Prime Minister greets people of Assam on Asom Diwas

December 02nd, 03:56 pm

The Prime Minister, Shri Narendra Modi has extended his best wishes to sisters and brothers of Assam on Asom Diwas. Shri Modi stated that today is an occasion to reiterate our commitment to fulfilling the vision of Swargadeo Chaolung Sukapha. Over the last few years, the NDA Governments in the Centre and Assam are working tirelessly to boost the progress of Assam. Remarkable strides have been made in enhancing physical and social infrastructure. Numerous steps are being taken towards popularising the Tai-Ahom culture and Tai language. This will greatly benefit the youth of Assam, Shri Modi added.

తమిళనాడులోని రామేశ్వరంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం

April 06th, 02:00 pm

తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, డాక్టర్ ఎల్.మురుగన్ గారు… తమిళనాడు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదరసోదరీమణులారా నమస్కారం.

తమిళనాడులోని రామేశ్వరంలో రూ.8,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

April 06th, 01:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని రామేశ్వరంలో రూ.8,300 కోట్లకు పైగా విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ముందుగా, ఆయన భారత్‌లో తొలి వెర్టికల్ లిఫ్ట్ సముద్ర రైలు వంతెన అయిన కొత్త పంబన్ రైలు వంతెనను ప్రారంభించారు. రోడ్ బ్రిడ్జ్ వద్ద నుంచి ఒక రైలును, ఓ నౌకను ప్రారంభించారు. వంతెన కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూశారు. అనంతరం రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈరోజు శ్రీరామనవమి శుభదినమని అన్నారు. ఈరోజు ఉదయం అయోధ్యలోని భవ్య రామ మందిరంలో రామ్ లల్లా నుదుటిన సూర్యుని దివ్య కిరణాలు మహత్తర తిలకంగా అభిషేకించాయని తెలిపారు. “భగవాన్ శ్రీరాముని జీవితం, ఆయన ఉత్తమ పాలనా స్ఫూర్తి దేశ నిర్మాణానికి ఒక గొప్ప పునాది” అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని సంగం నాటి సాహిత్యంలో కూడా భగవాన్ శ్రీరాముడి ప్రస్తావన ఉందని ఆయన అన్నారు. రామేశ్వరంలోని పవిత్ర భూమి నుంచి దేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

న్యూ ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

December 06th, 02:10 pm

అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ గారు, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోన్‌రాడ్ సంగ్మా గారు, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా గారు, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేంసింగ్ తమాంగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, సుకాంత మజుందార్ గారు, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మిజోరం, నాగాలాండ్ ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులు , మహిళలు, ప్రముఖులారా,

అష్టలక్ష్మి మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 06th, 02:08 pm

అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానిస్తూ, ఈరోజు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవం కూడా ఉందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొందని, ఈ రాజ్యాంగం దేశ పౌరులందరికీ గొప్ప ప్రేరణను అందిస్తోందని ప్రధాని అన్నారు. భారత పౌరులందరి పక్షాన బాబా సాహెబ్ అంబేద్కర్‌కు శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.

ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జులై 26న కార్గిల్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

July 25th, 10:28 am

ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రేపు 2024 జులై 26న ఉదయం పూట సుమారు 9 గంటల 20 నిమిషాల వేళలో కార్గిల్ యుద్ధ స్మారకానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. కార్గిల్ యుద్ధం లో ప్రాణాలను ఆహుతి ఇచ్చిన అమర వీరులకు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. షింకున్ లా సొరంగ మార్గ ప్రాజెక్టులో భాగంగా తొలి పేలుడు ఘట్టాన్ని ప్రధాన మంత్రి వర్చువల్ మాధ్యమం ద్వారా ఆరంభించనున్నారు.

India is moving ahead with the principle of ‘Think Big, Dream Big, Act Big: PM Modi

July 26th, 11:28 pm

PM Modi dedicated to the International Exhibition-cum-Convention Centre (IECC) complex at Pragati Maidan in New Delhi. He said, “Bharat Mandapam is a call for India’s capabilities and new energy of the nation, it is a philosophy of India’s grandeur and willpower.”

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన- సమావేశ కేంద్ర (ఐఇసిసి) ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం

July 26th, 06:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూ ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశ కేంద్రం (ఐఇసిసి) సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే జి-20 స్మారక నాణెం, తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరించారు. డ్రోన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమావేశ కేంద్రానికి ‘భారత్ మండపం’గా ప్రధాని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా దాదాపు రూ.2700 కోట్లతో జాతీయ ప్రాజెక్టు కింద ‘ఐఇసిసి’ సముదాయాన్ని నిర్మించారు. ప్రగతి మైదాన్‌లో రూపుదిద్దుకున్న ఈ నవ సౌధం ప్రపంచ వ్యాపార గమ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో తనవంతు తోడ్పాటునిస్తుంది. ఈ సందర్భంగా జాతి హృదయాల్లో ఉప్పొంగిన ఉత్సాహాన్ని, మనోభావాల్లోని ఉత్తేజాన్ని సూచించే ఒక పద్యంతో ప్రధానమంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. “భారత మండపం దేశ సామర్థ్యానికి, నవశక్తికి మారుపేరు. ఇది భారతదేశ వైభవాన్ని, సంకల్ప శక్తిని చాటే సిద్ధాంతం” అని ఆయన వ్యాఖ్యానించారు.

National Rozgar Mela has become the new identity of the present government: PM Modi

June 13th, 11:00 am

PM Modi addressed the National Rozgar Mela and distributed about 70,000 appointment letters to newly inducted recruits in various Government Departments and Organizations. He remarked that the National Rozgar Mela has become the new identity of the present government and that new opportunities of employment and self-employment have emerged in the economy.

జాతీయ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

June 13th, 10:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన జాతీయ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రసంగించారు. అంతేకాక ప్రభుత్వం లో వేరు వేరు విభాగాలు మరియు సంస్థల లో క్రొత్త గా ఉద్యోగం లో నియమించిన వ్యక్తుల కు ఇంచుమించు 70,000 నియామక లేఖల ను కూడా ఆయన పంపిణీ చేశారు. దేశవ్యాప్తం గా క్రొత్త గా ఉద్యోగాల లో నియమించినటువంటి వారు ప్రభుత్వం లో ఆర్థిక సేవల విభాగం, తపాలా విభాగం, పాఠశాల విద్య విభాగం, ఉన్నత విద్య విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ, రెవిన్యూ విభాగం, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, అణు శక్తి విభాగం, రేల్ వే మంత్రిత్వ శాఖ, ఆడిట్ ఎండ్ అకౌంట్స్ విభాగం, అణు శక్తి విభాగం మరియు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తదితర వివిధ విభాగాల లో చేరనున్నారు. ప్రధాన మంత్రి ప్రసంగం వేళ లో దేశ వ్యాప్తం గా 43 ప్రదేశాల ను సంధానించడం జరిగింది.

ఏయిమ్స్ గౌహతి ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 14th, 12:45 pm

అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా జీ, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ జీ, కేంద్ర కేబినెట్‌లోని నా సహచరులు, దేశ ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాజీ మరియు డాక్టర్ భారతి పవార్ జీ, అస్సాం ప్రభుత్వ మంత్రి కేశబ్ మహంతా జీ, ప్రముఖులందరూ వైద్య ప్రపంచం నుండి, వివిధ ప్రాంతాల నుండి వీడియో కాన్ఫరెన్స్‌తో అనుసంధానించబడిన ప్రముఖులందరూ మరియు అస్సాంలోని నా ప్రియమైన సోదర సోదరీమణులారా.

అస్సాం లో రూ.3,400 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాన మంత్రి

April 14th, 12:30 pm

శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాంలోని గువాహతి లో అస్సాం లో రూ.3,400 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గువాహతి ఎయిమ్స్, మరో మూడు మెడికల్ కాలేజీలను ఈ సందర్భంగా ప్రధాని జాతికి అంకితం చేశారు. అదే విధంగా అస్సాం అడ్వాన్స్ డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్ స్టిట్యూట్ కు శంకుస్థాపన చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులను పంచటం ద్వారా ‘ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్’ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతుల అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో సందేశం

April 04th, 09:46 am

గౌరవ అతిథులు, ప్రభుత్వాధినేతలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విధానకర్తలు, ప్రపంచం మొత్తం నుండి వచ్చిన నా ప్రియ మిత్రులారా !

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై 5వ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన - ప్రధానమంత్రి

April 04th, 09:45 am

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలు - సి.డి.ఆర్.ఐ. పై 5వ అంతర్జాతీయ సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

కర్నాటకలోని బెంగుళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2023లో ప్రధానమంత్రి ప్రసంగం

February 06th, 11:50 am

విధ్వంసకర భూకంపంతో దెబ్బతిన్న టర్కీలో పరిస్థితిని మేము పర్యవేక్షిస్తున్నాము. అనేక విషాద మరణాలు మరియు అపార నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. టర్కీ చుట్టూ ఉన్న దేశాలు కూడా నష్టాన్ని చవిచూస్తాయని భయపడ్డారు. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల సానుభూతి భూకంప బాధితులందరికీ ఉంది. భూకంప బాధితులకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ కట్టుబడి ఉంది.

బెంగళూరులో ‘ఇండియా ఎనర్జీ వీక్-2023’కు ప్రధాని శ్రీకారం

February 06th, 11:46 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలు-2023 (ఇండియా ఎనర్జీ వీక్)కు శ్రీకారం చుట్టారు. అలాగే ఇండియన్ ఆయిల్ లిమిటెడ్‌ (ఐఓఎల్‌) ‘అన్ బాటిల్డ్‌’ కార్యక్రమం కింద యూనిఫారాలను ప్రారంభించారు. వీటిని రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ సీసాల (పెట్‌ బాటిళ్లు)తో తయారుచేశారు. దీంతోపాటు ‘ఐఓఎల్‌’ రూపొందించిన ఇన్‌డోర్‌ సౌరశక్తి వంట వ్యవస్థ జంట స్టవ్‌లను జాతికి అంకితం చేయడంతోపాటు మార్కెట్‌ ప్రవేశం చేయించారు.

మహారాష్ట్రలోని ముంబైలో పిఎం- స్వనిధి యోజన కింద లబ్ధిదారులకు అభివృద్ధి పనుల ప్రారంభం, ఆమోదించబడిన రుణాల బదిలీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 19th, 05:15 pm

ఈరోజు ముంబై అభివృద్ధికి సంబంధించి రూ.40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఇక్కడే అంకితం చేసి శంకుస్థాపన చేశారు. ముంబైకి చాలా ముఖ్యమైన మెట్రో కావచ్చు, ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఆధునీకరణ, రోడ్లను మెరుగుపరచడానికి భారీ ప్రాజెక్ట్, మరియు బాలాసాహెబ్ థాకరే పేరు మీద ఆప్లా దవాఖానా ప్రారంభం, ఈ ప్రాజెక్టులన్నీ ముంబై నగరాన్ని మెరుగుపరచడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. కొద్దిసేపటి క్రితం, ముంబైలోని వీధి వ్యాపారులు కూడా పిఎం-స్వనిధి యోజన కింద వారి బ్యాంకు ఖాతాలలో డబ్బును పొందారు. అటువంటి లబ్దిదారులందరినీ మరియు ప్రతి ముంబైవాసిని నేను అభినందిస్తున్నాను.

మహారాష్ట్రలోని ముంబైలో రూ.38,800 కోట్ల మేర అనేకఅభివృద్ధిపనుల ప్రారంభోత్సవం.. శంకుస్థాపన.. జాతికి అంకితం చేసిన ప్రధాని

January 19th, 05:05 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలోని ముంబైలో దాదాపు రూ.38,800 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనతోపాటు కొన్నిటిని జాతికి అంకితం చేశారు. అలాగే ‘పీఎం స్వానిధి’ పథకం కింద లక్షమంది లబ్ధిదారులకు మంజూరైన రుణాలను వారి ఖాతాలకు బదిలీ చేశారు. ముంబైలో మెట్రో రైలు మార్గాలు ‘2ఎ, 7’లను ఆయన దేశానికి అంకితం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సహా 7 మురుగు శుద్ధి యంత్రాగారాల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. వీటితోపాటు 20 ‘హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే ఆప్లా దవాఖానా’లు ప్రారంభించారు. అలాగే ముంబైలో దాదాపు 400 కిలోమీటర్ల పొడవైన రోడ్ల కాంక్రీట్‌ పనులకు శ్రీకారం చుట్టారు.

గోవాలోని మోపాలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

December 11th, 06:45 pm

ఈ అద్భుతమైన కొత్త విమానాశ్రయం కోసం గోవా ప్రజలకు మరియు దేశ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు. గత 8 సంవత్సరాలలో, మీ అందరి మధ్య ఉండే అవకాశం దొరికినప్పుడల్లా, నేను ఒక్క మాట మాత్రమే చెప్పాను, అంటే, మీరు మాపై కురిపించిన ప్రేమ మరియు ఆశీర్వాదాలను నేను ఆసక్తితో తిరిగి చెల్లిస్తాను; అభివృద్ధితో. ఈ ఆధునిక విమానాశ్రయ టెర్మినల్ అదే ప్రేమను తిరిగి చెల్లించే ప్రయత్నం. ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి నా ప్రియమైన సహోద్యోగి మరియు గోవా కుమారుడు దివంగత మనోహర్ పారికర్ జీ పేరు పెట్టబడినందున నేను కూడా సంతోషిస్తున్నాను. ఇప్పుడు మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పేరుతో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ పారికర్ జీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

PM inaugurates greenfield International Airport in Mopa, Goa

December 11th, 06:35 pm

PM Modi inaugurated Manohar International Airport, Goa. The airport has been named after former late Chief Minister of Goa, Manohar Parrikar Ji. PM Modi remarked, In the last 8 years, 72 airports have been constructed compared to 70 in the 70 years before that. This means that the number of airports has doubled in the country.