కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు 2025లో రైతులతో పీఎం సంభాషణ
November 20th, 12:30 pm
ఇవన్నీ విలువ జోడించిన అరటి ఉత్పత్తులే.. ఇవి వ్యర్థాలు.. సార్, ఇది అరటి వ్యర్థాల నుంచి, ఇది అరటి నుంచి తయారు చేసినది సార్తమిళనాడులోని కోయంబత్తూరులో దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025లో రైతులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
November 20th, 12:16 pm
తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆయన అభివాదం చేస్తూ, అరటి పంట దిగుబడిని పరిశీలించారు. అరటి వ్యర్థాలను ఏం చేస్తారని ఆయన వారిని అడిగారు. దీనికి రైతు సమాధానమిస్తూ, ప్రదర్శనకు పెట్టినవన్నీ అరటి వ్యర్థాల్ని ఉపయోగించి తయారు చేసిన వస్తువులేనన్నారు. వారి ఉత్పాదనలను దేశమంతటా ఆన్‌లైన్లో అమ్ముతున్నారా అని ప్రధానమంత్రి అడిగారు. అవును, అమ్ముతున్నామని రైతు బదులిచ్చారు. తాము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌పీఓల)తో పాటు వ్యక్తిగతంగా కూడా పూర్తి తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఆ రైతు చెప్పారు. తమ ఉత్పాదనలను ఇంటర్నెట్ ద్వారా అమ్ముతున్నట్లు, ఎగుమతి చేస్తున్నట్లు, దేశవ్యాప్తంగా స్థానిక మార్కెట్లతో పాటు సూపర్‌మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఒక్కొక్క ఎఫ్‌పీఓలో ఎంత మంది కలిసి పనిచేస్తారని శ్రీ మోదీ అడిగారు. సుమారుగా ఒక వేయి మంది వరకు దీనిలో ఉంటారని రైతు జవాబిచ్చారు. అరటి సాగును ఒకే ప్రాంతంలో చేపడతారా, లేక ఇతర పంటలతో కలిపి సాగు చేస్తారా అని ప్రధాని ప్రశ్నించారు. వివిధ ప్రాంతాలు వేరు వేరు విశిష్ట ఉత్పాదనలలో ప్రావీణ్యాన్ని సంపాదించాయని రైతు వివరణనిస్తూ, తమ వద్ద జీఐ ఉత్పాదనలు కూడా ఉన్నాయని తెలిపారు.తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025లో ప్రధానమంత్రి ప్రసంగం
November 19th, 07:01 pm
తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్. రవి, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ ఎల్. మురుగన్, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్. కె. రామస్వామి, వివిధ వ్యవసాయ సంస్థల నుంచి ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, నా ప్రియమైన రైతు సోదరీ, సోదరులు, డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన లక్షలాదిమంది రైతులు! మీ అందరికీ వణక్కం! నమస్కారం! ముందుగా, ఇక్కడ ఉన్న మీ అందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న నా రైతు సొదరీ, సోదరులకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు ఒక గంట ఆలస్యం అయ్యింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నేను సత్య సాయిబాబాకు అంకితం చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తిలో ఉన్నాను. అక్కడ ఆ కార్యక్రమం ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం కొనసాగింది. అందుకే, నేను రావడానికి ఆలస్యం అయ్యింది. దీనివల్ల మీకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలి. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఎదురు చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. అందుకే వినయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను.తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ శిఖరాగ్ర సదస్సు-2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 19th, 02:30 pm
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ రోజు దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సు-2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన శ్రీ మోదీ... కోయంబత్తూరు పవిత్ర గడ్డపై మరుధమలై మురుగన్‌కు నమస్కరిస్తూ తన వ్యాఖ్యలను ప్రారంభించారు. కోయంబత్తూరు సంస్కృతి, కరుణ, సృజనాత్మకతకు నిలయంగా... దక్షిణ భారత పారిశ్రామిక శక్తికి కేంద్రంగా ఉందన్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థకు నగర వస్త్ర రంగం ప్రధానంగా దోహదపడుతోందని ఆయన స్పష్టం చేశారు. కోయంబత్తూరుకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నందున ఈ నగరానికి మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన
November 18th, 11:38 am
నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.