భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 23rd, 02:12 pm
ఈరోజు మనమందరం ఒక ప్రత్యేక సందర్భానికి సాక్షులుగా నిలుస్తున్నాం. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుగుతున్న ఈ ద్విశతాబ్ది వేడుకలు మనందరికీ దక్కిన అదృష్టం. ఈ పవిత్ర మహోత్సవంలో మనమందరం భాగస్వాములవ్వడం విశేషం. ఈ పుణ్యకాలంలో నేను సాధువులందరికీ ప్రణామం చేస్తున్నాను. ఈ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా భగవాన్ స్వామినారాయణ్ కోట్లాది మంది భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 23rd, 02:00 pm
శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశాన్ని ఇవాళ వీడియో ద్వారా పంచుకున్నారు. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భానికి మనమంతా సాక్షులమని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ద్విశతాబ్ది వేడుకలు జరుపుకోవటం, ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు కావటం అందరికీ దక్కిన అదృష్టమన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో సాధువులకు శిరస్సు వంచి నమస్కరించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ, ద్విశతాబ్ది వేడుకల సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ బోధనలను అనుసరిస్తున్న కోట్ల మంది భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.అనువాదం: గుజరాత్‌లో జరిగిన 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'లో ప్రధానమంత్రి ప్రసంగం
January 11th, 12:00 pm
ప్రజాదరణ కలిగిన గౌరవ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, ఉత్సాహవంతుడైన యువ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి గారు.. గుజరాత్ ప్రభుత్వ మంత్రులు జితుభాయ్ వాఘాని, అర్జున్‌భాయ్ మోద్వాడియా, డాక్టర్ ప్రద్యుమ్న వాజా, కౌశిక్ భాయ్ వేకారియా.. పార్లమెంటు సభ్యుడు రాజేష్‌భాయ్, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా.. ఈ రోజు దేశ నలుమూలలకు చెందిన లక్షలాది మంది ప్రజలు మనతో అనుసంధానమై ఉన్నారు.. వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘సోమనాథుడికి విజయం కలుగుగాక’!!గుజరాత్‌లోని సోమనాథ్‌లో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 11th, 11:41 am
గుజరాత్‌లోని సోమనాథ్‌లో ఈ రోజు నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమయం అసాధారణమైనది... ఈ వాతావరణం అసాధారణమైనది... ఈ వేడుక అసాధారణమైనది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒక వైపు స్వయంగా మహాదేవుడు... మరోవైపు సూర్యకిరణాలు, మంత్రాల ప్రతిధ్వని, ఉప్పొంగుతున్న భక్తితో కూడిన సముద్రపు అలలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో సోమనాథ్... భక్తులందరి ఉనికితో ఈ సందర్భాన్ని మరింత దివ్యమైనదిగా, గొప్పగా మారుస్తోందని ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా తనకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో చురుగ్గా సేవ చేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 72 గంటల పాటు నిరంతరాయంగా ఓంకారం జపించడం... 72 గంటల పాటు మంత్ర పఠనం చేయడం అద్భుతమని ఆయన పేర్కొన్నారు. నిన్న సాయంత్రం వెయ్యి డ్రోన్లతో... వేద గురుకులాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు నిర్వహించిన అద్భుత ప్రదర్శన సోమనాథుని వెయ్యి సంవత్సరాల గాథను ఎంతో చక్కగా వివరించిందన్నారు. 108 అశ్వాలతో సాగిన 'శౌర్య యాత్ర' ఈ రోజు ఆలయానికి చేరుకుందని ఆయన తెలిపారు. మంత్రాలు, భజనలతో భక్తులందరినీ మంత్రముగ్ధులను చేసిన ఈ ప్రదర్శన మాటలకు అతీతమని... కాలం మాత్రమే ఈ అనుభవాన్ని సంగ్రహించగలదని ఆయన వివరించారు. ఈ వేడుక దర్పం, గౌరవం, హుందాతనం, జ్ఞానం, గొప్పతనం, వారసత్వం, ఆధ్యాత్మికత, సాక్షాత్కారం, అనుభవం, ఆనందం, సాన్నిహిత్యాల కలయికగా ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అన్నింటికీ మించి ఇది భగవాన్ మహాదేవుని ఆశీర్వాదాలను కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు.Prime Minister shares glimpses of his visit to Somnath
January 10th, 11:00 pm
PM Modi shared glimpses of his visit to Somnath in Gujarat, where he received a warm welcome from the people during #SomnathSwabhimanParv. Later, the PM participated in Omkar Mantra chanting and witnessed a drone show. He also chaired a meeting of the Shree Somnath Trust, reviewing various aspects related to infrastructure upgradation in the temple complex.జనవరి 10, 11 తేదీల్లో గుజరాత్‌లోని సోమనాథ్‌లో నిర్వహించే సోమనాథ స్వాభిమాన పర్వంలో పాల్గొననున్న ప్రధాని
January 09th, 12:10 pm
జనవరి 10, 11 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సోమనాథ్‌లో పర్యటిస్తారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో పాల్గొంటారు. జనవరి 10న రాత్రి 8 గంటలకు సోమనాథ ఆలయంలో నిర్వహించే ఓంకార మంత్రోచ్ఛారణలో పాల్గొంటారు. అలాగే డ్రోన్ ప్రదర్శనను వీక్షిస్తారు.జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని
January 09th, 12:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్‌లో పర్యటిస్తారు. జనవరి 10 సాయంత్రానికి ప్రధాని సోమనాథ్‌కు చేరుకుంటారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో సోమనాథ్ ఆలయంలో నిర్వహించే ఓంకార మంత్రోచ్ఛారణలో పాల్గొంటారు. అనంతరం డ్రోన్ ప్రదర్శనను వీక్షిస్తారు.దేశ సామూహిక చేతనను మేల్కొలపడంలో సోమనాథ్ ధామ్‌ది శాశ్వత భూమిక.. సుభాషితం ద్వారా స్పష్టం చేసిన ప్రధానమంత్రి
January 09th, 08:44 am
పవిత్ర సోమనాథ్ ధామంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. దేశ సామూహిక చేతనను మేల్కొలపడంలో సోమనాథ్ ధామ్ పోషిస్తున్న శాశ్వత పాత్రను ఆయన ప్రస్తావించారు.సోమనాథ్ స్వాభిమాన పర్వ్ ప్రారంభం: దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
January 08th, 10:22 am
సోమనాథ్ స్వాభిమాన పర్వ్ ప్రారంభం సందర్భంగా నేడు దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వెయ్యేళ్లుగా లక్షలాది ప్రజల హృదయాల్లో సోమనాథ్‌ను సజీవంగా నిలిపిన కాలాతీత నాగరికతా స్ఫూర్తిని ఆయన గుర్తుచేసుకున్నారు.