తమిళనాడు తూత్తుకుడిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
July 26th, 08:16 pm
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, నా కేబినెట్ సహచరులు కింజరపు రామమోహన్ నాయుడు గారు, డా. ఎల్. మురుగన్ గారు, తమిళనాడు మంత్రులు తంగం తెన్నరసు గారు, డా. టి.ఆర్.బి. రాజా గారు, పి. గీతా జీవన్ గారు, అనితా ఆర్. రాధాకృష్ణన్ గారు, ఎంపీ కణిమొళి గారు, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మన ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ గారు, తమిళనాడు సోదర సోదరీమణులారా!తమిళనాడు తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
July 26th, 07:47 pm
తమిళనాడులోని తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ప్రాంతీయంగా అనుసంధానాన్ని విశేషంగా మెరుగుపరచడంతోపాటు.. రవాణా రంగ సామర్థ్యాన్ని పెంచేలా, శుద్ధ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా వివిధ రంగాల్లో వరుసగా చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా కార్గిల్ వీర సైనికులకు శ్రీ మోదీ నివాళి అర్పించారు. సాహసికులైన వీరయోధులకు ప్రణమిల్లారు. దేశం కోసం ప్రాణత్యాగానికీ వెనుకాడని అమరులకు మనఃపూర్వకంగా అంజలి ఘటించారు.జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
June 06th, 12:50 pm
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారూ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వినీ వైష్ణవ్ గారూ జితేంద్ర సింగ్ గారూ వి. సోమన్న గారూ, ఉప ముఖ్యమంత్రి సురేంద్ర కుమార్ గారూ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునిల్ గారూ, నా పార్లమెంటు సహచరుడు జుగల్ కిషోర్ గారూ, ఇతర ప్రజా ప్రతినిధులూ, ప్రియమైన సోదరీసోదరులరా... వీరుడైన జోరావర్ సింగ్ నడయాడిన గడ్డ ఇది. ఈ నేలకు ప్రణమిల్లుతున్నాను.జమ్మూ కాశ్మీర్ లో రూ.46,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభం, అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
June 06th, 12:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లోని కత్రాలో 46,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు. ధైర్యవంతుడైన వీర్ జోరావర్ సింగ్ భూమికి వందనం చేస్తూ, నేటి కార్యక్రమం భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప వేడుక అని ఆయన వ్యాఖ్యానించారు. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ లోయ ఇప్పుడు భారతదేశంలోని విస్తారమైన రైల్వే నెట్వర్క్ తో అనునుసంధానితమైందని శ్రీ మోదీ అన్నారు.