న్యూస్ 18 రైజింగ్ భారత్ సదస్సులో ప్రధాని ప్రసంగం

February 27th, 08:30 pm

‘రైజింగ్ ఇండియా’ గురించి మీరంతా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అంతర్గత శక్తి గురించి ఎక్కువగా చెబుతున్నారు. సూటిగా చెప్పాలంటే.. స్వభావ సిద్ధమైన దేశ స్వీయ సామర్థ్యాల మీదే మీరు ప్రధానంగా దృష్టి సారించారు. ‘తత్వమసి’ అని మన గ్రంథాలు బోధిస్తున్నాయి. అంటే, మనం ఎక్కడో వెతుకులాడుతున్న దైవిక శక్తి మనలోనే ఉంది. అది మనమే. ఆ శక్తి మనలోనే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. గత 11 ఏళ్లలో భారత్ తనలో ఉన్న ఈ అసలైన శక్తిని గుర్తించింది. నేడు ఆ శక్తి ప్రవర్ధమానమయ్యేలా దేశం నిరంతరం పురోగమిస్తోంది.

నెట్‌వర్క్ 18 రైజింగ్ భారత్ సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 27th, 08:00 pm

రైజింగ్ భారత్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ‘అంతర్గత శక్తి’ అంశంపై ఆయన ప్రసంగం సాగింది. గత 11 ఏళ్లలో దేశ ప్రయాణం, జాతీయ సామర్థ్యాన్ని తిరిగి పొందడం, ఆర్థిక స్వావలంబన, 2047 నాటికి వికసిత్‌ భారత్ లక్ష్యం కోసం రూపొందించిన ప్రణాళిక గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు.

అస్సాంలోని గోలాఘాట్ లో పాలీప్రొపిలీన్ సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

September 14th, 03:30 pm

భారత్ మాతా కీ జై! ప్రజాదరణ పొందిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు సర్బానంద సోనోవాల్, హర్దీప్ సింగ్ పూరి, అస్సాం ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా సోదరీసోదరులారా!

అస్సాంలోని గోలాఘాట్‌లో బయోఇథనాల్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవం, పాలీప్రొపిలీన్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని

September 14th, 03:00 pm

హరిత ఇంధనాన్ని ప్రోత్సహించటం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాం రాష్ట్రం గోలాఘాట్‌లోని నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో (ఎన్ఆర్ఎల్) బయోఇథనాల్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. దీనితో పాటు పాలీప్రొపిలీన్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. షరోదియ దుర్గా పూజను పురస్కరించుకొని అస్సాం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక గురువు శ్రీమంత శంకరదేవ్ జయంతి చాలా గొప్పదన్న ఆయన.. పూజ్యులైన గురువులందరికీ నమస్కరిస్తున్నట్లు తెలియజేశారు.

భారత్‌‌లో మారిషస్ ప్రధాని అధికారిక పర్యటన... ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు

September 11th, 02:10 pm

శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞాన రంగంలో సహకార అంశంలో భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికీ, మారిషస్ లో టెర్షియరీ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ రీసెర్చి మంత్రిత్వశాఖ మధ్య అవగాహన ఒప్పందం.

Mauritius is an important pillar of India’s ‘Neighbourhood First’ policy and Vision ‘Mahasagar’: PM Modi

September 11th, 12:30 pm

In his remarks at the joint press meet in Varanasi, PM Modi said that just like the uninterrupted flow of the Ganga in Kashi, the continuous stream of Indian culture has enriched Mauritius. He congratulated PM Ramgoolam and the people of Mauritius on the successful conclusion of the Chagos Agreement. The PM also announced a Special Economic Package for Mauritius to strengthen infrastructure, create jobs, and improve healthcare.

న్యూఢిల్లీలో ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగం

August 07th, 09:20 am

మంత్రివర్గ సహచరుడు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేశ్ చంద్... చాలా మంది స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడున్నారు... వారందరికీ కూడా సగౌరవంగా నమస్కరిస్తున్నాను. శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!

PM Modi addresses the M.S. Swaminathan Centenary International Conference

August 07th, 09:00 am

PM Modi inaugurated and addressed the M.S. Swaminathan Centenary International Conference at ICAR PUSA in New Delhi. Calling Dr. Swaminathan a visionary who ensured India’s food security and turned science into service, PM Modi recalled his pioneering ideas like the Evergreen Revolution and bio-villages. The PM also launched the M.S Swaminathan Award for Food & Peace, reaffirming support for farmers.

వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం

April 11th, 11:00 am

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాధ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బనాస్ డెయిరీ ఛైర్మన్ శంకర్‌భాయ్ చౌధురి, ఆశీస్సులు అందించడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ కుటుంబ సభ్యులందరికీ..

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

April 11th, 10:49 am

ఈ రోజు ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ. 3,880 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, కాశీ నగరంతో తనకు గల గాఢానుబంధాన్ని గురించిన అనుభూతులను పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులు, ప్రాంత ప్రజలు తనకు అందించిన ఆశీస్సులకు, తనపై కురిపించే ఆదరాభిమానాలకు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందించే ప్రేమ తనను రుణగ్రస్తుడిని చేసిందని, తాను కాశీకి, కాశీ తనకు చెందుతుందన్నారు. రేపు హనుమాన్ జన్మోత్సవమని గుర్తు చేస్తూ, కాశీలోని సంకట మోచన మహారాజ్ ను సందర్శించే గౌరవం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. హనుమాన్ జన్మోత్సవ పావన సందర్భాన్ని జరుపుకోవడానికి ముందస్తుగా అభివృద్ధిని వేడుక చేసుకునేందుకు కాశీ ప్రజానీకం తరలి రావడం హర్షదాయకమన్నారు.