ చాంపియన్ శ్రీ వేల్‌కుమార్‌యే.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
September 16th, 08:47 am
స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ - 2025లో భాగంగా నిర్వహించిన ‘సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్ప్రింట్ పోటీ’లో స్వర్ణ పతకాన్ని శ్రీ ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ గెలిచిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. ‘‘ఆయన కనబరిచిన దృఢచిత్తం, వేగం, ఉత్సాహం.. ఇవే స్కేటింగ్‌లో భారత ప్రప్రథమ ప్రపంచ చాంపియన్‌గా నిలిపాయి. ఆయన సాధించిన ఈ విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుంది’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు.