గుజరాత్‌లోని వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 08th, 12:30 pm
గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.గుజరాత్‌లోని వడోదరాలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు
September 08th, 12:00 pm
గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి ముఖాముఖి
September 05th, 10:00 am
లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సమావేశమయ్యారు. ఈ ఏడాది మూడు విభాగాలకు చెందిన మొత్తం 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలను జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి చెందిన 48 మంది ఉపాధ్యాయులు, ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్‌లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు/ఫ్యాకల్టీ సభ్యులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖకు చెందిన 13 మంది నైపుణ్య శిక్షకులు ఉన్నారు.పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని కొనియాడిన ప్రధానమంత్రి
August 14th, 08:58 am
పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా దేశ విభజన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరి ధైర్యసాహసాలను స్మరించుకుంటున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విభజన చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నభిన్నం చేసిందని, కుటుంబాలు చెల్లాచెదురయ్యాయని, ఎంతోమంది ప్రియమైన వారిని కోల్పోయారని, చెప్పలేనంత బాధను అనుభవించాల్సి వచ్చిందన్నారు.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జాతికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
August 07th, 11:14 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జాతికి శుభాకాంక్షలు తెలుపుతూ, భారతదేశపు గొప్ప మరియు ఉజ్వలమైన చేనేత వారసత్వాన్ని కొనియాడారు. తరతరాలుగా దేశ నేత కార్మికులు, కళాకారులు తమ నైపుణ్యం, సృజనాత్మకత, అంకితభావంతో భారతదేశపు శాశ్వత సంప్రదాయాలను పరిరక్షించి, సుసంపన్నం చేశారని పేర్కొంటూ ఆయన వారి అంకితభావానికి నివాళులర్పించారు.ధైర్యాన్నీ, నిరంతర శ్రమనీ విడిచిపెట్టకూడదు: ప్రధానమంత్రి
August 03rd, 09:51 am
భాగ్యం ప్రతికూలంగా మారినప్పటికీ ధైర్యాన్ని వదిలిపెట్టకూడదనీ, ధైర్యంగా ఉంటూ, పట్టుదలను కలిగి ఉన్న వ్యక్తి తాను చేజార్చుకున్న దానిని తిరిగి పొందగలుగుతాడనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిపుణుడైన నావికుడు సముద్ర మధ్యంలో నౌక విరిగి ముక్కలైనా సరే ఆశ వదులుకోకుండా ఈదుకుంటూ జీవించి ఉండేందుకు ప్రయత్నిస్తాడనీ, అలాగే దృఢసంకల్పాన్ని కలిగి ఉండి నిలకడగా ప్రయత్నిస్తూ ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించవచ్చనీ ఆయన వివరించారు.వికసిత భారత్ లక్ష్యం దిశగా వివిధ రంగాల ప్రగతిపై ప్రధానమంత్రి అధ్యక్షతన సమీక్ష
July 22nd, 07:37 pm
వికసిత భారత్ లక్ష్యం దిశగా వివిధ రంగాల్లో ప్రగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమీక్షించారు. ఈ మేరకు తన నివాసమైన నం.7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి స్వయంగా అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక సంక్షేమం సహా అనుబంధ రంగాల పురోగమనంపై ఆయా శాఖల కార్యదర్శులతో కూలంకషంగా చర్చించారు.భారత్ - బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందమూ, సామాజిక భద్రతా ఒప్పందాలపై కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
July 15th, 12:58 pm
భారత్ - బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా), సామాజిక భద్రతా ఒప్పందాలపై కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. భారత్ - బ్రిటన్ భాగస్వామ్యంలో ఇదొక కీలక విజయంగా అభివర్ణించారు. భారత్ - బ్రిటన్ ఆర్థిక సంబంధాలను ఈ రెండు ఒప్పందాలూ మరింత బలోపేతం చేస్తాయనీ, ఇరు దేశాల ఉమ్మడి ఆశయాలను ఆయా దేశాల ప్రజలకు స్పష్టమైన అవకాశాలుగా మలుస్తాయనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.విజ్ఞానం, నైపుణ్యాలు, ఆరోగ్యం గురించి వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని
July 15th, 12:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారు. విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో దేశ యువత బలమైన శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఈ లక్షణాలు వ్యక్తులను శక్తిమంతం చేయడమే కాకుండా.. దేశాభివృద్ధికి గణనీయమైన రీతిలో తోడ్పాటును అందిస్తాయి.ఆస్ట్రేలియాలో భారతీయ ప్రవాసుల సమావేశంలో ప్రధాని ప్రసంగం
July 09th, 03:22 pm
మనం సమావేశమైన ఈ నేల పరంపరానుగత యజమానులకు గౌరవాభివాదాలతో నేను ప్రసంగాన్ని మొదలుపెడుతున్నాను. వారి పూర్వీకులకూ, పెద్దలకూ వినమ్రపూర్వక అభివాదాలు తెలియజేస్తున్నాను. నవతరానికి శుభాకాంక్షలు.ఆస్ట్రేలియాలోని భారతీయులతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 09th, 03:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మెల్బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో ఆస్ట్రేలియాలోగల భారతీయులతో నిర్వహించిన భారీ సభలో వారినుద్దేశించి ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గౌరవనీయ ఆంథోనీ అల్బనీస్ కూడా గౌరవపూర్వకంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
July 09th, 12:34 pm
ప్రస్తుతం ఉన్న భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనను (2009) ఇది పునరుద్ధరిస్తుంది. దళాల పరస్పర నిర్వహణ, సామర్థ్య పెంపుదల, సముద్ర తీర పరిధి, రక్షణ పారిశ్రామిక సహకారం, సైబర్ భద్రత- సాంకేతికత, ఉగ్రవాద నిరోధం, హెచ్ఏడీఆర్‌లతో పాటు యూఎన్‌సీఎల్ఓఎస్, ఆసియాన్, పీఐఎఫ్, ఐఓఆర్ఏలలో ఏకీకృత విధానాన్ని అనుసరించడాన్ని ఇది సహకార రంగాలుగా గుర్తిస్తుంది.గుజరాత్‌లోని సనంద్‌లో ‘సీజీ సెమీ ఓశాట్’ కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
July 04th, 05:15 pm
ఎలా ఉన్నారు మీరందరూ? అంతా క్షేమమేనా? విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అశ్వనీ వైష్ణవ్, ఉత్సాహవంతులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ‘సీజీ పవర్’ సంస్థ చైర్మన్ శ్రీ వేలయన్ సుబ్బయ్య, ‘రెనెసాస్ ఎలక్ట్రానిక్స్’ ప్రెసిడెంట్ కుమారి మాలిని, ‘సీజీ సెమీ’ సంస్థ చైర్మన్ శ్రీ గిరీష్ సహా ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర పారిశ్రామిక ప్రముఖులు, సోదరీసోదరులారా!గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్
July 04th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్' (ఓఎస్ఏటీ) కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దేశం తన లక్ష్యాల పట్ల కలిగి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ప్రారంభోత్సవం ఒక నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేశం తాను అనుకున్న బలమైన సంకల్పాలను ఎటువంటి సంకోచం లేకుండా నిరంతరం వాస్తవరూపంలోకి మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ఏదైనా చేయాలని సంకల్పిస్తే, దానిని కచ్చితంగా సాధిస్తుందనడానికి నేటి ఈ కార్యక్రమమే నిదర్శనం అని శ్రీ మోదీ అన్నారు.జులై 4న రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటన
July 03rd, 11:25 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జులై 4న రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం సుమారు 10:45 గంటలకు జోధ్‌పూర్ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు, సవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం దాదాపు 12:15 గంటలకు, ఆయన బలోతరాకు వెళ్తారు. అక్కడ దాదాపు రూ.1.06 లక్షల కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తి అయిన అభివృద్ధి ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితం చేయడం, ప్రారంభించడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.జపాన్ ప్రధానమంత్రితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 02nd, 01:30 pm
ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ అన్ని రంగాల్లోనూ భారత్ వృద్ధి పయనంలో గత అనేక దశాబ్దాలుగా జపాన్ కీలక ఓ భాగస్వామి. పరస్పర విశ్వాసం, స్నేహబంధానికి ఇదొక అమూల్య పెన్నిధి.పహాడ్‌పూర్ గ్రామంలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని సందర్శించి, నైపుణ్యాలను పెంపొందించటంపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను అభినందించిన ప్రధానమంత్రి
June 20th, 08:49 pm
పహాడ్‌పూర్ గ్రామంలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు.న్యూఢిల్లీలో 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' ప్రోత్సాహకాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 19th, 05:15 pm
నా మంత్రివర్గ సహచరులు శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు, సోదరి శోభ గారు, దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, సాంకేతికతతో అనుసంధానమైన ప్రముఖులందరికీ, నిర్వాహకులకు, ప్రస్తుతం 200 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన సుమారు రెండు లక్షల మందికి... నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పారిశ్రామిక రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన యువ మిత్రుల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కింద సుమారు రూ. 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేసిన ప్రధానమంత్రి
June 19th, 05:00 pm
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, భాగస్వాములనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. భారత యువతకు సాధికారత కల్పించడానికి, దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎం-వీబీఆర్‌వై అమలులో భాగంగా... అన్ని రంగాలకు సామాజిక భద్రతా పరిధిని విస్తరించడంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ ప్రోత్సాహకం దేశవ్యాప్తంగా 15 లక్షల ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడింది.నౌకా వాణిజ్య అనుసంధానం, సహకారానికి గల అవకాశాలపై సీఎంఏ సీజీఎం చైర్మన్, సీఈవో రోడాల్ఫ్ సాడేతో చర్చించిన ప్రధానమంత్రి
June 18th, 06:37 pm
నౌకా వాణిజ్య అనుసంధానం, ప్రపంచ స్థాయిలో నౌకాయాన ధోరణులు, భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకా వాణిజ్య రంగంలో పెరుగుతున్న అవకాశాలపై సీఎంఏ సీజీఎం చైర్మన్, సీఈవో శ్రీ రోడాల్ఫ్ సాడేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు.