వికసిత భారత్ లక్ష్యం దిశగా వివిధ రంగాల ప్రగతిపై ప్రధానమంత్రి అధ్యక్షతన సమీక్ష
July 22nd, 07:37 pm
వికసిత భారత్ లక్ష్యం దిశగా వివిధ రంగాల్లో ప్రగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమీక్షించారు. ఈ మేరకు తన నివాసమైన నం.7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి స్వయంగా అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక సంక్షేమం సహా అనుబంధ రంగాల పురోగమనంపై ఆయా శాఖల కార్యదర్శులతో కూలంకషంగా చర్చించారు.కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సహకారంపై భారత్ - జపాన్ సంయుక్త ప్రకటన
July 02nd, 10:14 pm
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలూ - వ్యాపారాలూ, పాలన, భద్రతా రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తూ.. సర్వోపయోగకర సాంకేతికతగా నేటి కాలాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తోందని భారత్, జపాన్ ప్రధానమంత్రులు వ్యాఖ్యానించారు. ఏఐ రూపకల్పన, అభివృద్ధి, విస్తరణ, పాలన అంశాల్లో నేడు మనం తీసుకునే నిర్ణయాలు.. భవిష్యత్తులో ఆవిష్కరణలు, సామాజిక సంక్షేమం, ఆర్థిక భద్రత, ప్రపంచ క్రమంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని వారు అంగీకరించారు. ఈ అవగాహనే ప్రాతిపదికగా.. ఇరుదేశాల్లో ఆవిష్కరణలనూ, వృద్ధినీ పెంపొందించుకోవడంతోపాటు ఏఐ రంగంలో సామర్థ్యాన్నీ, పోటీతత్వాన్నీ పరస్పరం మెరుగుపరచుకునే దిశగా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తద్వారా సురక్షితమైన, భద్రమైన, విశ్వసనీయ, సమ్మిళిత, మానవుడే కేంద్రంగా ఉండే, సుస్థిరమైన, జవాబుదారీతనంతో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించాలని వారు సంకల్పించారు.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 16th, 01:32 pm
సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సిక్కిం తన 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణం, ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, ప్రశంసనీయమైనదని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ 50వ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ... అక్కడి ప్రజలు చూపిన ఆప్యాయత, అభిమానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శ్రీ మోదీ అన్నారు.తమిళనాడు ముఖ్యమంత్రిగా శ్రీ సి. జోసెఫ్ విజయ్ పదవీ ప్రమాణం.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
May 10th, 11:10 am
తమిళనాడు ముఖ్యమంత్రిగా శ్రీ సి. జోసెఫ్ విజయ్ ఈ రోజు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను అభినందించారు.నిస్వార్థ సేవ, కరుణ భావననూ
May 06th, 09:12 am
నిస్వార్థ సేవా భావనతో చేసే పనే సిసలైన మానవత్వమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి పనులు మనసుకు సంతోషాన్ని కలిగించడంతో పాటు, సమాజ సంక్షేమానికీ తోడ్పాటును అందిస్తాయని ఆయన తెలిపారు.ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన
April 26th, 03:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 28 సాయంత్రం సుమారు 5 గంటలకు వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అక్కడ ఆయన సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.UDF మరియు LDFలు మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తూ, అవినీతికి పాల్పడుతూ రెట్టింపు నష్టాన్ని కలిగిస్తున్నాయి: ప్రధాని మోదీ
April 02nd, 05:00 pm
“మేరా బూత్ సబ్సే మజ్బూత్” కార్యక్రమం కింద కేరళ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సంస్థలను ఉత్తేజపరిచి, చారిత్రాత్మక రాజకీయ మార్పుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం బీజేపీ-ఎన్డీఏకు అనుకూలంగా బలమైన పవనాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు.“మేరా బూత్ సబ్సే మజ్బూత్” ప్రచారంలో భాగంగా కేరళ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ భేటీ
April 02nd, 04:30 pm
“మేరా బూత్ సబ్సే మజ్బూత్” కార్యక్రమం కింద కేరళ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సంస్థలను ఉత్తేజపరిచి, చారిత్రాత్మక రాజకీయ మార్పుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం బీజేపీ-ఎన్డీఏకు అనుకూలంగా బలమైన పవనాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు.సంస్కృత సుభాషితం ద్వారా డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామీజీకి ప్రధాని నివాళి
April 01st, 10:37 am
పూజనీయ డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామీజీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్య, సామాజిక సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేసిన అసమానమైన కృషి.. నిస్వార్థ సేవ దిశగా దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళుకి ప్రధానమంత్రి ఘన నివాళి
April 01st, 10:33 am
నేడు ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. కరుణ, వినయం, మానవాళికి నిరంతరం చేసిన సేవలతో ఆయన.. ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇతరుల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసి, నిస్వార్థ సేవలోనే నిజమైన గొప్పతనం ఉందని నిరూపించారని తెలిపారు. విద్య, సామాజిక సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేసిన అసాధారణమైన కృషి సమాజంపై చెరగని ముద్ర వేసిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నిస్వార్థం, సేవా మార్గంలో వెళ్లాలనుకునే ఎంతో మందికి ఆయన జీవితం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తూ, స్ఫూర్తినిస్తోందని వ్యాఖ్యానించారు.మలేషియా ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని ప్రకటన
February 08th, 08:35 am
ముందుగా నాకు ఆత్మీయంగా స్వాగతం పలికిన నా ఆప్తమిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతేడాది ఆసియాన్ సదస్సు సందర్భంగా మలేషియాను సందర్శించలేకపోయాను. కానీ వీలైనంత తొందరలోనే మలేషియాకు వస్తానని నా ప్రియమిత్రుడికి అప్పట్లో మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం.. 2026లో నా తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియాలో ఉన్నాను.మలేషియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా విడుదల చేసిన భారత్, మలేషియా ఉమ్మడి ప్రకటన
February 08th, 08:30 am
మలేషియా ప్రధానమంత్రి శ్రీ దాతో సెరీ అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు మలేషియాలో అధికారిక పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత సంబంధాలపై ఆధారపడిన ఉన్న లోతైన స్నేహం, సుదీర్ఘ ప్రజల మధ్య బంధాలను తెలియజేసింది. భారత్-మలేషియా 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్ఠం చేయటం, విస్తరించడానికి ఇరు దేశాల నాయకులకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది.అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లున్నప్పటికీ భారత్ సాధిస్తున్న పురోగతికి, దేశ సంస్కరణల వేగానికి ఆర్థిక సర్వే సమగ్ర ప్రతిబింబమని కొనియాడిన ప్రధానమంత్రి
January 29th, 08:31 pm
ఇవాళ సమర్పించిన ఆర్థిక సర్వే, భారతదేశ సంస్కరణల వేగానికి సమగ్ర రూపమని, అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లున్నప్పటికీ దేశం సాధిస్తున్న స్థిరమైన పురోగతిని ఇది ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. బలమైన స్థూల ఆర్థిక అంశాలు, సుస్థిర వృద్ధి, దేశ నిర్మాణంలో ఆవిష్కరణలు, వ్యాపార దక్షత, మౌలిక సదుపాయాల విస్తరణ పాత్రను ఆర్థిక సర్వే స్పష్టం చేసిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, యువతకు ఉపాధి, సామాజిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, సమ్మిళిత అభివృద్ధి ప్రాధాన్యతను ఈ సర్వే వెల్లడించింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయటానికి, ఉత్పాదకతను పెంచటానికి, వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం చేయటానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ని ఇది వివరించింది అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.సమాజ సంక్షేమం కోసం సద్భావనల శక్తిని సుభాషితం ద్వారా చెప్పిన ప్రధాని
December 31st, 09:06 am
సమాజ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సద్భావన అత్యంత ప్రధానమైనదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.Prime Minister Condoles the Demise of Shri Shivraj Patil
December 12th, 10:26 am
Prime Minister Shri Narendra Modi today condoled the passing of Shri Shivraj Patil, describing him as an experienced leader who devoted his life to public service.అంతరిక్ష అన్వేషణపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని చేసిన ప్రసంగం
May 07th, 12:00 pm
గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ కాన్ఫరెన్స్-2025లో మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. అంతరిక్షం కేవలం ఓ గమ్యస్థానం కాదు. అది ఆసక్తి, ధైర్యం, సమష్టి ప్రగతిని ప్రకటించే అంశం. భారతీయ అంతరిక్ష ప్రయాణం ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. 1963లో ఓ చిన్న రాకెట్ ప్రయోగం నుంచి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి దేశంగా ఎదిగేంత వరకు మా ప్రయాణం అత్యద్భుతం. మా రాకెట్లు పేలోడ్లను మించిన బరువును మోస్తున్నాయి. 1.4 బిలియన్ల మంది భారతీయుల కలలను అవి మోస్తున్నాయి. భారత్ సాధించిన విజయాలు శాస్త్ర రంగంలో గొప్ప మైలురాళ్లు. వీటన్నింటినీ మించి, మానవ స్ఫూర్తి... గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తుందనడానికి ఇది గొప్ప రుజువు. 2014లో మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకొని భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై నీటి జాడను కనుగొనేందుకు చంద్రయాన్-1 తోడ్పడింది. చంద్రయాన్-2 అధిక స్పష్టత ఉన్న చంద్రుని ఛాయాచిత్రాలను మనకు పంపింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై మన అవగాహనను చంద్రయాన్–3 పెంచింది. మేం రికార్డు సమయంలో క్రయోజనిక్ ఇంజిన్లను తయారుచేశాం. ఒకే ప్రయోగంలో 100 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. మా వాహక నౌకల ద్వారా 34 దేశాలకు చెందిన 400 ఉపగ్రహాలను కక్ష్యంలో ప్రవేశపెట్టాం. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను పూర్తి చేశాం. ఇది పెద్ద విజయం.అంతరిక్ష శోధనపై అంతర్జాతీయ సదస్సు-2025 (జిఎల్ఇఎక్స్)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 07th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అంతరిక్ష శోధనపై అంతర్జాతీయ సదస్సు-2025 (జిఎల్ఇఎక్స్)ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత ప్రపంచవ్యాప్తంగాగల విశిష్ట ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యోమగాములను ఆయన స్వాగతించారు. అంతరిక్ష రంగంలో భారత్ అద్భుత పయనం గురించి జిఎల్ఇఎక్స్- 2025లో పాల్గొంటున్నవారికి ప్రముఖంగా వివరించారు. ““అంతరిక్షమంటే కేవలం ఒక గమ్యం కాదు.. ఉత్సుకత-సాహసం-సమష్టి ప్రగతిని ప్రస్ఫుటం చేసే సంకల్పం” అని ఆయన అభివర్ణించారు. భారత్ 1963లో ఓ చిన్న రాకెట్‌ను ప్రయోగించిన నాటినుంచి చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపిన తొలి దేశం స్థాయి ఎదగడం వరకూ సాధించిన విజయాలు ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని ఆయన స్పష్టం చేశారు. “భారతీయ రాకెట్లు తమ కార్యభారాన్ని మించి... అంటే- 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను మోస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాయి” అని వ్యాఖ్యానించారు. అలాగే భారత అంతరిక్ష విజయాలు శాస్త్రవిజ్ఞానంలో కీలక ఘట్టాలని, సమస్యలను అధిగమించడంలో మానవాళి స్ఫూర్తికినిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. భారత్ 2014నాటి తన తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకోవడం ద్వారా చారిత్రక విజయం సాధించిందని గుర్తుచేశారు. జాబిలిపై జలం జాడను పసిగట్టడంలో చంద్రయాన్-1 ప్రయోగం తోడ్పడిందని పేర్కొన్నారు. తదుపరి చంద్రయాన్-2 ప్రయోగం చంద్ర ఉపరితల సుస్పష్ట (అత్యధిక రిజల్యూషన్) చిత్రాలను అందించిందని, ఇక తాజా చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువంపై మానవాళి అవగాహనను మరింత పెంచిందని విశదీకరించారు. “భారత్ రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజిన్లను రూపొందించింది. ఒకే రాకెట్ ద్వారా 100 ఉపగ్రహాలను ప్రయోగించింది.. భారత ప్రయోగ వాహనాల ద్వారా 34కుపైగా దేశాలకు చెందిన 400కు మించి ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో నిలిపింది” అని వివిధ విజయాలను ప్రధాని ఏకరవు పెట్టారు. ఇదే క్రమంలో ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధానం ద్వారా భారత్ సాధించిన తాజా విజయాన్ని ప్రస్తావిస్తూ- అంతరిక్ష పరిశోధనలో ఇదొక కీలక ముందడుగని పేర్కొన్నారు.అనువాదం: 17వ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
April 21st, 11:30 am
నా మంత్రివర్గ సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ శక్తికాంత దాస్ గారు, డాక్టర్ సోమనాథన్ గారు, ఇతర సీనియర్ అధికారులు, దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్‌కు చెందిన సహచరులు, మహిళలు, పెద్దలు.. !17వ సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 21st, 11:00 am
ఈ రోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో 17వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్లనుద్దేశించి ప్రసంగించారు. ప్రజాపాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రి శ్రేష్ఠత అవార్డులను ప్రదానం చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ మోదీ, సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం రాజ్యాంగం 75వ సంవత్సరాల వేడుకలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా సివిల్ సర్వీసెస్ డే మరింత విశిష్ఠతను సంతరించుకుందన్నారు. అలనాడు 1947 ఏప్రిల్ 21న సర్దార్ పటేల్ చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, సర్దార్ సివిల్ సర్వెంట్లను ‘భారత దేశ ఉక్కు కవచం’గా అభివర్ణించారని గుర్తు చేశారు. పూర్తి అంకితభావంతో పని చేస్తూ, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే పాలనా యంత్రాంగాన్ని పటేల్ కోరుకున్నారని చెప్పారు. వికసిత్ భారత్ ఆశయ సాకారంలో సర్దార్ పటేల్ ఆదర్శాలు దారిదీపాలంటూ, పటేల్ దార్శనికత, వారసత్వానికి హృదయపూర్వక నివాళి అర్పించారు.దావూదీ బోహ్రా సమాజ ప్రతినిధులతో ప్రధాని సంభాషణ
April 17th, 08:05 pm
ఈ బృందంలో దావూదీ బోహ్రా సమాజానికి చెందిన వ్యాపారవేత్తలు, నిపుణులు, వైద్యులు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు ఉన్నారు. తమ సమాజం ఎదుర్కొన్న ఇబ్బందులను, తమలో కొందరికి చెందిన ఆస్తులను వక్ఫ్ అక్రమంగా ఎలా స్వాధీనం చేసుకుందో వివరించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మార్పు చేయాలన్న డిమాండు దీర్ఘకాలంగా ఆచరణకు నోచుకోలేదన్నారు.