బీహార్ లోని శివాన్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

June 20th, 01:00 pm

అందరికీ నమస్కారం. బాబా మహేంద్రనాథ్, బాబా హంసనాథ్, సోహగరా ధామ్, తావే భవానీమాత, అంబికా భవానీ మాత, భారత మొదటి రాష్ట్రపతి దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ల పవిత్ర భూమిపై మీ అందరికి హార్దిక స్వాగతం!

బీహార్లోని సివాన్‌లో రూ.5,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 20th, 12:00 pm

బీహార్లోని సివాన్లో రూ.5,200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాబా మహేంద్రనాథ్, బాబా హన్స్‌నాథ్‌లను స్మరించుకున్నారు. అలాగే పవిత్రమైన సోగర ధామ్‌‌ ప్రాశస్థ్యాన్ని గుర్తుచేశారు. థావే భవానీ మాత, అంబికా భవానీ మాతకు వందనం సమర్పించారు. దేశానికి తొలి రాష్ట్రపతిగా సేవలందించిన దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లోక నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌‌ను ఆయన గౌరవపురస్సరంగా తలచుకున్నారు.

జూన్ 20-21 తేదీల్లో ప్రధానమంత్రి బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యటన

June 19th, 05:48 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 20-21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. జూన్ 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీహార్‌లోని శివాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ప్రధానమంత్రి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

బీహార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానిప్రసంగం

September 15th, 12:01 pm

మిత్రులారా, పాట్నా నగరంలోని బీయూర్ మరియు కరమ్-లెచక్ వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ లు తోపాటుగా అమృత్ పథకం కింద సివానాండ్ ఛప్రావద్ద నీటి సంబంధిత ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభించబడ్డాయి. దీనికి అదనంగా, ముజాఫర్ పూర్ మరియు జమాల్ పూర్ వద్ద నీటి సరఫరా ప్రాజెక్టులకు మరియు ముజఫర్ పూర్ వద్ద నమామి గంగా కింద రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ స్కీం కు కూడా ఇవాళ శంకుస్థాపన జరిగింది. జీవితాన్ని సులభతరం చేసే ఈ కొత్త సౌకర్యాలకు నగర పేదలకు, నగరంలో నివసిస్తున్న మధ్యతరగతి వారికి అభినందనలు.

‘న‌మామి గంగే’ యోజ‌న‌, ‘ఎఎంఆర్ యుటి’ యోజ‌న ల‌లో భాగం గా బిహార్ లో వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

September 15th, 12:00 pm

‘న‌మామి గంగే’ యోజ‌న‌, ‘ఎఎంఆర్ యుటి’ (అమృత్) యోజ‌న ల‌లో భాగంగా బిహార్ లో వివిధ ప్రాజెక్టులను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రోజున ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టుల్లో అమృత్ యోజ‌న లో భాగంగా ప‌ట్నా న‌గ‌రం లోని బేవూర్, క‌రమ్-లీచక్ ల‌లో మురుగు శుద్ధి ప్లాంటుల‌తో పాటు సీవాన్‌, ఛ‌ప్రా ల‌లో జ‌ల ప‌థ‌కాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా న‌మామి గంగే లో భాగంగా ముంగెర్‌, జ‌మాల్‌ పుర్ ల‌లో నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాల‌కు, ముజ‌ప్ఫర్‌ పుర్ లో రివ‌ర్ ఫ్రంట్ డెవల‌ప్‌మెంట్ స్కీము కు శంకుస్థాప‌న లు జ‌రిగాయి.

People of Bihar have lost faith in Mahaswarthbandhan: PM Modi in Bihar

October 26th, 05:05 pm